బెంగళూరు నుంచి తిరుపతికి హెలికాప్టర్ సర్వీస్
తిరుమల తీర్థయాత్రను సులభతరం చేయడానికి కొత్తగా బెంగళూరు నుంచి తిరుపతికి హెలికాప్టర్ సేవలు ప్రారంభించారు, ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం నుండి తిరుపతికి హెలికాప్టర్ ఈ సేవలను అందిస్తోంది. ఉదయం 9.15 నుండి 9.30 గంటల మధ్య బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో హెలికాప్టర్ బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుండి 4.15 గంటల మధ్యలో తిరుపతి నుండి బెంగళూరుకు బయలుదేరవచ్చు.
తిరుపతికి బయలుదేరే హెలికాప్టర్‌లో ఐదుగురు ప్రయాణించడానికి అవకాశం ఉంది. హెలికాప్టర్ రైడ్ బెంగళూరు-తిరుపతి నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. బెంగళూరు నుండి తిరుపతికి సుమారు నాలుగు గంటల నుంచి ఐదు గంటల ప్రయాణించడానికి సమయం పడుతుంది. హెలికాప్టర్ సేవతో తిరుమల వెళ్లే భక్తులు దాదాపు 1. 5 గంటల్లో తిరుపతి చేరుకోవడానికి అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు అంటున్నారు.
తరువాత తిరుపతి నుంచి తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. బెంగళూరు నుంచి తిరుపతికి హెలికాప్టర్‌లో ప్రయాణించాలంటే జీఎస్టీ మినహా దాదాపు రూ.3, 50, 000 ఖర్చు అవుతుంది. రూ. 3, 50, 000 నుండి పూర్తి హెలికాప్టర్ అందుబాటులో ఉంది. రూ. 3. 50, 000 లక్షలకు ఒకేసారి ఐదుగురు ప్రయాణికులు వెళ్లవచ్చు. ఒంటరిగా వెళుతున్నప్పటికీ మీరు ఈ ప్రైవేట్ హెలికాప్టర్ పొందవచ్చు.
ఫ్లైబ్లేడ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా బుకింగ్‌లు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. వెబ్‌సైట్‌లో లేదా 1800-102-5233లో బుకింగ్‌లు చేయవచ్చు. బుకింగ్‌లు కనీసం 24 గంటల ముందుగానే చేయాలి. దేశవ్యాప్తంగా యాత్రికులు తిరుపతి నగరానికి చేరుకుని తరువాత తిరుమల వెళ్లడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి తిరుపతిలోని విమానాశ్రయానికి రేణిగుంట విమానాశ్రయం కు చాలా మంది చేరుకుని తరువాత తిరుమల వెలుతున్నారు.
Jun 10 2023, 15:46