/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png StreetBuzz "క్యూ న్యూస్" ఆఫీస్ పై దాడి చేయడం హేయమైన చర్య - జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి ఖండన TS breaking
"క్యూ న్యూస్" ఆఫీస్ పై దాడి చేయడం హేయమైన చర్య - జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి ఖండన

జగిత్యాల జిల్లా కేంద్రం 

మార్చి 20, 2023

ప్రజా సమస్యలను వెలికి తీసి పరిస్కారానికి కృషి చేస్తున్న "క్యూ న్యూస్" కార్యాలయంపై దాడిచేయ డాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరునగరి శ్రీనివాస్ లు కోరారు.

ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా వార్త ప్రసారసాధనాలు పనిచేస్తున్నాయని అటువంటి ప్రసారసాధనల కార్యాలయాలపై దుండగులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిషన్ రెడ్డి శ్రీనివాస్ లు సోమవారం ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు క్యూ న్యూస్ ఛానెల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్న తీన్మార్ మల్లన్న ప్రజాధారణ పొందుతున్నాడని అక్కసు పెంచుకున్న కొందరు వ్యక్తులు కార్యాలయంపై దాడి చేసి కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేయడం పత్రిక స్వేచ్ఛను కాలరాయాడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్యాంగంలో వార్త ప్రసారసాధనాలకు గౌరవం ఉందని ఫోర్త్ ఎస్టేట్ గా భావించే వార్త ప్రసారసాధనలను ఆగౌరవపరిచేవిధంగా దాడులకు పాల్పడడం క్షమించరానిదన్నారు. క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేసి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కిషన్ రెడ్డి, శ్రీనివాస్ లు అన్నారు.

ఫీజుల పేరిట పదవతరగతి విద్యార్థులకు హాల్ టికెట్ లు ఇవ్వకుంటే సహించేది లేదు ఏ ఐ పి ఎస్ యు మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్

అఖిల భారత ప్రగతి శీల విద్యార్థి సంఘం మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ మాట్లాడుతూ, ఫీజుల పేరిట పదవ తరగతి విద్యార్థులకు, పలు ప్రయివేట్ కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యం హాల్ టికెట్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తే సహించేది లేదని ఆయన అన్నారు.

 జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తే మా అఖిల భారత ప్రగతి శీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పలు ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై భౌతిక దాడులు చేయడానికి వెనుకాడబొమని ఏ ఐ పి ఎస్ యు మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ గారు పలు ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం ను హెచ్చరించారు. హాల్ టికెట్స్ ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే, తరువాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఏ ఐ పి ఎస్ యు జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ గారు ఒక ప్రకటన లో తెలిపారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా హాల్ టికెట్స్ విషయం లో ఇబ్బంది పడితే ఈ క్రింది నెంబర్ కి సంప్రదించాలని ఆయన అన్నారు. (9885588299, 8466806702.)

ఈ కార్యక్రమం లో ఏ ఐ పి ఎస్ యు రాష్ట్ర నాయకులు రమేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

పేపర్ లీక్ : రేవంత్ రెడ్డికి నోటీసులు పంపిన సిట్

పేపర్ లీక్​ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు పంపారు. పేపర్ లీక్​పై రేవంత్ చేసిన ఆరోపణలపై అధారాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. పేపర్ లీక్ మొత్తం మంత్రి కేటీఆర్​ ఆఫీసు నుంచే వ్యవహారం సాగిందని, మంత్రికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా? అని రేవంత్ ఇటీవల ప్రశ్నించారు. ఇందులో కేటీఆర్​ పాత్ర కూడా ఉందన్నారు. లీకేజీ కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్,​ మంత్రి కేటీఆర్​ పీఏ తిరుపతి ఇద్దరూ దోస్తులని, రాజశేఖర్​కు ఉద్యోగం ఇప్పించింది మంత్రి పీఏనేనని, ఆయన సూచనలతోనే ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చి టీఎస్​ పీఎస్సీకి బదిలీ చేశారని రేవంత్​ ఆరోపించారు.

మంత్రి పీఏ తిరుపతే దీనికి ప్రధాన సూత్రధారి అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్​ షాడో సీఎం అయితే, ఆయన పీఏ షాడో మంత్రి అని రేవంత్ అన్నారు.. మంత్రి పీఏ సొంతూరు జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలమని, రాజశేఖర్​ది కూడా ఇదే మండలమని, గ్రూప్1 పరీక్షలో ఈ మండలానికి చెందిన 100 మందికి పైగా 103కు పైగా మార్కులు వచ్చాయని ఆరోపణలు గుప్పించారు. అయితే వీటిపై వివరాలు ఇవ్వాలని సిట్ కోరింది. పేపర్ లీక్ పై ఆరోపణలు చేసే రాజకీయ నాయకులకు సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే సిట్ నోటీసులు తనకు అందలేదని, అందితే స్పందిస్తానని రేవంత్ తెలిపారు.

నేడు రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు – రైతుల ఆందోళన

రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే గత రెండు రోజుల నుంచి ఈ రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా, పిడుగులు, ఉరుములు, మెరుపులతో ఈ వర్షాలు కురిస్తే చేతికొచ్చిన పంట నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఈ అకాల వర్షాలు ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గత రెండు రోజులుగా అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా, శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు చాలా జిల్లాల్లో ఏకధాటిగా వర్షాలు కురిశాయి. తెలంగాణాలో రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో ఏడు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అదేసమయంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. గత రెండు రోజుల్లోనే 5 డిగ్రీల సెల్సియస్ తగ్గింది. దీనికితోడు ఈదురు గాలులు బలంగా వీస్తుండంతో ప్రజలు వణికిపోతున్నారు.

ఎవర్నీ కించపరచలే.. తెలంగాణలోని సామెతను చెప్పిన : బండి సంజయ్

తాను ఎవరిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కవినుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మార్చి 18న మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అనంతరం మాట్లాడిన ఆయన తెలంగాణలోని సామెతను మాత్రమే చెప్పానన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నట్లు రెండు పేజీల్లో వివరణ ఇచ్చారు. ఆయన సమాధానం పట్ట మహిళా కమిషన్ ఏ నిర్ణయం తీసుకుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది . 

 ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవినుద్దేశించి వ్యాఖ్యలు చేశారని మహిళా కమిషన్ బండి సంజయ్ కు నోటీసులిచ్చింది. మార్చి 15న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కోరింది. పార్లమెంట్ సమావేశాలున్నందును మార్చి 15న హాజరు కాలేనని 18న హాజరవుతానని మహిళా కమిషన్ కు బండి సంజయ్ లేఖ రాశారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు.

టెక్నాలజీని మంచి పనికి ఉపయోగించాలి: గవర్నర్ తమిళి సై

పరీక్షలు జరుగుతున్నాయి అంటే అప్పటి కాలంలో ఎలా చదవాలి అని విద్యార్థులు అడిగేవారు అని కానీ ఇప్పుడు పరీక్ష పత్రాలు ఎక్కడ ప్రింట్ చేస్తున్నారు అని అడిగే పరిస్థితి నెలకొంది అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై అన్నారు. మార్చి 18న కూకట్ పల్లిలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో నిర్వహించిన 11వ స్నాతకోత్సవనికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మభూషణ్ గ్రహీత, రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్ కృష్ణస్వామి కస్తూరీరంగాకి డాక్టరేట్ ప్రధానం చేయడంతో పాటు వివిధ భాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 46 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందించారు. యూజీ, పీజీ, పీహెచ్.డీ భాగాలలో 92,005 వేల మందికి డిగ్రీలను ప్రధానం చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్.. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పై దృష్టి పెట్టడంతోపాటు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి అని సూచించారు. మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే ఎన్ని డిగ్రీలు సంపాదించిన ఉపయోగం ఉండదు అని తెలియజేశారు. ప్రస్తుతం ఊర్లలోనే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని వాటిని ప్రతి ఒక్కరు అందుపుచ్చుకోవాలని గవర్నర్ కోరారు. మహిళా విద్యార్థులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో కూడా దృష్టి సారించాలని వారికి తెలిపారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక యుగంలో సమయం త్వరగా గడిచిపోవడంతో పాటు టెక్నాలజీ రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని.. దానిని ఎప్పుడు మంచి పనికి ఉపయోగించాలని విద్యార్థులకు తెలియపరిచారు.

ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్.. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పై దృష్టి పెట్టడంతోపాటు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి అని సూచించారు. మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే ఎన్ని డిగ్రీలు సంపాదించిన ఉపయోగం ఉండదు అని తెలియజేశారు. ప్రస్తుతం ఊర్లలోనే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని వాటిని ప్రతి ఒక్కరు అందుపుచ్చుకోవాలని గవర్నర్ కోరారు. మహిళా విద్యార్థులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో కూడా దృష్టి సారించాలని వారికి తెలిపారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక యుగంలో సమయం త్వరగా గడిచిపోవడంతో పాటు టెక్నాలజీ రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని.. దానిని ఎప్పుడు మంచి పనికి ఉపయోగించాలని విద్యార్థులకు తెలియపరిచారు

ఇది ఇద్దరు దుర్మార్గులు చేసిన తప్పిదం.. పేపర్ లీకేజ్‌పై కేటీఆర్ స్పష్టత

పేపర్ లీకేజ్ టీఎస్‌పీఎస్‌సీ వ్యవస్థ తప్పు కాదని.. ఇద్దరు దుర్మార్గులు (ప్రవీణ్, రాజశేఖర్) చేసిన తప్పు అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పేపర్ లీకేజ్ అంశం చాలా దురదృష్టకరం అన్నారు. ఈ వ్యవహారంపై తామంతా చర్చించామని, సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇచ్చామని అన్నారు. 155 నోటిఫికేషన్‌ల ద్వారా 37 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని.. గత 8 ఏళ్లలో ఇండియాలోనే ఎక్కువగా ఉద్యోగాలు భర్తీ చేసింది ఒక్క టీఎస్‌పీఎస్‌సీ మాత్రమేనని పేర్కొన్నారు. 7 భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బోర్డ్‌పై ఎన్నో ఆరోపణలు వచ్చాయని గుర్తు చేసిన ఆయన.. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు చెసిన తప్పు వల్ల వ్యవస్థకే చెడ్డు పేరు వచ్చిందని మండిపడ్డారు. ఆ ఇద్దరు వ్యక్తులే కాదు.. వారి వెనకాల ఎవరున్నా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. వ్యక్తుల వల్ల వచ్చిన పొరపాటు మళ్ళీ జరక్కుండా తప్పకుండా చర్యలు తీసుకుంటాం హామీ ఇచ్చారు. ఈ లీకేజ్ కారణంగా నాలుగు పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చిందని.. త్వరలోనే ఆ పరీక్షలను నిర్వహిస్తామని కేటీఆర్ వెల్లడించారు.

విద్యార్థుల బాధను తాము అర్థం చేసుకోగలమని, కానీ తప్పని పరిస్థితుల్లో పరీక్షల్ని రద్దు చేయక తప్పలేదని క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ జరగబోయే పరీక్షల కోసం అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు.. కోచింగ్ మెటీరియల్ ఉచితంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో పెడతామని, స్టడీ సెంటర్‌లో 24 గంటలు రీడింగ్ రూమ్ అందుబాటులో ఉంచుతాం, అక్కడే భోజన వసతి కూడా కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వ్యవస్థ పటిష్టంగానే ఉందని భరోసా కల్పించారు. రాజకీయ నిరుద్యోగులు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు ఏమాత్రం పట్టించుకోవద్దని సూచించారు.

కమిషన్‌లో పాదర్శకత తీసుకురావడం కోసం అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నారు. వన్ టైం రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించామన్నారు. యూపీఎస్‌సీ ఛైర్మన్ రెండుసార్లు తెలంగాణకు వచ్చి, రెండుసార్లు మన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ని విజిట్ చేసి, ఇక్కడి విధానాలపై అధ్యయనం చేశారన్నారు. 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషనర్లు వచ్చి కూడా పరిశీలించారన్నారు. ఇన్నేళ్లలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. 95 శాతం రిజర్వేషన్లు స్థానికులకే ఇచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం చట్టసవరణ చేసిందన్నారు.

ఇక ఈ పేపర్ లీక్‌లో ఉన్న ప్రధాన నిందితుడు రాజశేఖర్ ఒక బీజేపీ క్రియాశీలక కార్యకర్త అని, సామాజిక మాధ్యమాల్లో అతడు బీజేపీకి ప్రచారం చేస్తున్నాడని ఆధారాలతో సహా కేటీఆర్ వెల్లడించారు. నోటిఫికేషన్లు ఇవ్వడమే కుట్ర అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గతంలో చెప్పారని, విద్యార్థులను బిజీగా పెడుతున్నారని వ్యాఖ్యానించారని, ఇప్పుడు పేపర్ లీకేజ్‌లో ఆ పార్టీ కార్యకర్తే ఏ2గా ఉండటం అనుమానాలకు తావిస్తోందని కేటీఆర్ అన్నారు. దీనిపై లోతుగా విచారణ చేయాలని తాము డీజేపీని కోరామన్నారు.

దీని వెనుక ఏ పార్టీ వాళ్ళున్నా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కేంద్రంలో 16 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, కానీ వాటిని భర్తీ చేయట్లేదని విమర్శించారు. టీఎస్‌పీఎస్‌సీ తమ అధీనంలో ఉండదని.. ఐటీ శాఖతో ఆ వ్యవస్థకు సంబంధం ఉండదని.. అలాంటప్పుడు ఐటీ మంత్రిని రాజీనామా చేయమనడం హాస్యాస్పదమని చెప్పారు. గతంలో గుజరాత్‌లో 13 లీక్‌లు జరిగాయని.. మరి అప్పుడు ఎవరినైనా బర్తరఫ్ చేశారా? అని ప్రశ్నించారు. వ్యాపం స్కామ్‌లో మధ్యప్రదేశ్ సీఎం పేరొస్తే రాజీనామా చేశారా? అని నిలదీశారు.

Hyd : రూ.17 లక్షల హవాలా డబ్బు సీజ్.. ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్ లో భారీగా హవాలా డబ్బును సీజ్ చేశారు కాచిగూడ పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు కాచిగూడ రైల్వే స్టేషన్ రోడ్ లో వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు..ఓ వ్యక్తి వద్ద రూ. 17 లక్షల హవాలా డబ్బును గుర్తించారు. నగరంలోని బడిచౌడి ప్రాంతానికి చెందిన హరి నారాయణ కొట్టారి అనే వ్యక్తి రూ. 17 లక్షల అక్రమ నగదు కాటేదాన్ ప్రాంతానికి చెందిన షోహెల్ అనే వ్యక్తుల మధ్య చేతులు మారుతుండగా గుర్తించిన పోలీసులు రెడ్ హ్యానడెడ్ గా పట్టుకున్నారు. 

పోలీసులు నగదును సీజ్ చేసి ఐటీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని.. ఈ డబ్బు ఎవరికి చెందినదని.. దీని వెనుకాల ఎవరు ఉన్నారని ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కాచీగూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల కరపత్రాలు కలకలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుదునూరు,ఆర్ కొత్తగూడెం రహదారిలో మార్చి 18న మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు కలకలం రేపాయి.

 మార్చి 23ను భగత్ సింగ్, సుఖదేవ్ రాజ్ గురు ల అమరత్వ దినోత్సవంగా పాటించాలని పిలుపునిచ్చారు మావోయిస్టులు. ప్రజా వ్యతిరేక హిందూ ఫాసిస్టు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోరాటాలు సాగించాలని మావోయిస్టులు కరపత్రాల్లో వెల్లడించారు. కుదునురు, ఆర్ కొత్తగూడెం ప్రధాన రహదారి.. దానవాయిపేట, చింతగుప్పా, వెంకటాపురం రహదారిలో మావోయిస్టులు ఈ బ్యానర్లు, కరపత్రాలను అతికించారు. 

తెలంగాణ కమిటీ భారత మావోయిస్టు పార్టీ పేరుతో ఈ కరపత్రాలు వెలిశాయి. దీంతో సమాచారం అందుకున్న ఇంటెలిజెన్స్‌ విభాగం పోలీస్‌ యం త్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా గస్తీ నిర్వహి స్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామీణ పల్లెలను జల్లెడ పడుతున్నారు.

మహిళా కమిషన్ ముందుకు బండి సంజయ్..

భారత్ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆమె వద్ద ఈడీ అధికారులు విచారణ కూడా జరిపారు. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

దీంతో ఆయనపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అదేసమయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. సుమోటాగా స్వీకరించిన మహిళా కమిషన్ బండి సంజయ్‌కు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసుల్లో ఈ నెల 13వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని పేర్కొనగా, 18వ తేదీన హాజరువుతానని బండి సంజయ్ మహిళా కమిషన్‌కు రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలో నేడు కమిషన్ ముందు బండి సంజయ్ హాజరుకానున్నారు. 

మరోవైపు, బండి సంజయ్‌పై మహిళా సంఘాలతో పాటు తెరాస నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే తెరాస పార్టీ శ్రేణులు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా పలురకాలైన ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయంతెల్సిందే.