/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1790061986790694.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1790061986790694.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1790061986790694.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1790061986790694.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1790061986790694.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1790061986790694.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1790061986790694.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1790061986790694.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1790061986790694.png StreetBuzz గణేశ్ నిమజ్జనానికి ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల Sridhar Dasari
గణేశ్ నిమజ్జనానికి ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల

కరీంనగర్/కొత్తపల్లి: గణేశ్ విగ్రహాల నిమజ్జనం కోసం ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్‌కు సోమవారం నీటిని విడుదల చేశారు. నవరాత్రి ఉత్సవాలు ముగియనున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని కాకతీయ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కాల్వల్లో నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా నీటిని విడుదల చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌ను కోరారు.

కొన్నేళ్లుగా గణేశ్ విగ్రహాలను కాకతీయ కాల్వలతో పాటు పలు డిస్ట్రిబ్యూటరీ కాల్వల్లో నిమజ్జనం చేస్తున్నారని, ప్రస్తుతం కాల్వల్లో నీరు లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే సూచన మేరకు నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్టు సీఈ తెలిపారు.

సోమవారం ఉదయం 11 గంటలకు తొలుత 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనంతరం సాయంత్రం మరో 3 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. కరీంనగర్ నగరంలో పెద్ద సంఖ్యలో గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేసే చింతకుంట కెనాల్‌కు మంగళవారం రాత్రి వరకు నీరు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మెదక్ జిల్లా: భార్యకు జీవిత ఖైదు... భర్త హత్య కేసులో

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పార్కిబండ గ్రామంలో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్త మురళిని హత్య చేసిన కేసులో ఆయన భార్య మంచి విజయలక్ష్మి దోషిగా తేలింది. ఈ మేరకు ఆమెకు జీవిత ఖైదుతో పాటు రూ. 6 వేల జరిమానా విధించింది.

2021 సంవత్సరంలో మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం… భార్య విజయలక్ష్మికి జీవిత ఖైదు మరియు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

Hi

Dasari sridhar