సుప్రీంకోర్ట్ చారిత్రాత్మక తీర్పు
ప్రైవేటు ఆస్తులపై ప్రభుత్వ హక్కుల పరిధి ఎంతవరకు అనే అంశంపై సుప్రీంకోర్ట్ చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. అన్నీ ప్రైవేటు ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కులు ఉండబోవని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఉమ్మడి ప్రయోజనాల కోసం పంపిణీ చేసేందుకుగానూ అన్ని ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకోజాలవని స్పష్టం చేసింది.
ప్రైవేటు ఆస్తులపై ప్రభుత్వ హక్కుల పరిధి ఎంతవరకు అనే అంశంపై సుప్రీంకోర్ట్ చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. అన్నీ ప్రైవేటు ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కులు ఉండబోవని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఉమ్మడి ప్రయోజనాల కోసం పంపిణీ చేసేందుకుగానూ అన్ని ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకోజాలవని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యాంగ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కులు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు 9 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం 8:1 మెజారిటీతో ఈ తీర్పు ఇచ్చింది.
ఈ కీలక తీర్పుని సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రకటించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బీ) ప్రకారం ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని వనరులను రాష్ట్రం స్వాధీనం చేసుకునే హక్కు లేదన్నారు. ఈ మేరకు గతంలో జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పును మెజారిటీ తీర్పు తోసిపుచ్చింది.
ఆర్టికల్ 39(బీ) ప్రకారం ప్రైవేట్ ఆస్తులను ‘సమాజ ముఖ్య వనరులు’గా పరిగణించవచ్చా?, పంపిణీ కోసం ప్రభుత్వాధికారులు స్వాధీనం చేసుకోవచ్చా? అనే న్యాయపరమైన ప్రశ్నలపై సీజే చంద్రచూడ్‌తో పాటు మరో ఏడుగురు న్యాయమూర్తులు అనుకూలంగా తీర్పుఇచ్చారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం రాష్ట్రాలు అన్ని ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చంటూ గతంలో వెలువడిన అన్ని తీర్పులను జడ్జిలు తోసిపుచ్చారు.
కేవలం భౌతిక అవసరాలే అర్హతగా.. ఒక వ్యక్తికి చెందిన అన్ని ప్రైవేటు వనరులను కమ్యూనిటీ మెటీరియల్ రిసోర్స్‌గా పరిగణించకూడదని భావిస్తున్నాం. సందేహాస్పద వనరు గురించిన విచారణ రాజ్యాంగంలోని 39బీ నిబంధన కిందకు వస్తుంది. వనరుల స్వభావం, లక్షణాలు, సమాజానికి ఎంతవరకు ఉపయోగకరం, వనరుల కొరత, వనరుల పరిణామాలు వంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజా విశ్వాస సిద్ధాంతం (Public trust doctrine) సమాజానికి సంబంధించిన వనరుల పరిధిలోకి వచ్చే ఆస్తులను గుర్తించడంలో దోహదపడుతుంది’’ అని సీజే చంద్రచూడ్ పేర్కొన్నారు.
Nov 05 2024, 16:47