కేంద్రం కొత్త వరాలు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అమలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల పెంపు పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. పలు రాష్ట్రాల్లో రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ పెంపుకు నిర్ణయం తీసుకుంది. దాదాపు 60 వేల కిలో మీటర్ల మేర నిర్మాణాలకు ప్రణాళికలు సిద్దం చేసింది. విజన్ - 2047 అమల్లో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఏపీతో పాటుగా తెలంగాణకు ప్రాధాన్యత దక్కింది. పలు నూతన ప్రాజెక్టులను ప్రకటించారు.
కేంద్రం తాజాగా ఖరారు చేసిన హైస్పీడ్ కారిడార్లలో ఏపీ - తెలంగాణ మీదుగా పలు ప్రాజెక్టుల కు చోటు కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసేలా ప్రణాళికలు సిద్దం అయ్యాయి. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రోడ్ల ను వైడెనింగ్ చేయటం తో పాటుగ అంతర్గత రోడ్ల అనుసంధానం కు నిధులు కేటాయించారు. కేంద్రం ఖరారు చేసిన హైస్పీడ్ కారిడార్లలో ఏపీకి 9, తెలంగాణకు 6 ప్రాజెక్టులు దక్కాయి. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. వీటిని రెండు దశల్లో పూర్తి చేయాలని కేంద్రం ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంచనాల పైన కసరత్తు పూర్తి చేసారు. అయితే, అధికారికంగా ఈ ప్రాజెక్టుల రూట్ మ్యాప్ తో పాటుగా భూ సేకరణ పైన నిర్ణయం తీసుకోనున్నారు. తాజా ప్రాజెక్టులకు సంబంధించి రెండు సంస్థల నుంచి కేంద్రం నివేదికలు సేకరించింది. మొత్తం గా దాదాపు 60 వేల కిలో మీటర్ల రోడ్ల నిర్మాణం కు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. ప్రస్తుత అవసరాలతో పాటుగా భవిష్యత్ రద్దీకి అనుగుణంగా ప్రణాళికల పైన కసరత్తు కొనసాగుతోంది. 2047 లోగా వీటి నిర్మాణం పూర్తి చేయాలనేది కేంద్రం లక్ష్యంగా ఉంది. తెలంగాణ లో హైదరాబాద్ నుంచి రాయపూర్ వరకు హైస్పీడ్ కారిడార్ రానుంది. అదే విధంగా నాగపూర్ - హైదరాబాద్ ప్రతిపాదన మరొకటి. హైదరాబాద్- విశాఖపట్నం వరకు మరో ప్రతిపాదన సిద్దం చేసారు.
ఏపీకి ఈ ప్రాజెక్టుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. అందులో హైదరాబాద్- బెంగళూరు వరకు ప్రతి పాదించిన మార్గం ఏపీలో 261 కి.మీ వరకు ఉండనుంది. ఖరగ్‌పూర్- కటక్- విశాఖపట్నం మార్గం ఒడిశా మీదకు ఏపీ వరకు కొనసాగనుంది. చౌటుప్పల్ ఎన్‌హెచ్-65 నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు మరో ప్రతిపాదన సిద్దమైంది.
ఏపీ పరిధిలో 335 కిలో మీటర్ల మేర అతి పెద్ద హై స్పీడ్ కారిడార్ వైజాగ్- కాకినాడ- రామేశ్వరం- విజయవాడ- గుంటూరు- ఒంగోలు వరకు ఏర్పాటు దిశగా ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. కాకినాడ పోర్టు నుంచి ఉప్పాడ బీచ్, అదే విధంగా నెల్లూరు సిటీ నుంచి కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు నుంచి తంగలం, సూళ్లూరు పేట- మోమిడి వరకు రోడ్ల ఏర్పాటుకు ఆమోదం దక్కనుంది.
Nov 04 2024, 11:16