రెండు రోజులు యూపీఐ సేవలు బంద్
నవంబర్‌లో రెండు రోజుల పాటు ఓ బ్యాంక్ కస్టమర్‌లు UPI సేవలను ఉపయోగించలేరు. బ్యాంకు వ్యవస్థలో నిర్వహణ పనుల కారణంగా ఆయా ఖాతాదారులు అసౌకర్యానికి గురవుతారని ప్రకటించారు. అయితే ఈ సేవలు ఏ సమయంలో, ఎప్పుడు బంద్ చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలో ప్రతిరోజూ వేల కోట్ల రూపాయల విలువైన UPI లావాదేవీలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి దేశంలో యూపీఐ ఏ స్థాయిలో ఉపయోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. UPI వాడకం ద్వారా నగదును తీసుకువెళ్లే అవసరమే లేకుండా లావాదేవీలను సులభంగా చేసుకోవచ్చు. ఈ నవంబర్ నెలలో రెండు రోజులు మాత్రం UPI పనిచేయదు. దీనిని ఉపయోగించలేరు. కానీ అందరికీ మాత్రం కాదు. అయితే ఇది ఎవరికి పనిచేయదు, ఎన్ని రోజులు పనిచేయకుండా ఉంటుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నవంబర్‌లో రెండు రోజుల పాటు UPI సేవలను ఉపయోగించుకోలేరని HDFC బ్యాంక్ తన ఖాతాదారులకు తెలిపింది. బ్యాంక్ వెబ్‌సైట్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ముఖ్యమైన సిస్టమ్ మెయింటెనెన్స్ సెట్టింగ్స్ కారణంగా HDFC బ్యాంక్ ఈ UPI సేవలను నిలిపివేస్తున్నట్లు చెప్పింది. HDFC బ్యాంక్ UPI సేవను ఉపయోగించే కస్టమర్‌లు నవంబర్ 5, నవంబర్ 23న UPI ద్వారా డబ్బు పంపలేరు లేదా స్వీకరించలేరు.
నవంబర్ 5న అర్ధరాత్రి 12.00 గంటల నుంచి 02.00 గంటల వరకు, ఆ తర్వాత నవంబర్ 23న అర్ధరాత్రి 12.00 గంటల నుంచి తెల్లవారుజామున 03.00 గంటల వరకు ఈ యూపీఐ సేవలు నిలిపివేయబడతాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. ఈ సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలతో పాటు రూపే కార్డ్‌లపై ఆర్థిక, ఆర్థికేతర యూపీఐ లావాదేవీలు చేసుకోవడం సాధ్యం కాదని బ్యాంక్ తెలిపింది. ఇది కాకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యూపీఐ సేవల ద్వారా చెల్లింపులు చేసుకునే దుకాణదారులు కూడా ఈ వ్యవధిలో చెల్లింపు చేసుకోలేరు.
మీరు మీ HDFC బ్యాంక్ ఖాతా నుంచి UPIని వినియోగిస్తున్నయితే HDFC బ్యాంక్ మొబైల్ యాప్, Paytm, PhonePe, Google Pay, Mobikwik వంటి వాటి ద్వారా డబ్బును పంపలేరు లేదా స్వీకరించలేరు. మొత్తంమీద ఈ వ్యవధిలో HDFC బ్యాంక్‌కి లింక్ చేయబడిన ఎటువంటి UPI లావాదేవీలను చేయలేరు.
Nov 03 2024, 11:12