ఏపీలో ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది
ఏపీలో మరోసారి ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 4న నోటిఫికేషన్ విడుదల కానుంది. 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న నామినేషన్ల పరిశీలన, 14న ఉపసంహరణ ఉంటుంది. 28వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.. డిసెంబర్ 1న కౌంటింగ్ ఉంది.ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటుతో ఖాళీగా. 2027 డిసెంబర్ 1 వరకు పదవీకాలం.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నగారా మోగింది.. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తారు.. 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈ నెల 28న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటింగ్ జరుగుతుంది.. డిసెంబర్ 1న ఓట్లు లెక్కిస్తారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇటీవల ఇందుకూరు రఘురాజుపై అనర్హత వేటుతో విజయగనరం జిల్లా ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది.
గతంలో ఈ స్థానంలో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన ఇందుకూరి రఘురాజుపై శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో జూన్ 3 నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది.. తాజాగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికల షెడ్యూల్, కోడ్ అమల్లోకి రావడంతో చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటన వాయిదా పడింది. విజయనగరం జిల్లా కాకుండా అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో చంద్రబాబు పర్యటించారు. శ్రీకాకుళంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో రాత్రి బస చేసి.. అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి జిల్లాకు వెళ్లారు.
ముఖ్యమంత్రి ఉదయం 11.15 గంటలకు హెలికాప్టర్‌లో చింతలగోరువానిపాలెంలోని లారస్ సంస్థ దగ్గరకు చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ నిర్వహించే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.. మధ్యాహ్నం 12.20 గంటలకు అనకాపల్లి జిల్లా వెన్నెలపాలేనికి వెళ్లి రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు.
మధ్యాహ్నం 1.25 గంటలకు హెలికాప్టర్‌లో రుషికొండ వెళ్లి ఏపీ టూరిజం రిసార్ట్స్‌ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు.. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఆ తర్వాత విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు వెళతారు. అక్కడి నుంచి ఉండవల్లిలోని నివాసానికి వెళతారు.
Nov 02 2024, 12:31