/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz ఢిల్లీ తరహాలోనే Raghu ram reddy
ఢిల్లీ తరహాలోనే

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad) డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఢిల్లీ తరహాలోనే హైదరాబాద్‌లో వాయు కాలుష్యం పెరిగిపోతుండటం నగరవాసులను కలవరపెడుతోంది. హైదరాబాద్‌లో వాయు కాలుష్యం కారణంగా గత దశాబ్దకాలంలో 6000 మందికి పైగా మరణాలు సంభవించాయి. లాన్సెట్ ప్లానెట్ హెల్త్ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్‌లో ఒక్క 2023లోనే వాయు కాలుష్యానికి సంబంధించి మరణాల సంఖ్య 1,597గా ఉంది. వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న టాప్ -10 నగరాలలో హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీ నంబర్ వన్ స్థానంలో ఉండగా.. తరువాత స్థానాల్లో ముంబయి, బెంగళురు, పుణె, చెన్నై నగరాలు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని సనత్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కొంపల్లి, ఆబిడ్స్, గచ్చి బౌలి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో అధిక వాయు కాలుష్యం ఉంది. గత గంటల సమయంలో పీఎం 2.5 కాలుష్యాలు 60 పాయింట్లలోపు ఉండాల్సి ఉండగా సోమాజిగూడలో 105, హెచ్‌సీయూ, న్యూమలక్‌పేటలలో 99, హైదరాబా ద్‌ యూఎస్‌ కాన్సులేట్‌ వద్ద 92, జూపార్క్‌ వద్ద 91, కేపీహెచ్‌బీ ఫేజ్‌–2 వద్ద 84, కోకాపేట వద్ద 81 పాయింట్లుగా నమోదు అయ్యింది. దీపావళి టపాసులతో వాయు నాణ్యతలో క్షీణత ఏ మేరకు జరిగిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. పొల్యూషన్ వల్ల దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

గుండె, శ్వాసకోశ, మూత్రపిండాలు, కాలేయం, ఇతర దీర్ఘకాలిక జబ్బులు, సమస్యలున్న వారిపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపనుంది. అప్పర్‌ రెస్పిరేటరీ సమస్యలు, ముక్కులు కారడం, తుమ్ములు, గొంతు పొడిబారడం, గొంతు నొప్పి వల్ల కేసులు పెరుగుతున్న పరిస్థితి.

మరోవైపు దేశరాజధాని ఢిల్లీలోనూ కాలుష్యం పెరిగిపోయింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 408 పాయింట్లుగా నమోదు అయ్యింది. సోని విహార్ లో 408 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదు అయ్యింది.

అలాగే మందిర్ మార్గ్ లో 375, మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం 371, ఐటీఓలో 335 పాయింట్లుగా నమోదు అయ్యింది. ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం విధించినప్పటికీ నగరవాసులు అధిక సంఖ్యలో బాణాసంచాను వినియోగించారు. బాణాసంచా వినియోగంతో కాలుష్యం ఢిల్లీని కమ్మేసింది. కాళింది కుంజ్‌లోని యమునా నదిలో విషపూరిత నురుగు భారీగా చేరింది.

ముడిచమురు ఎగుమతిలో భారత్ ముందంజ

యూరప్‌కు అతి పెద్ద ముడి చమురు సరఫరాదారుగా భారత్ నిలిచింది. దీంతో సౌదీ అరేబియా వెనక్కు వెళ్లిపోయింది. కెప్లర్ నివేదిక ప్రకారం .. యూరోపియన్ యూనియన్ దేశాలకు భారతీయ రిఫైనరీల నుంచి శుద్ధి చేసిన ముడి చమురు ఎగుమతిలో గణనీయంగా పెరుగుదల నమోదైంది. యూరోపియన్ దేశాలకు భారత్ ప్రతి రోజూ 3.60 లక్షల బ్యారెల్స్ శుద్ధి చేసిన ముడి చమురు ఎగుమతి చేసింది.

రాబోయే సంవత్సరం ఏప్రిల్ నాటికి ఎగుమతులు 20 లక్షల బ్యారెల్స్‌ను దాటుతుందని మార్కెట్ వర్గాల అంచనా. రష్యా – ఉక్రెయిన్ యుద్ధ సమయంలో యూరప్‌కు భారత్ రోజుకు 1.54 లక్షల బ్యారెల్స్ శుద్ధి చేసిన చమురు ఎగుమతి చేసింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత 2 లక్షల బ్యారెల్స్‌కు పెరిగింది.  

 

2023 ఆర్ధిక సంవత్సరంలో రష్యాకు భారత్ కీలక మార్కెట్‌గా మారింది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా భారీ తగ్గింపుతో ముడి చమురును భారత్‌కు అందించింది. పలు దేశాల నుండి విమర్శలు వచ్చినప్పటికీ రష్యా నుంచే భారత్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది.

రష్యా నుంచి 3.35 బిలియన్లు, సౌదీ నుంచి 2.30 బిలియన్లు, ఇరాక్ నుంచి 2.03 బిలియన్ డాలర్ల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటుంది.

దీంతో భారతీయ రిఫైనరీలు హైక్వాలిటీ పెట్రోల్, డీజిల్ ఇతర శుద్ధి చేసిన ఉత్పత్తులతో సరఫరా గణనీయంగా పెరిగింది. ఈ కారణంగా సౌదీ ఆరిబియాను కాదని భారత్ వైపు దృష్టి సారిస్తున్నాయి.

రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం ,రైతుల పట్ల చిత్తశుద్ధి లేని కారణంగా వరి ధాన్యం కోనుగోలు కేంద్రాలలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని బీజేపి ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి, నల్గొండ పార్లమెంట్ కాంటెస్ట్ అభ్యర్థి పాలకూరి రవిగౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు..

అకాల వర్షానికి వచ్చిన, వరదలకు వరి ధాన్యం కొట్టుకపోవడంతో రైతులు విలపిస్తున్నారు అని రవిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు..

ప్రభుత్వానికి అవగాహన లేక ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో గత ఇరవై రోజుల కింద కొనుగోలు కేంద్రాలకు రైతులు తమ ధాన్యాన్ని తీసుకొస్తే ప్రభుత్వం నేటికీ కొనలేని పరిస్థితి కనిపిస్తోంది..

గత యాసంగి సీజన్లో రైస్ మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం విషయంలో అటు మిల్లర్లకు ఇటు ప్రభుత్వం మధ్యలో నడుస్తున్న విభేదాల కారణంగా కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్లులను నేటికీ కేటాయించలేదు ..

అదే ప్రభుత్వముకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ వ్యవహారం అంతా ఎప్పుడో జరగాల్సిఉండేది అలాకాకుండా కొనుగోలు కేంద్రాలకు దాన్యం వచ్చిన తర్వాత ఇప్పుడు రైస్ మిల్లర్స్ తో చర్చలు నడుపుతూ ఆ చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన దాన్యాన్ని ఏ ఏ మిల్లులకు కేటాయించేపరిస్థితి కనబడకపోవడంతో కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం నిలిచిపోయింది..

నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అనేక కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిచి, కొన్నిచోట్ల ధాన్యం కొట్టుకపోయింది...

ధాన్యం వరద పాలు కావడంతో పండుగ రోజు రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ రైతులు దీపావళి పండుగ చేసుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి ఎఫ్సిఐ గోదాం లాంటి సంస్థలలో ధాన్యాన్ని భద్రపరిచే విధంగా చర్యలు చేపట్టి తక్షణమే కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని తరలించే విధంగా ఏర్పాటు చేయాలని రవిగౌడ్ కోరారు...

ఐపీఎల్ 2025 మెగా వేలం

వివిధ ఇండియన్ ప్రీమియర్ లీగ్-ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ప్లేయర్ల రిటెన్షన్‌ లిస్ట్లను గురువారం అధికారికంగా ప్రకటించాయి. మొత్తం 10 జట్లు 46 మంది ప్లేయర్లను రిటైన్ చేశాయి. అందులో కోల్కతా, రాజస్థాన్ జట్లు ఆరు రిటెన్షన్ల పూర్తి కోటాను ఉపయోగించుకున్నాయి.

పంజాబ్ జట్టు తక్కువ సంఖ్యలో ఆటగాళ్లను తమ అట్టిపెట్టుకుంది. అంటే ఈ జట్టు అతిపెద్ద పర్స్ వ్యాల్యూతో వేలానికి వెళుతోంది. ఇక ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు సహా ఆరుగురిని రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ రూ.41 కోట్ల అతి తక్కువ పర్స్తో వేలంలోకి దిగనుంది. ఐపీఎల్ 2025 వేలంలో పాల్గొన్న ఫ్రాంచైజీల పర్స్ వ్యాల్యులు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

IPL 2025 వేలం- టీమ్స్ పర్స్ వ్యాల్యూ

చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 55 కోట్లుముంబయి ఇండియన్స్ - రూ. 45 కోట్లుకోల్‌కతా నైట్ రైడర్స్ - రూ. 51 కోట్లురాజస్థాన్ రాయల్స్ - రూ. 41 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ - రూ. 45 కోట్లుగుజరాత్ టైటాన్స్ - రూ. 69 కోట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 83 కోట్లుదిల్లీ క్యాపిటల్స్ - రూ. 73 కోట్లుపంజాబ్ కింగ్స్ - రూ. 110.5 కోట్లులఖ్నవూ సూపర్ జెయింట్స్ - రూ. 69 కోట్లు

అదరగొట్టిన హైదరాబాద్ ఆటగాడు!

కాగా, రిటెన్షన్‌లో హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ (రూ.23 కోట్లు) అత్యధిక ధర దక్కించుకున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని బెంగళూరు టీమ్ (రూ.21 కోట్లు) రిటైన్ చేసుకుంది. ఇక ముంబయి స్టార్ రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు), చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా (రూ.4 కోట్లు) అందుకోనున్నారు. అయితే రిషభ్‌ పంత్‌, కేఎల్ రాహుల్‌, శ్రేయస్ అయ్యర్‌ను ఆయా జట్లు రిటైన్ చేసుకోలేదు. ఇక మ్యాక్స్‌వెల్, కామెరూన్‌ గ్రీన్‌, సిరాజ్‌లను ఆర్సీబీ వదులుకుంది. నవంబర్‌ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది.

సరిహద్దుల్లో స్వీట్లు పంచుకున్న భారత్-చైనా

భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో రెండేళ్లుగా సాగుతున్న ప్రతిష్టంభనకు క్రమంగా తెరపడుతోంది. తాజాగా భారత్, చైనా దేశాధినేతల మధ్య బ్రిక్స్ సదస్సులో జరిగిన భేటీ తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

మోడీ, జిన్ పింగ్ చర్చల తర్వాత సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లూ కలహించుకున్న ఇరుదేశాల బలగాలు ఇవాళ స్వీట్లు పంచుకుని వేడుకలు చేసుకున్నాయి.

భారత్-చైనా సరిహద్దుల్లో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఐదు పాయింట్లలో ఇవాళ ఇలాంటి ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి.

ఇందులో లడఖ్ లోని రెండు పాయింట్లు కూడా ఉన్నాయి. తాజాగా ఇరుదేశాల మధ్య కుదిరిన అనధికార ఒప్పందంలో భాగంగా డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల నుంచి ఇరు బలగాలు వెనక్కి తగ్గాయి. ఈ పరిణామం జరిగిన రెండు రోజుల తర్వాత ఇవాళ భారత్, చైనా సైనికులు దీపావళి సందర్భంగా స్వీట్లు పంచుకున్నారు.

లడఖ్‌లోని చుషుల్ మాల్డో , దౌలత్ బేగ్ ఓల్డి, అరుణాచల్ ప్రదేశ్‌లోని బంచా , బుమ్లా , సిక్కింలోని నాథులాలో ఇరు దేశాల బలగాలు ఇవాళ స్వీట్లు పంచుకున్నాయి. పెట్రోలింగ్ ఒప్పందంలో డెప్సాంగ్ మైదానాలు , డెమ్‌చోక్ నుండి తాత్కాలిక శిబిరాలతో సహా సైనిక సిబ్బందిని , మౌలిక సదుపాయాలను తొలగించాలని అలాగే 2020 ఏప్రిల్ కు ముందున్న చోట్లకు ఆయా బలగాలు వెళ్లిపోవాలని నిర్ణయించారు.ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు.

ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

తెలంగాణలో రెండురోజులు వానలు కొనసాగుతాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

తెలంగాణలో రెండురోజులు వానలు కొనసాగుతాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీంతో పలు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే ఉరుములు మెరుపులతో వానలు పడే ఛాన్స్‌ ఉందని చెప్పింది.

శుక్రవారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, నవంబర్‌ 4 వరకు రాష్ట్రంలో వానలు కొనసాగేందుకు అవకాశాలున్నాయని వివరించింది.

24 మందితో టీటీడీ బోర్డ్

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి నూతన ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు.

24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలి ఏర్పాటు కానుంది.

వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, తెలంగాణ నుంచి ఐదుగురు,

కర్ణాకటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, గుజరాత్‌, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి బోర్డు అవకాశం కల్పించింది

20 మంది అధికారులపై చర్యలకు సిద్ధం

కడప జిల్లాలోని కేసీ కెనాల్‌ భూముల పరాధీనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఐదేళ్లు జగన్‌ సర్కారు తొక్కిపెట్టిన విజిలెన్స్‌ నివేదికను కూటమి ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది.

కడప జిల్లాలోని కేసీ కెనాల్‌ భూముల పరాధీనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఐదేళ్లు జగన్‌ సర్కారు తొక్కిపెట్టిన విజిలెన్స్‌ నివేదికను కూటమి ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. భూములు పరాధీనం అవడానికి, ఆతర్వాత ఆ భూములను పరిరక్షించడంలో 20 మంది అధికారులు తీవ్ర వైఫల్యం చెందారని విజిలెన్స్‌ గుర్తించింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిఫారసుల మేరకు 20 మంది అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు (జీవో-241) జారీ చేశారు. నాలుగు శాఖల అధికారులు ఈ జాబితాలో ఉన్నారు. కాబట్టి ఆయా శాఖలు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అభియోగాలు ఎదుర్కొంటున్నవారు 2019కు ముందు కడప జిల్లా పరిధిలో పని చేశారు. ప్రస్తుతం వీరంతా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.

కడప జిల్లాలో విలువైన కేసీ కెనాల్‌ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. వాటి పరిరక్షణలో ఆయా శాఖల అధికారులు విఫలమయ్యారు. దీంతో గత తె లుగుదేశం ప్రభుత్వ హయాంలో విచారణ జరిపింది. అధికారుల పాత్ర ఉందని అనుమానాలు రావడంతో విజిలెన్స్‌ విచారణ జరిపించింది. ఈమేరకు విజిలెన్స్‌ విచారణ జరిపి 2019 మే 20న సర్కారుకు నివేదిక ఇచ్చింది. అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. జగన్‌ సర్కారు వచ్చాక ఈ ఫైలుపై ఐదేళ్లపాటు ఏ చర్యలూ తీసుకోలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం పెండింగ్‌ ఫైళ్ల బూజు దులిపి పరిశీలిస్తోంది. ఈ కేసులో చర్యలు తీసుకుంటూ రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చింది.

మైలవరం, 2.మల్లికార్జున-ఈఈ, కెసీ కెనాల్‌ నంద్యాల, 3.కె.సుబ్బయ్య-ఈఈ, ధవళేశ్వరం, 4.ఎస్‌.జిలాని బాష-డీఈ, మైదుకూరు.

పురపాలకశాఖ: 5.బి.విజయభాస్కర్‌-అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌, గూడూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌, 6. టీఎం.రామ్మోహన్‌-టౌన్‌ ప్లానింగ్‌, కదిరి మున్సిపాలిటీ. 7.జి.నాగశివప్రసాద్‌-టౌన్‌ప్లానింగ్‌, కడప మున్సిపాలిటీ. 8.జి.శారదాంబ-ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌, రాజంపేట. 9.సీటీ కష్ణసింగ్‌-టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌, పులివెందుల మున్సిపాలిటీ. 10. ఎ.సలీమ్‌బాషా-కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌, 11.డి. జాన్‌శామ్‌సన్‌-కమిషనర్‌, రామగుండం మున్సిపాలిటీ(తెలంగాణ), 12.సి.ఓబులేసు-కమిషనర్‌, అనంతపురం మున్సిపాలిటి.

హోంశాఖ: 13. టి.రెడ్డప్ప-సీఐ, 14. ఎస్‌.రామకృష్ణుడు-సీఐ, 15.ఎస్‌.రామకృష్ణ-సీఐ, 16. వి.నారాయణస్వామిరెడ్డి-డీఎస్పీ.

రెవెన్యూ శాఖ: 17. ఎ.శ్రీనివా్‌స-తహసీల్దార్‌, వేంపల్లి, 18.ఎన్‌.రవిశంకర్‌రెడ్డి -తహసీల్దార్‌, దువ్వూరు, 19. ఎస్‌.ప్రేమానంతకుమార్‌, తహసీల్దార్‌.

పంచాయతీరాజ్‌ శాఖ: 20.ఎన్‌.శివరామిరెడ్డి-సూపరింటెండెంట్‌, కడప జెడ్‌పీ.

వరంగల్ లో దంచికొట్టిన వాన, ఈ జిల్లాలకు హెచ్చరికలు

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్, వరంగల్ నగరంలో చాలా సేపు వర్షం కురిసింది. అకాల వర్షానికి ఏనుమాముల మార్కెట్‌లో పత్తి తడిచిపోయింది.

నైరుతి బంగాళాఖాతంలో మరియు దక్షిణ ఏపీ తీరంలో మరో ఉపరితల ఆవర్తం ఏర్పడినట్లు ఐఎండీ తెలిపింది. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీటర్ల నుంచి 3.1 కిమీ మధ్య విస్తరించి ఉన్నట్లు తెలిపింది. దక్షిణ ఛత్తీస్ ఘట్ మరియు దానిని అనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... ఇది దక్షిణ దిశగా వంగి ఉందని వివరించింది. ఇది ఇవాళ్టికి బలహీనపడుతుందని అంచనా వేసింది.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో ఇవాళ వాతావరణం మారిపోయింది. బుధవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్, వరంగల్ నగరంతో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసింది. వరంగల్ సిటీతో పాటు రూరల్ ఏరియాలో గంటకు పైగా వర్షం దంచికొట్టింది. ఈ అకాల వర్షం దాటికి ఏనుమాముల మార్కెట్‌లో పత్తి భారీ స్థాయిలో తడిచిపోయింది. పత్తిలో తేమ శాతం ఉంటే ప్రభుత్వం కొనుగోలు చేయదని రైతన్నలు వాపోయారు. అకాల వర్షం దాటికి తమ కష్టం నీళ్లపాలు అయ్యిందని బాధపడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

నవంబర్ 6వ తేదీ వరకు తెలంగాణ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రాణాలు హరించివేస్తున్న మయోనైజ్‏పై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

ప్రాణాలు హరించివేస్తున్న మయోనైజ్‏పై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. డా.బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియెట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులతో దామోదర రాజ నర్సింహా బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హోటళ్లలో తనిఖీలు, కల్తీ ఆహార పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి నియమించిన టాస్క్‌ఫోర్స్‌‌ కమిటీల పనితీరుపై మంత్రి ఆరా తీశారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో మయోనైజ్‌ను తయారు చేస్తున్నారని అధికారులు మంత్రి దామోదరకు చెప్పారు.

అందులో కల్తీ, ఉడకబెట్టని గుడ్లను ఉపయోగిస్తున్నారని.. దీని వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం పడుతోందని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం మయోనైజ్ పై బ్యాన్ విధించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోనూ మయోనైజ్ ను నిషేధం విధించాలని అధికారులు సూచించారు. సుదీర్ఘ చర్చల అనంతరం మయోనైజ్‌పై బ్యాన్ విధించాలని మంత్రి నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

ఫ్రాన్స్‌(France)లో పుట్టిన బర్గర్లు నుంచి శాండ్‌విచ్‌లు.. డిప్స్‌ నుంచి సలాడ్స్‌ వరకూ అన్నింట్లోనూ విరివిగా వాడేస్తోన్న ప్రధానమైన కాండిమెంట్స్‌లో ఒకటిగా నిలిచింది మయోనైజ్‌. మండీకి వెళ్లి బిర్యానీ తిన్నా, బార్బిక్యులో రోస్టెడ్‌ చికెన్‌ రుచి చూసినా, షవార్మ సెంటర్‌లో షవార్మ రోల్‌ తిన్నా, స్టార్‌ హోటల్స్‌లో కాక్‌టైల్‌ పార్టీలో స్నాక్స్‌తో పాటు మయోనైజ్‌ కామన్‌గా ఉంటుంది. అతి చిక్కగా ఉండే ఈ క్రీమీ సాస్‌ను పిల్లలు, పెద్దలూ ఇష్టంగానే తింటుంటారు. వెగన్‌ మయోనైజ్‌తో ఇబ్బందులు లేవుకానీ, ఎగ్‌ మయోనైజ్‌లో ప్రధానంగా వాడే గుడ్డు సొనలో ఉండే సాల్మొనెల్లా వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని న్యూట్రిషియనిస్ట్‏లు అంటున్నారు. హోటల్‌లో దీనిని తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలంటున్నారు.

ఇంట్లో తయారుచేసుకున్న మయోనైజ్‌ను త్వరగా వినియోగించాలనీ, ముఖ్యంగా కార్డియో, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారు వాటి జోలికి వెళ్లకపోవడం మంచిదంటున్నారు. హోటళ్లలో అందుబాటులో ఉంచిన మయోనైజ్‌ వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, దాన్ని నిషేధించాలని జీహెచ్‌ఎంసీ ప్రభుత్వానికి నివేదికలు పంపుతుండడంతో అందరి దృష్టి మయోనైజ్‌పై పడింది. కేరళలో ఎగ్‌ మయోనైజ్‌పై ఇప్పటికే నిషేధం విధించారు.