రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం ,రైతుల పట్ల చిత్తశుద్ధి లేని కారణంగా వరి ధాన్యం కోనుగోలు కేంద్రాలలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని బీజేపి ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి, నల్గొండ పార్లమెంట్ కాంటెస్ట్ అభ్యర్థి పాలకూరి రవిగౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు..
అకాల వర్షానికి వచ్చిన, వరదలకు వరి ధాన్యం కొట్టుకపోవడంతో రైతులు విలపిస్తున్నారు అని రవిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు..
ప్రభుత్వానికి అవగాహన లేక ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో గత ఇరవై రోజుల కింద కొనుగోలు కేంద్రాలకు రైతులు తమ ధాన్యాన్ని తీసుకొస్తే ప్రభుత్వం నేటికీ కొనలేని పరిస్థితి కనిపిస్తోంది..
గత యాసంగి సీజన్లో రైస్ మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం విషయంలో అటు మిల్లర్లకు ఇటు ప్రభుత్వం మధ్యలో నడుస్తున్న విభేదాల కారణంగా కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్లులను నేటికీ కేటాయించలేదు ..
అదే ప్రభుత్వముకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ వ్యవహారం అంతా ఎప్పుడో జరగాల్సిఉండేది అలాకాకుండా కొనుగోలు కేంద్రాలకు దాన్యం వచ్చిన తర్వాత ఇప్పుడు రైస్ మిల్లర్స్ తో చర్చలు నడుపుతూ ఆ చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన దాన్యాన్ని ఏ ఏ మిల్లులకు కేటాయించేపరిస్థితి కనబడకపోవడంతో కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం నిలిచిపోయింది..
నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అనేక కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిచి, కొన్నిచోట్ల ధాన్యం కొట్టుకపోయింది...
ధాన్యం వరద పాలు కావడంతో పండుగ రోజు రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ రైతులు దీపావళి పండుగ చేసుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి ఎఫ్సిఐ గోదాం లాంటి సంస్థలలో ధాన్యాన్ని భద్రపరిచే విధంగా చర్యలు చేపట్టి తక్షణమే కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని తరలించే విధంగా ఏర్పాటు చేయాలని రవిగౌడ్ కోరారు...
Nov 01 2024, 10:05