జన్వాడ ఫామ్ హౌస్ కేసుతో డిఫెన్స్ లో పడిన బీఆర్ఎస్..!
జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది అడ్డంగా బుక్ అవడంతో కేటీఆర్ ఇరకాటంలో పడ్డారు. పార్టీలో పాల్గొన్న ఒక వ్యక్తికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్, బీజేపీ చుక్కలు చూపిస్తున్నాయి. దీనిపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. రేవ్ పార్టీపై మీ స్పందన ఏంటి కేటీఆర్ స్పందన ఏమిటని కాంగ్రెస్ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి నిలదీశారు. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో పోలీసులు దాడులు చేశారని రామ్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
పార్టీలో ఒక వ్యక్తికి కోకైన్ డ్రగ్ పాజిటివ్ వచ్చిందన్నారు. సదరు వ్యక్తి కొకైన్ తీసుకున్నట్టుగా డ్రగ్ టెస్ట్ లో తేలడంతో ఎన్డీపీఎస్(NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. రాజ్ పాకాలపై సెక్షన్ 34(Section 34), ఎక్సైజ్ యాక్ట్(Excise Act) కింద మరో కేసు నమోదు చేశారని రాసుకొచ్చారు. కేటీఆర్ దీనిపై మీ స్పందన? ఏమిటి అంటూ కేటీఆర్ ను ట్యాగ్ చేశారు.కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్ లో జరిగిన విషయం ఘటనలు చూసి తెలంగాణ సమాజం సిగ్గు పడుతోందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు.
తెలంగాణను డగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. కేటీఆర్ సొంత బావమరిది ఫామ్ హౌస్‌లోనే రేవ్ పార్టీలు జరగడం దారుణమన్నారు. పోలీసుల సోదాలు చేసేకంటే ముందే రేవ్ పార్టీ నుంచి మరో 20 మంది వరకు వెళ్లిపోయారనే సమాచారం ఉందని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ వీకెండ్ వచ్చిందంటే రేవ్ పార్టీలు, రావుల పార్టీలు అని జరుగుతున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రాజులు, యువరాజులు కూర్చుని విదేశీ మాధకద్రవ్యాలతో పాటు, కోకైన్ లాంటి ఇతర డ్రగ్స్ తీసుకొంటున్నారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ఆ ఫామ్‌హౌస్ యాజమానితోని కుమ్మక్కు కాకపోతే.. ఫామ్‌హౌస్‌లో ఎస్ఓటీ పోలీసులు రైడ్ సమయంలో ఫామ్‌హౌస్ లోపల, చుట్టూ ఉన్నా సీసీ కెమెరా దృశ్యాలు బయట పెట్టాలని వారు డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటనపై కేటీఆర్ ఇంకా స్పందించలేదు. కేటీఆర్ మాజీ మంత్రి మల్లారెడ్డి మనవరాలి పెళ్లికి వెళ్లినట్లు తెలుస్తోంది. కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Oct 27 2024, 16:19