ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం
మెడికల్ కళాశాలలో తరగతుల ప్రారంభోత్సవంలో పాల్గొనడటం సంతోషంగా ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎనిమిది మెడికల్ కళాశాలలు రావాలని ఎంతో శ్రమించామన్నారు.
జిల్లాలోని నూతన మెడికల్ కళాశాలలో (Medak Medical Collage) ఎంబీబీఎస్ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ (Minister Damodara Rajanarsimha), ఇంచార్జీ మినిస్టర్ కొండా సురేఖ (Minister Konda Surekha) క్లాసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలో తరగతుల ప్రారంభోత్సవంలో పాల్గొనడటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎనిమిది మెడికల్ కళాశాలలు రావాలని ఎంతో శ్రమించామన్నారు.
దేశంలో, రాష్ట్రంలో అత్యధికంగా డయాబెటీస్ పెరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేజర్ వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్ణయం తీసుకుందన్నారు. 90 శాతం ట్రీట్మెంట్ అనేది హైదరాబాద్‌కు వెళ్లకుండా జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాబోయే విద్యా సంవత్సరం నర్సింగ్, పారా మెడికల్ కళాశాల మంజూరు చేస్తామని ప్రకటించారు. రాజకీయాలు శాశ్వతం కాదన్నారు. ప్రజలకు వైద్యం, విద్య, సంక్షేమం అందించాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణలో హైవేలపై 74 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ప్రధానిగా మోడీ 327 కొత్త మెడికల్ కళాశాలలు ఇచ్చారన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి వినతిపత్రం అందించామని తెలిపారు. తెలంగాణకు ఏయిమ్స్ ఇచ్చింది మోడీ అని అన్నారు. పేదలకు ఫ్రీగా ఉచిత వైద్యం అందించాలన్నదే మోడీ సర్కార్ లక్ష్యమని ఎంపీ తెలిపారు. మెదక్‌లోని మెడికల్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని జిల్లా ఇంచార్జి మినిస్టర్ కొండా సురేఖ తెలిపారు. విద్యార్థులు ఉత్తమ డాక్టర్లుగా కావాలని మంత్రి ఆకాంక్షించారు.
Oct 25 2024, 08:43