హైకోర్టులో విచారణ వాయిదా
మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్‌పై విచారణ హైకోర్టులో వాయిదా పడింది. శుక్రవారానికి కేసు విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం. సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అతనికి బెయిల్ ఇవ్వొదని పోలీసుల తరుపున న్యాయవాది వాదనలు వినిపించే అవకాశం ఉంది.
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ (Bapatla Former MP Nandigam Suresh) బెయిల్ పిటిషన్‌పై హైకోర్ట్‌లో (AP High Court) గురువారం విచారణ జరిగింది. సురేష్ తరపున వాదనలు ముగిశాయి. వాదనలు వినిపించేందుకు పోలీసుల తరపు న్యాయవాది కోర్టును సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం రేపటి (శుక్రవారం) కి వాయిదా వేసింది.
తుళ్లూరులోని వెలగపూడికి చెందిన మరియమ్మ హత్య కేసులో సురేష్ ఇప్పటికే అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైలులో (Guntur Jail) రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు సురేష్‌ను కస్టడీకి తీసుకుని తుళ్లూరు పోలీసులు విచారణ జరిపిన విషయం తెలిసిందే. అయితే విచారణలో మాజీ ఎంపీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, విచారణకు సహకరించని పరిస్థితి. ఈ క్రమంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ నందిగం సురేష్ హైకోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
అయితే విచారణకు సహకరించనందున బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించే అవకాశం ఉంది. దీనికై కొంత సమయం కావాలని పోలీసు తరుపున న్యాయవాది కోర్టును కోరడంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు. దీంతో రేపు మరోసారి నందిగం సురేష్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. ఆ తరువాత బెయిల్‌పై న్యాయమూర్తి తీర్పును వెలవరించే అవకాశం ఉంది.
నందిగం సురేష్ స్థానికుడు కావడంతో సాక్షులను బెదిరించి సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అతనికి బెయిల్ ఇవ్వొదని పోలీసుల తరుపున న్యాయవాది వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, కేసులో తన పేరు ఉందని కూడా తనకు తెలియదంటూ పోలీసు కస్టడీలో మాజీ ఎంపీ అబద్ధం చెప్పిన నేపథ్యంలో సాక్షాలను తారుమారు చేసి అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని కోరడంతో పాటు బలమైన ఆధారాలను సమర్పించేందుకు పోలీసు తరుపున న్యాయవాదులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం కొంత సమయం కావాలని హైకోర్టును పోలీసు తరపు న్యాయవాది కోరినట్లు సమాచారం. అయితే మాజీ ఎంపీకి బెయిల్ వస్తుందా.. రాదా అనేది రేపటి విచారణలో తెలియనుంది.
Oct 24 2024, 19:09