NLG: డిసెంబర్ 20, 21 తేదీలలో నల్లగొండలో జాతీయ సదస్సు
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అర్థ శాస్త్ర విభాగంలో డిసెంబర్ 20, 21 తేదీలలో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం తమ కార్యాలయంలో అధ్యాపకులతో కలిసి సదస్సు బ్రోచర్ ను విడుదల చేశారు.
ఈ మేరకు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ‘స్థిరమైన అభివృద్ధి – అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై జరిగే ఈ జాతీయ సదస్సులో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి, వివిధ విశ్వవిద్యాలయాల నుండి అకాడమిషియన్లు, ఆర్థికవేత్తలు, ప్రొఫెసర్లు, వివిధ కళాశాలల అధ్యాపకులు పరిశోధక విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగు ఈ సదస్సులో జిల్లాలోని అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఆసక్తి గల అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు తగిన రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకొని సదస్సులో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
కార్యక్రమంలో అకాడమిక్ కో ఆర్డినేటర్ డా. పరంగి రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ డా. పిల్లి సురేష్ బాబు, సదస్సు కన్వీనర్ డా. డి. మునిస్వామి, నిర్వాహక సంచాలకులు ఎ. మల్లేశం, పరీక్షల నియంత్రణాధికారి బి. నాగరాజు, ఎన్ సి సి ఆఫీసర్ సిహెచ్ సుధాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డా. అనిల్ బొజ్జ, ఎన్. కోటయ్య, తెలుగు విభాగం అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, చరిత్ర విభాగం అధ్యక్షులు డా. భట్టు కిరీటం, తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.
Oct 22 2024, 21:55