/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz కజాన్‌లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ 'ప్రతి సమస్యను శాంతి ద్వారా పరిష్కరించుకోవాలి' Raghu ram reddy
కజాన్‌లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ 'ప్రతి సమస్యను శాంతి ద్వారా పరిష్కరించుకోవాలి'

16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యా చేరుకున్నారు. కజాన్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లాంఛనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీతో మాట్లాడుతూ మా సంబంధాలు చాలా పాతవని అన్నారు. భారత్, రష్యాలను బ్రిక్స్‌లో అసలైన సభ్యదేశాలుగా అభివర్ణించారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైన సందర్భంగా ప్రధాని మోదీ పుతిన్‌కు స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలిపారు. మీ స్నేహానికి (పుతిన్) నా కృతజ్ఞతలు మరియు సాదర స్వాగతం పలికినందుకు ప్రధాని మోదీ అన్నారు. ఈ నగరంతో భారతదేశానికి లోతైన మరియు చారిత్రక సంబంధాలున్నాయి. కజాన్‌లో భారత కొత్త కాన్సులేట్‌ను ప్రారంభించడంతో ఈ సంబంధాలు మరింత బలపడతాయి. గత 3 నెలల్లో రెండుసార్లు రష్యాలో నా పర్యటన మా సన్నిహిత సమన్వయం మరియు లోతైన స్నేహాన్ని ప్రతిబింబిస్తుంది.

రష్యా-ఉక్రెయిన్ వివాదం శాంతియుతంగా పరిష్కరించుకోవాలి: ప్రధాని మోదీ

ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా మోదీ పుతిన్ వద్ద ప్రస్తావించారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న వివాదంపై నేను మీతో నిరంతరం టచ్‌లో ఉన్నాను అని ప్రధాని మోదీ అన్నారు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, సమస్యలు శాంతియుతంగా పరిష్కరించబడాలని మేము నమ్ముతున్నాము. శాంతి మరియు స్థిరత్వం యొక్క ముందస్తు స్థాపనకు మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాము. మన ప్రయత్నాలన్నింటిలో మానవత్వానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. రాబోయే కాలంలో అన్ని విధాలా సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది.

పుతిన్ ఏమి చెప్పాడు

అంతకుముందు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, మేము జూలైలో కలుసుకున్నామని నాకు గుర్తుందని, మేము చాలా విషయాలపై చాలా బాగా చర్చించాము. మేము కూడా చాలాసార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నాం. కజాన్‌ను సందర్శించడానికి ఆహ్వానాన్ని అంగీకరించినందుకు నేను మీకు చాలా కృతజ్ఞుడను. ఈరోజు మనం బ్రిక్స్ సదస్సు ప్రారంభోత్సవానికి హాజరవుతాము, అనంతరం విందులో పాల్గొంటాము.

ఈరోజు జరగనున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇతర నేతలతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అన్నారు. డిసెంబరు 12న న్యూఢిల్లీలో ఇంటర్‌గవర్నమెంటల్‌ కమిషన్‌ తదుపరి సమావేశం జరగనుందని ఆయన చెప్పారు. మా ప్రాజెక్టులు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి. మీరు కజాన్‌లో భారతీయ కాన్సులేట్‌ను తెరవాలని నిర్ణయించుకున్నారు. మేము దానిని స్వాగతిస్తున్నాము. భారతదేశ విధానాలు మన సహకారానికి మేలు చేస్తాయి. రష్యాలో మిమ్మల్ని మరియు మీ ప్రతినిధి బృందాన్ని చూసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము.

ప్రభుత్వాలు మారిన మారని విద్యార్థుల తలరాతలు తీరని విద్యార్థుల బాధలు

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్

పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లని తక్షణమే విడుదల చేయాలని అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మేస్చార్జిలని పెంచాలని బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి భారీ ర్యాలీ ధర్నా ముట్టడి అరెస్ట చేయడం జరిగింది ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన విద్యార్థుల తలరాతలు మారట్లేదు విద్యార్థి బాధలు తీరట్లేదు 

గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ లని స్కాలర్షిప్లని తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.SC/ST/BC/EBC మైనారిటీ విద్యార్థుల గత రెండు సం. ఫీజుల బకాయిలు 3 వేల కోట్లు వెంటనే చెల్లించాలి.

 ఇంజనీరింగ్ పి.జి. డిగ్రీ- ఇంటర్ తదితర కాలేజి కోర్సులు చదివే BC/EBC విద్యార్థులు పూర్తి ఫీజులు మంజూరు చేయాలి. ఈ స్కీమును 2008 పెట్టినట్లుగా యదాతథంగా అమలు చేయాలి.

 కాలేజి ద్యార్థులకు సంవత్సరం కు 20 వేల స్కాలర్ షిప్ ప్రతి విద్యార్ధికి నుంజూరుచేయాలి.

ఇంటర్ మీడియట్ కోర్సులు చదివే విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ రేటు రూ.1800 నుండి రూ.15 వేలకు పెంచాలి. మొత్తం ప్రభుత్వమే మంజూరు చేయాలి SC/ST/BC కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1500 నుండి 3 వేలకు, పాఠశాల SC/ST/BC హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1100 నుంచి 2 వేలకు పెంచాలి బి.సిలకు జనాభా ప్రకారం అదనంగా మరో 120 బి.సి గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలి.

ఇటీజుల ముఖ్యమంత్రి గారు బి.సిలకు 33 గురుకుల పాఠశాలలు, 15 బి.సి గురుకుల డిగ్రీ కాలేజిలు మంజూరు చేశారు. బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణన్న నాయకత్వంలో 120 బి.సి గురుకుల పాటశాలలు, 50 డిగ్రీ కాలేజిలు మంజూరు చేయాలని పోరాడుతున్నాము. పూర్తి డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమిస్తాం SC/ST/BC విద్యార్థులకు 300 కాలేజీ హాస్టళ్ళు కొత్తగా ప్రారంబించాలి దరఖాస్తు చేసిన విదేశీ విద్యార్థులందరికి 20 లక్షల పై ఫండు" మంజూరు చేయాలి బి.సి. కాలేజి హాస్టళ్లకు, గురుకుల పాటశాలలకు స్వంత భవనాలు నిర్మించాలి. లేనియెడల బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం

 ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  పోలగోని వెంకటేష్ గౌడ్, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ ,జక్క నాగేశ్వరరావు విద్యార్థి సంఘం నాయకులు పొగాకు రవికుమార్ ,బచ్చనబోయిన సాయికుమార్ యాదవ్, చింతల విజయకుమార్ ,బచ్చనబోయిన రాజు యాదవ్, తరుణ్ కుమార్ యాదవ్ ,మహేష్, మణికంఠ, స్వామి, శ్రీకాంత్ ,,మహేందర్ ,అని కుమార్ ,ఫణి కుమార్ గణేష్ ,పృధ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు

పవన్ ‌కల్యాణ్‌ను ఏకిపారేసిన యాంకర్ శ్యామల

ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడులపై వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల స్పందించారు. మంగళవారం మీడియా సమావేశంలో శ్యామల మాట్లాడుతూ.. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె వ్యాఖ్యానించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టార్గెట్‌గా ఆమె ప్రశ్నలు వర్షం కురిపించారు.పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 16 ఏళ్ల బాలికపై లైంగికదాడి జరిగితే ఆయన ఎందుకు పరామర్శించలేదని యాంకర్ శ్యామల ప్రశ్నించారు. బాధిత కుటుబాన్ని పరామర్శించే బాధ్యత మన డిప్యూటీ సీఎంకు లేదా అంటూ పవన్ కల్యాణ్‌ను శ్యామల నిలదీశారు. దళిత వర్గానికి చెందిన అమ్మాయి అని చిన్న చూపు చూస్తున్నారా అంటూ ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ 30 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని జగన్‌పై ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలేనన్ని అఘాయిత్యాలు జరిగియాని , వీటిపై డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించడం లేదని శ్యామల పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో చిన్నవాటిని భూతద్దంలో చూపించిన నాయకులు, ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని శ్యామల ప్రశ్నించారు.. ఈ రాష్ట్రంలో బాలికలపైన, ఆడపిల్లలపైన మహిళలపైన హత్యలు,అత్యాచారాలు జరుగుతుండడం దురదృష్టకరమని , ఇవన్నీ కూడా చంద్రబాబు ప్రభుత్వం చేతకానితనం వల్లే జరుగుతున్నాయని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాలేజ్‌కు వెళ్లే యువతలను తీసుకువెళ్లి తగలబెట్టి చంపుతున్నారు.ఈ ఘటనలతో అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పాలన సాగుతుందా లేదా అన్న అనుమానం కలుగుతుందని శ్యామల వ్యాఖ్యానించారు.

చిన్నపిల్లలు పెద్దవారు అత్తా కోడలు అని వరస లేకుండా మతిస్థిమితం లేని వారిని కూడా చూడకుండా ఎవ్వరిని వదల పెట్టకుండా నేరస్తులు ఎలా అఘాయిత్యాలు చేస్తున్నారో మనం కల్లారా చూస్తున్నామని శ్యామల తెలిపారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఈ నాలుగు నెలలోనే జరిగినన్నీ దారుణాలు ఎప్పుడు కూడా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏసీబీకి చిక్కిన మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌

రూ. 20,000 లంచం తీసుకుంటుండ‌గా ప‌ట్టుకున్న అధికారులు

పెబ్బేర్ మున్సిప‌ల్ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఏసీబీ దాడులు నిర్వ‌హించారు. రూ.20000 లు లంచం తీసుకుంటుండ‌గా మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆదిశేషును మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఏసీబీ అడిష‌న‌ల్ ఎస్పీ బి.శ్రీ‌కృష్ణ గౌడ్ ప‌ట్టుకున్నారు.

ఒక కాంట్రాక్ట‌ర్ నుంచి లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. మున్సిప‌ల్ కార్యాలయంలో ఇంకా సోదాలు జ‌రుగుతున్నాయి.

ఆర్థిక నిర్వహణ సూచికలో తెలంగాణ‌ రాష్ట్రం అగ్రస్థానం.

గ‌త పాల‌కులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.. ఆర్థిక నిర్వ‌హ‌ణ అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని నిత్యం అస‌త్యాలు, అబ‌ద్దాలు చెబుతున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో ఆర్థిక నిర్వ‌హ‌ణ ఎలా ఉందో చెప్ప‌డానికి ఈ సాక్ష్యం స‌రిపోతోంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

గ‌త పాల‌కులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.. ఆర్థిక నిర్వ‌హ‌ణ అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని నిత్యం అస‌త్యాలు, అబ‌ద్దాలు చెబుతున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో ఆర్థిక నిర్వ‌హ‌ణ ఎలా ఉందో చెప్ప‌డానికి ఈ సాక్ష్యం స‌రిపోతోంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రిపోర్టుతో కాంగ్రెస్, బీజేపీ అబ‌ద్ధాలు బ‌ట్ట‌బ‌య‌లు అయ్యాయ‌ని, ఎప్ప‌టికైనా స‌త్య‌మే గెలుస్తుంద‌న్నారు.

2014-15 నుండి 2022-23 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక నిర్వహణ సూచికలో తెలంగాణ‌ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఈ స‌మ‌యంలో ఆర్థిక నిర్వహణలో తెలంగాణ ఓ వెలుగు వెలిగిపోయింది. డెబ్ట్ మేనేజ్‌మెంట్ అండ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్‌లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం అసాధారణమైన ఆర్థిక వివేకం, క్రమశిక్షణను ప్రదర్శించిందని స్పష్టమవుతోంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

దీంతో రాష్ట్రం దివాళా తీసిందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న బూటకపు ప్రచారానికి తెరపడింది. కాంగ్రెస్ నాయకత్వమే ఇవాళ దివాళా తీసింద‌న్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ, 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పార్టీ యొక్క సమర్థవంతమైన పాలనకు ఈ విజయం నిదర్శనం అని కేటీఆర్ పేర్కొన్నారు.

బ్రిక్స్ కోసం రష్యా చేరుకున్న ప్రధాని మోదీ..

అక్టోబర్ 22 నుంచి 24వ తేదీ వరకు రష్యా అధ్యక్షతన కజాన్‌లో 16వ బ్రిక్స్ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ రష్యాలోని కజాన్ నగరానికి చేరుకున్నారు. ఇక్కడ విమానాశ్రయంలో మన ప్రధాని నరేంద్ర మోడీకి భారతీయులు సహా రష్యన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. భారతీయ సాంప్రదాయ దుస్తులైన ధోతీ, చీరలు ధరించి సుస్పష్టంగా కృష్ణుడిని కీర్తిస్తూ రెండు చేతులు జోడించి ప్రధాని మోడీని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ రోజు రష్యా అధ్యక్షుడి పుతిన్ లో ప్రధానమంత్రి మోడీ భేటీ కానున్నారు.

రష్యా అధ్యక్షతన 16వ బ్రిక్స్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రష్యాలోని కజాన్ నగరానికి చేరుకున్నారు. 16వ బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు కజాన్‌కు రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ కజాన్ కు చేరుకున్నారు. అయితే భారత ప్రధాని మోడీ.. కజాన్ విమానాశ్రయంలో ఘనం స్వాగతం లభించింది. భారతీయులు సహా రష్యన్ ప్రజలు భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరించి భారీగా తరలి వచ్చిన ప్రజలు ప్రధాని మోడీకి కృష్ణ భజనలను కీర్తిస్తూ స్వాగతం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నేట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

రష్యన్ కమ్యూనిటీకి చెందిన కళాకారులు భారతీయ దుస్తులు ధరించి నృత్యం చేసి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. రష్యా పౌరులు భారతీయ దుస్తులను ధరించగా.. మహిళలు చీరలో కనిపించారు. కాగా పురుషులు ఖాదీ కుర్తా, ధోతీ ధరించారు.

ప్రధాని మోడీ భారతీయ ప్రవాసులను కలిశారు, ప్రతిచోటా ప్రజల చేతుల్లో త్రివర్ణ పతాకం కనిపించింది. ప్రధానమంత్రిని చూడటానికి ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రధాని మోడీ పలువురితో కరచాలనం చేసి చిన్నారులను ఆశీర్వదించారు. పలువురితో ఫొటోలు కూడా దిగారు. రష్యాలో దాదాపు 62 వేల మంది భారతీయ వలసదారులు నివసిస్తున్నారు.

బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన తన సహచరులతో కూడా ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. బ్రిక్స్ సదస్సుకు భారతదేశం చాలా ప్రాముఖ్యతనిస్తుంది. రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ , ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసితో మాట్లాడనున్నారు. బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు విస్తృతమైన అంశాలపై చర్చిస్తారని భావిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది.

24న నగరానికి కృష్ణాజలాలు బంద్‌..

ఈనెల 24న నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో 24 గంటల పాటు అంతరాయం తలెత్తనున్నది. హైదరాబాద్‌(Hyderabad) మహా నగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సరఫరా ఫేజ్‌-3లోని 2375 ఎంఎం డయా ఎంఎస్‌ పంపింగ్‌ మెయిన్‌ పైపులైనుకు లీకేజీ ఏర్పడింది.

ఈనెల 24న నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో 24 గంటల పాటు అంతరాయం తలెత్తనున్నది. హైదరాబాద్‌(Hyderabad) మహా నగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సరఫరా ఫేజ్‌-3లోని 2375 ఎంఎం డయా ఎంఎస్‌ పంపింగ్‌ మెయిన్‌ పైపులైనుకు లీకేజీ ఏర్పడింది. లీకేజీని అరికట్టడానికి ఈ నెల 24న ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు (25వ తేదీ) ఉదయం ఆరు గంటల వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు.

ఈ నేపథ్యంలో నగరానికి కృష్ణా ఫేజ్‌-3 నుంచి వచ్చే జలాలను 24గంటల పాటు బంద్‌ చేయనున్నట్లు వాటర్‌బోర్డు అధికారులు సోమవారం ప్రకటించారు. దీనివల్ల శాస్త్రీపురం, బండ్లగూడ, భోజగుట్ట, షేక్‌పేట్‌, ఆళ్లబండ, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, ప్రశాసన్‌నగర్‌, తట్టిఖానా, లాలాపేట్‌, సాహెబ్‌నగర్‌, ఆటోనగర్‌, సరూర్‌నగర్‌, వాసవి రిజర్వాయర్లు, సైనిక్‌పురి, మౌలాలి, గచ్చిబౌలి, మాదాపూర్‌, అయ్యప్ప సొసైటీ(Gachibowli, Madapur, Ayyappa Society), కావూరిహిల్స్‌, స్నేహపురి, కైలాసగిరి, దేవేంద్రనగర్‌, మధుబన్‌,

దుర్గానగర్‌, బుద్వేల్‌, సులేమాన్‌నగర్‌, గోల్డెన్‌హైట్స్‌, 9 నంబర్‌, కిస్మత్‌పూర్‌, గంధంగూడ, బోడుప్పల్‌, మల్లికార్జుననగర్‌, మాణిక్‌చంద్‌, చెంగిచెర్ల(Manikchand, Chengicherla), భరత్‌నగర్‌, ఫీర్జాదిగూడ, పెద్ద అంబర్‌పేట్‌, ధర్మసాయి (శంషాబాద్‌) రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. ఆయా ప్రాంతాల వినియోగదారులు గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.

ఎక్కువ మంది పిల్లలను కనాలని నాయుడు-స్టాలిన్ వాదన , ఇద్దరు నాయకులను భయపెడుతున్న విషయం ఏమిటో తెలుసుకోండి

భారతదేశ జనాభాపై కొత్త చర్చ మొదలైంది. ఇది దక్షిణాది రాష్ట్రాల నుండి మాత్రమే ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తమ తమ రాష్ట్రాల ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ సిఎం రాష్ట్ర 'వృద్ధాప్య జనాభా' సమస్యను లేవనెత్తగా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ దంపతులు '16 మంది పిల్లలను' పెంచడం గురించి 2026 నాటికి జరిగే డీలిమిటేషన్ కసరత్తుకు 'పరిష్కారం'గా మాట్లాడారు. ఈ వ్యవహారంపై రాజకీయాలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. డీలిమిటేషన్ ప్రక్రియకు డెమోగ్రాఫిక్ మార్పు అంశాన్ని ముడిపెట్టిన స్టాలిన్ సోమవారం రాష్ట్రంలోని ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం మాట్లాడుతూ లోక్‌సభ డీలిమిటేషన్ ప్రక్రియ 16 (ఆస్తి) పిల్లలు అనే తమిళ సామెత వైపు తిరిగి చాలా మంది దంపతులకు ఆశలు రేకెత్తించవచ్చని అన్నారు. ఇప్పుడు అక్షరాలా 16 మంది పిల్లలను కలిగి ఉండాలని, చిన్న మరియు సంతోషంగా ఉన్న కుటుంబం అని ప్రజలు భావించే పరిస్థితి ఇప్పుడు తలెత్తిందని స్టాలిన్ అన్నారు. జనాభా లెక్కలు మరియు లోక్‌సభ డీలిమిటేషన్ ప్రక్రియను ప్రస్తావిస్తూ, కొత్తగా పెళ్లయిన జంటలు ఇప్పుడు తక్కువ పిల్లలను కలిగి ఉండాలనే ఆలోచనను విరమించుకోవచ్చని ముఖ్యమంత్రి అన్నారు.

ఎక్కువ మంది పిల్లలను కనడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రకటన చేసిన మరుసటి రోజు స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయగలిగే చట్టాన్ని తీసుకురావాలని తన పరిపాలన యోచిస్తున్నట్లు ఆదివారం అంతకుముందు నాయుడు ప్రకటించారు. రాష్ట్ర వృద్ధాప్య జనాభా మరియు జనాభా సమతుల్యతపై దాని ప్రభావం గురించి ఆందోళనలను ఉటంకిస్తూ, ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలని ఆయన కుటుంబాలను కోరారు.

దక్షిణ భారతదేశంలో జనాభా వృద్ధాప్యానికి గురవుతున్నదని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి మహిళ తన జీవితకాలంలో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలకు జన్మనివ్వాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జననాల రేటు ప్రతి స్త్రీకి 2.1 సజీవ జననాలకు ప్రత్యామ్నాయ స్థాయి కంటే తక్కువగా ఉంది. మన జనాభాను మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని నాయుడు అన్నారు. 2047 నాటికి మనకు డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉంటుందని, మరింత యువత పెరుగుతుందని చెప్పారు. 2047 తర్వాత వృద్ధులు ఎక్కువగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో, ఇద్దరు పిల్లలు (ఒక మహిళ) కంటే తక్కువ పుడితే, జనాభా తగ్గుతుంది. మీరు (ప్రతి మహిళ) ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలకు జన్మనిస్తే, జనాభా పెరుగుతుంది.

2026లో డీలిమిటేషన్ కారణంగా తమిళనాడుతో సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో మార్పులను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ప్రకటన వచ్చింది. 2026లో షెడ్యూల్ ప్రకారం భారతదేశంలో డీలిమిటేషన్ నిర్వహిస్తే, 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాలు 32 సీట్లు, దక్షిణాది రాష్ట్రాలు 24 సీట్లు కోల్పోతాయి. థింక్ ట్యాంక్ కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రచురించిన 'ఇండియాస్ లూమింగ్ క్రైసిస్ ఆఫ్ రిప్రజెంటేషన్' అనే అధ్యయనంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కలిసి ఈ ప్రక్రియలో 16 స్థానాలను కోల్పోతాయని పేర్కొంది.

వాట్సప్ ద్వారా పౌర సేవలు..

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. ధ్రువీకరణ పత్రాలు, ఇతరత్రా బిల్లుల చెల్లింపుల కోసం ఇకపై గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండదు. ప్రజలకు పౌరసేవలను మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారమే ఒక్క క్లిక్ ద్వారా పౌర సేవలను అందించేలా మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకున్నారు. వాట్సప్ ద్వారా పౌర సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం మెటాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ అధికారులు, మెటా ప్రతినిధులు ఢిల్లీ ఎంవోయూ చేసుకున్నారు.

ఆండ్రాయిడ్ ఫోన్.. వాట్సప్.. ఏబీసీడీలు రాని వారికి కూడా వీటిపై అవగాహన ఉంటోంది. బ్యాంక్ అకౌంట్ లేకపోయినా కూడా .. వాట్సప్ అకౌంట్ ఉండే పరిస్థితి నేటి జనరేషన్‌ది. అయితే ఇలాంటి వాట్సప్ ద్వారా పౌర సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు పౌర సేవలను మరింత సులభతరంగా అందించేందుకు గానూ.. ఏపీ ప్రభుత్వం మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ప్రభుత్వ అధికారులు, వాట్సప్ ప్రతినిధులు అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. త్వరలోనే మెటా టెక్నాలజీ ద్వారా పౌర సేవలను ఒక్క క్లిక్ ద్వారా అందిస్తామని నారా లోకేష్ ఒప్పందం అనంతరం ట్వీట్ చేశారు.

ఇక ఈ ఒప్పందం ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు మొదలుకుని ప్రభుత్వం అందించే ధ్రువీకరణ పత్రాలు.. కరెంట్ బిల్లుల దగ్గర నుంచి ఇంటి పన్నులు, నల్లా పన్ను, ఇతరత్రా బిల్లుల చెల్లింపుల వరకూ అన్ని పౌరసేవలనూ వాట్సప్ ద్వారా ఒక్క క్లిక్‌తో అందించేందుకు ఏపీ ప్రభుత్వం మెటాతో కలిసి అడుగులు వేస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పలువురు విద్యార్థులు, యువత ఈ సమస్యను నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. సకాలంలో సర్టిఫికేట్లు అందక ఇబ్బందులు పడుతున్నామని.. టెక్నాలజీ సాయంతో అన్ని పనులూ ఇంటివద్దకే అందుతున్నప్పుడు.. పౌరసేవలను కూడా ఇలాగే అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే ఆ రకంగా చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ అప్పట్లో హామీ ఇచ్చారు.

ఇక ఇచ్చిన హామీ ప్రకారమే వాట్సప్ ద్వారా పౌర సేవలను అందించేందుకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారు. సర్టిఫికేట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా.. వాట్సప్ ద్వారా అందించేలా చర్యలు చేపట్టారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలకు మాతృసంస్థ మెటా. ఈ నేపథ్యంలో మెటా యాజమాన్యంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

ఒప్పందం ద్వారా.. మెటా ఫ్లాట్ ఫామ్‌ వాట్సాప్‌ బిజినెస్ ద్వారా ఇక‌పై స‌ర్టిఫికెట్లు వేగంగా, సుల‌భంగా పొందే వీలుంటుంది, అలాగే ట్యాంప‌రింగ్ అవ‌కాశం లేకుండా పార‌ద‌ర్శకంగా ఆన్‌లైన్‌లోనే స‌ర్టిఫికెట్లు పొందే అవకాశం ఉంటుంది. మెటాతో ఒప్పందం చారిత్రాత్మక‌మైన మైలురాయిగా అభివ‌ర్ణించిన నారా లోకేష్.. యువ‌గ‌ళం పాద‌యాత్రలో హామీ ఇచ్చిన విధంగానే మొబైల్‌లోనే స‌ర్టిఫికెట్లు అందిస్తామని అన్నారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు దారుణ హత్య

జగిత్యాల(Jagithyala) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు దారుణ హత్యకు(Brutal murder) గరయ్యాడు.

జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు దారుణ హత్యకు(Brutal murder) గరయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు(Congress leader Ganga Reddy) మారు గంగారెడ్డిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.

జగిత్యాలలో గంగారెడ్డి హత్యకు నిరసనగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్నాకు దిగారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రోద్బలం వల్లే గంగారెడ్డి హత్య అని ఆరోపించారు.

కాగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దార్యప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.