పవన్ కల్యాణ్‌ను ఏకిపారేసిన యాంకర్ శ్యామల
ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడులపై వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల స్పందించారు. మంగళవారం మీడియా సమావేశంలో శ్యామల మాట్లాడుతూ.. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె వ్యాఖ్యానించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టార్గెట్‌గా ఆమె ప్రశ్నలు వర్షం కురిపించారు.పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 16 ఏళ్ల బాలికపై లైంగికదాడి జరిగితే ఆయన ఎందుకు పరామర్శించలేదని యాంకర్ శ్యామల ప్రశ్నించారు. బాధిత కుటుబాన్ని పరామర్శించే బాధ్యత మన డిప్యూటీ సీఎంకు లేదా అంటూ పవన్ కల్యాణ్‌ను శ్యామల నిలదీశారు. దళిత వర్గానికి చెందిన అమ్మాయి అని చిన్న చూపు చూస్తున్నారా అంటూ ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ 30 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని జగన్‌పై ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలేనన్ని అఘాయిత్యాలు జరిగియాని , వీటిపై డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించడం లేదని శ్యామల పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో చిన్నవాటిని భూతద్దంలో చూపించిన నాయకులు, ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని శ్యామల ప్రశ్నించారు.. ఈ రాష్ట్రంలో బాలికలపైన, ఆడపిల్లలపైన మహిళలపైన హత్యలు,అత్యాచారాలు జరుగుతుండడం దురదృష్టకరమని , ఇవన్నీ కూడా చంద్రబాబు ప్రభుత్వం చేతకానితనం వల్లే జరుగుతున్నాయని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాలేజ్‌కు వెళ్లే యువతలను తీసుకువెళ్లి తగలబెట్టి చంపుతున్నారు.ఈ ఘటనలతో అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పాలన సాగుతుందా లేదా అన్న అనుమానం కలుగుతుందని శ్యామల వ్యాఖ్యానించారు.
చిన్నపిల్లలు పెద్దవారు అత్తా కోడలు అని వరస లేకుండా మతిస్థిమితం లేని వారిని కూడా చూడకుండా ఎవ్వరిని వదల పెట్టకుండా నేరస్తులు ఎలా అఘాయిత్యాలు చేస్తున్నారో మనం కల్లారా చూస్తున్నామని శ్యామల తెలిపారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఈ నాలుగు నెలలోనే జరిగినన్నీ దారుణాలు ఎప్పుడు కూడా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Oct 22 2024, 18:21