ఆర్థిక నిర్వహణ సూచికలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం.
గత పాలకులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.. ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని నిత్యం అసత్యాలు, అబద్దాలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణ ఎలా ఉందో చెప్పడానికి ఈ సాక్ష్యం సరిపోతోందని కేటీఆర్ పేర్కొన్నారు.
గత పాలకులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.. ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని నిత్యం అసత్యాలు, అబద్దాలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణ ఎలా ఉందో చెప్పడానికి ఈ సాక్ష్యం సరిపోతోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రిపోర్టుతో కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలు బట్టబయలు అయ్యాయని, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందన్నారు.
2014-15 నుండి 2022-23 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక నిర్వహణ సూచికలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఈ సమయంలో ఆర్థిక నిర్వహణలో తెలంగాణ ఓ వెలుగు వెలిగిపోయింది. డెబ్ట్ మేనేజ్‌మెంట్ అండ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్‌లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం అసాధారణమైన ఆర్థిక వివేకం, క్రమశిక్షణను ప్రదర్శించిందని స్పష్టమవుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.
దీంతో రాష్ట్రం దివాళా తీసిందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న బూటకపు ప్రచారానికి తెరపడింది. కాంగ్రెస్ నాయకత్వమే ఇవాళ దివాళా తీసిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ, 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పార్టీ యొక్క సమర్థవంతమైన పాలనకు ఈ విజయం నిదర్శనం అని కేటీఆర్ పేర్కొన్నారు.
Oct 22 2024, 17:02