24న నగరానికి కృష్ణాజలాలు బంద్..
ఈనెల 24న నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో 24 గంటల పాటు అంతరాయం తలెత్తనున్నది. హైదరాబాద్(Hyderabad) మహా నగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సరఫరా ఫేజ్-3లోని 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ పైపులైనుకు లీకేజీ ఏర్పడింది.
ఈనెల 24న నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో 24 గంటల పాటు అంతరాయం తలెత్తనున్నది. హైదరాబాద్(Hyderabad) మహా నగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సరఫరా ఫేజ్-3లోని 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ పైపులైనుకు లీకేజీ ఏర్పడింది. లీకేజీని అరికట్టడానికి ఈ నెల 24న ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు (25వ తేదీ) ఉదయం ఆరు గంటల వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు.
ఈ నేపథ్యంలో నగరానికి కృష్ణా ఫేజ్-3 నుంచి వచ్చే జలాలను 24గంటల పాటు బంద్ చేయనున్నట్లు వాటర్‌బోర్డు అధికారులు సోమవారం ప్రకటించారు. దీనివల్ల శాస్త్రీపురం, బండ్లగూడ, భోజగుట్ట, షేక్‌పేట్, ఆళ్లబండ, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, ప్రశాసన్‌నగర్, తట్టిఖానా, లాలాపేట్, సాహెబ్‌నగర్, ఆటోనగర్, సరూర్‌నగర్, వాసవి రిజర్వాయర్లు, సైనిక్‌పురి, మౌలాలి, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ(Gachibowli, Madapur, Ayyappa Society), కావూరిహిల్స్, స్నేహపురి, కైలాసగిరి, దేవేంద్రనగర్, మధుబన్,
దుర్గానగర్, బుద్వేల్, సులేమాన్‌నగర్, గోల్డెన్‌హైట్స్, 9 నంబర్, కిస్మత్‌పూర్, గంధంగూడ, బోడుప్పల్, మల్లికార్జుననగర్, మాణిక్‌చంద్, చెంగిచెర్ల(Manikchand, Chengicherla), భరత్‌నగర్, ఫీర్జాదిగూడ, పెద్ద అంబర్‌పేట్, ధర్మసాయి (శంషాబాద్) రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. ఆయా ప్రాంతాల వినియోగదారులు గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.
Oct 22 2024, 16:42