PDSU సభను విజయవంతం చేయాలని.. కరపత్రాలు ఆవిష్కరణ
నల్లగొండ: PDSU విప్లవ విద్యార్థి ఉద్యమానికి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా అర్ధ శతాబ్దోత్సవ సభలకు PDSU పిలుపునిచ్చింది. నల్లగొండ పట్టణ కేంద్రంలో ఈ నెల 21 న అంబెడ్కర్ భవన్ లో జరిగే సభ కు సంబందించి ఇవాళ పట్టణంలోని గర్ల్స్ హాస్టల్ లో కరపత్రాలు ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా PDSU జిల్లా కార్యదర్శి పోలె పవన్ మాట్లాడుతూ.. 50 ఏళ్ల PDSU విప్లవ ప్రస్థానంలో అనేకమంది విద్యార్థి రత్నాలు, బిగి పిడికిలి జెండా కోసం తమ ప్రాణాలు తృణ పాయం చేశారని తెలిపారు.
కామ్రేడ్ జార్జి రెడ్డి మతోన్మాద కత్తిపోట్లకి ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో నేల కొరిగాడని, కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్, శ్రీపాద శ్రీహరి నాటి ఎమర్జెన్సీ చీకట్లో నాటి నియంతృత్వ పాలకుల తుపాకి తూటాలకు తమ ప్రాణాలని అర్పించారని.. కోలా శంకర్, చేరాలు, రంగవల్లి, స్నేహాలత, మారోజు వీరన్న, మధుసూదన్ రాజు యాదవ్, యానాల వీరారెడ్డి, రమణయ్య, సాంబన్న, వరహాలు లాంటి ఎందరో వీరులు తమ విలువైన ప్రాణాలని ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి ఇచ్చి సంస్థని సమున్నతంగా నిలబెట్టారని అన్నారు. ఏ విద్యార్థి సంఘం కి లేని త్యాగాల చరిత్ర పీ.డీ.ఎస్.యు సంస్థకి ఉన్నదని వారు తెలిపారు.
అక్టోబర్ 24 న ఓయూ లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే 50 వసంతల అర్ధ శతాబ్దోత్సవ సభలకు పూర్వ, ప్రస్తుత PDSU నాయకులు మరియు విద్యార్థి విద్యార్ధిని లు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ నాయకులు భవాని,స్వాతి,మౌనిక, రాజేశ్వరి, మాధవి, స్వప్న, కళావతి, రేణుక,పల్లవి,సుజాత తదితర విద్యార్థినీలు పాల్గొన్నారు.
Oct 19 2024, 15:25