NLG: అద్దెభవనాల్లో నడుస్తున్న గురుకులాల కు తక్షణమే అద్దె చెల్లింపులు చేయాలి: ఎస్ఎఫ్ఐ
నల్లగొండ జిల్లా:
దేవరకొండ: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇవాళ ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ మేరకు దేవరకొండ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రామావత్ లక్ష్మణ్ నాయక్,బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రారంభమవుతున్న విద్యాసంస్థలలో అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలును యాజమానులు తాళ్లం తీయడం లేదు. గత 12 నెలలు నుండి తమకు అద్దె చెల్లించడం లేదని అద్దె చెల్లించకపోవడంతో తాము చేసేది ఎమిలేక మూసివేస్తున్నామని ప్రకటిస్తున్నారు. విద్యాసంస్థకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్స్ అంతా బయటే ఉన్నారని అధికారులు మాట్లడుతున్నా.. తాళ్లలు తీయడం లేదని ,తక్షణమే ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కోరుతుందని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు యాజమాన్యాలు తాళాలు వేశారు. సుమారు 9 నెలలుగా ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ భవనాల యజమానులు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టళ్లకు తాళాలు వేశారు. దీంతో దసరా సెలవుల అనంతరం పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు బయటే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుంగతుర్తి, బెల్లంపల్లి, తాండూరు, వరంగల్, భూపాలపల్లి, హుజూర్‌నగర్, తొర్రూర్, భువనగిరిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లకు భవన యజమానులు తాళాలు వేశారు.
ఒకప్రక్క ఇంటిగ్రేడెడ్ గురుకులాలు అంటూనే.. ఉన్న గురుకులాలు సమస్యలు పరిష్కారం చేయడం లేదని ఆరోపించారు. అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో తాళాలు వేయడం తో మరింత సమస్యలు తీవ్రతరం అవుతాయని తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ కోరుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఎస్.ఎఫ్.ఐ డివిజన్ నాయకులు నేర్లపల్లి జై చరణ్ ,జల్లెల ఇద్ధి రాములు, పోట్ల రాకేష్,మంజుల, నేనావత్ సరస్వతి, రాధిక తదితరులు పాల్గొన్నారు.
Oct 18 2024, 22:04