/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz వేములకొండ లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు Vijay.S
వేములకొండ లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో అంబేద్కర్ చౌక్ వద్ద వేములకొండ గ్రామ రైతులు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 రోజుల నుండి తమ సొంత నిధులతో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి  వేములకొండ పెద్ద కాలువను పూడికతీత మరియు గుర్రపు డెక్క ఆకు తొలగించి పెద్ద చెరువులోకి నీరు రావడానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు  తెలుపుతూ పాలాభిషేకం చేశామని రైతులు  అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సామ రామిరెడ్డి ,పులిపలుపుల రాములు ,ఎస్కే రసూల్, ఏర్పుల వెంకటేష్, కేశిరెడ్డి నీరజ, బుంగ మనెమ్మ ,ఆకుల లలిత, బత్తుల సువర్ణ ,ఎనుగుల నరసింహ, వింజమూరు శ్రీను ,వింజమూరి శివయ్య, చెక్క సత్తయ్య, బుంగ రాములు, రైతులు ,తదితరులు పాల్గొన్నారు.

రైతులను ఆదుకోవడంలో దేశానికి ఆదర్శం రేవంత్ రెడ్డి ప్రభుత్వం: కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు గాదె శోభారాణి

రైతులకు అండగా నిలబడే బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం,ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ రామన్నపేట మండల మహిళా అధ్యక్షురాలు గాదె శోభరాణి రాష్ట్ర రైతాంగం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఆమె మాట్లాడుతూ ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రూ.72 వేల 659 కోట్లు కేటాయించారు.తెలంగాణ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో దేశానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు.గతంలో కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో బి.ఆర్. ఎస్. ప్రభుత్వాలు పదేళ్ళు గా రైతులను ఏ విదంగా మోసం చేసాయో తెలిసిందేనన్నారు.రైతు వ్యతిరేక నల్ల చట్టాలు,గిట్టుబాటు ధర కల్పించకుండా డిల్లీ రైతు పోరాటం లో 700 మంది రైతాంగం ను చవడానికి కారణం అయినా బిజెపి కి మా ప్రభుత్వం పై విమర్శలు చేసే నైతికత లేదన్నారు.పదేళ్లు ప్రభుత్వం నడిపిన కేసీఆర్ ధరణి వంటి వాటితో రైతాంగం హక్కులను కాలరాసిన చరిత్ర బి.ఆర్.ఎస్ ప్రభుత్వంది అన్నారు.లక్ష రుణమాఫీ మాటలకే పరిమితము అయినా కెసిఆర్,కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కడం వారికే చెల్లిందన్నారు.ఈ బడ్జెట్ లో ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఇందిరమ్మ రాజ్యంలోనే రైతుకు భరోసా అని మరోసారి నిరూపితమైందన్నారు.అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ. 72,659 కోట్లు కేటాయించడం పాటు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీని చేస్తున్నామని అన్నారు.ఇప్పటికే రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసిన విషయం కనుల ముందు ఉందన్నారు.పంద్రాగస్టు లోపు రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాది చేతల ప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపించారని అన్నారు.అలాగే రైతులకు రైతు భరోసా,ఇంకా రైతు బీమ, పంట నష్ట పరిహారం కూడా ఉంటుంది. అందుకే వ్యవసాయానికి భారీగా నిధులు కేటాయించి చిత్తశుద్ధి ని నిలుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని ,మంత్రి వర్గంను, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారిని, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని, తెలంగాణ ప్రజలు,రైతాంగం ఆశీర్వదించాలన్నారు.
విద్యారంగం పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: AISF

విభజన హామీ ప్రకారం తెలంగాణకి కేటాయించాల్సిన విద్యాసంస్థలను కేటాయించకుండా అలసత్వం ప్రదర్శిస్తుందని ఈ ప్రభుత్వం ముమ్మాటికి విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమేనని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ. నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు బీజేపీ ప్రభుత్వం విద్య కాషాయీకరణ చేసే విధంగా కుట్ర చేస్తుందని, నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్య కార్పోరేటీకరణ, కాషాయీకరణ చేసే విధంగా అడుగులు వేయడం శోచనీయం. తెలంగాణ రాష్ట్ర విభజన హామీల్లో ఉన్న విద్యాసంస్థలను తెలంగాణకి కేటాయించకుండా మోడీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తుందన్నారు బడ్జెట్ ప్రవేశ లో యూనివర్సిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించక పోవడం ఎంత వరకు సమంజసం అని,తెలంగాణకు సంబంధించి విభజన హామీలో ఉన్న ట్రిపుల్ ఐటీ, జిల్లాకొక కేంద్రీయ విశ్వవిద్యాలయం, జిల్లాకొక నవోదయ పాఠశాల, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయకుండా బడ్జెట్ పెట్టడం తెలంగాణ విద్యారంగంపై బీజేపీ ప్రభుత్వం తన కుట్రను వెల్లడించింది. విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని, దేశంలో ఉన్న యూనివర్సిటీలను అభివృద్ధి చేయకుండా,దేశంలోకి విదేశీ యూనివర్సిటీలను ఆహ్వానిస్తూ, ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. విద్యారంగంలో సంస్కరణల పేరుతో శాస్త్రీయ విద్యావిధానాన్ని పాతరేసి పాఠ్యాంశాల్లో మతపరమైన అంశాలను చేరుస్తూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫెల్లోషిప్స్ , మౌలానా ఆజాద్ ఉపకార వేతనాలు, ఇవ్వకుండా ,కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు ఢిల్లీలో పార్లమెంటులో తెలంగాణ విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయాలని, గుజరాత్ గులాంలకు బానిసలుగా ఉండి, తెలంగాణకి ద్రోహులుగా బీజేపీ ఎంపీలు ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం విద్యలో 10 శాతం నిధులు కేటాయించాల్సిన కేవలం 2.46% నిధులు మాత్రమే కేటాయిస్తూ విద్యారంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఈ బడ్జెట్లో విద్యకు సంబంధించినటువంటి వాటిపై జీఎస్టీ ఎత్తివేయకుండా అదనపు భారం మోపడం దుర్మార్గం. ఇక రాష్ట్రంలో చూసుకుంటే అనేక గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేవని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్స్ లేక విద్యార్థులు నానావస్థలు పడుతున్నారని గత ఎన్నికల ప్రచారంలో విద్యా రంగానికి 15% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

దళితులు సేద్యం చేసుకుంటున్నా ప్రభుత్వ భూమికి పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలి: కొండమడుగు నరసింహ డిమాండ్

గత 60, 65 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నా హన్మాపురం గ్రామ దళితులందరికీ వెంటనే పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం గ్రామంలోని దళితులు సాగు చేసుకుంటున్న సర్వే నెంబరు 87 లోని 15 ఎకరాల 12 గుంటల భూమిని సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నర్సింహ్మ, రైతులతో కలిసి పరిశీలన చేసినా అనంతరం నిర్వహించిన సదస్సులో నర్సింహ్మ పాల్గొని మాట్లాడుతూ హన్మాపురం గ్రామంలోని సర్వేనెంబర్ 87 లోని 15 ఎకరాల 12 గంటల భూమిని 14 ఎస్సీ కుటుంబాలకు చెందిన 29 మంది సేద్యం చేసుకుంటున్నారని వారందరికీ ప్రభుత్వము వెంటనే నూతన పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేసినారు. ఆనాడు ఎన్నో కష్టనష్టాలకు ఓడ్చి పైసా పైసా కూడా పెట్టి భావి తొవ్వి , కరెంటు సాంక్షన్ ను తెచ్చుకొని మోటార్ తో నీటిని తోడి ఆ నీళ్లతో వ్యవసాయ పంటను పండించి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. కానీ ఆ భూములకు పట్టాదారు పాసుబుక్కులు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ది పొందలేదని, బ్యాంకుల నుండి కూడా ఎలాంటి సహాయము తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని వారు ఆవేదన వెలిబుచ్చారు. సేద్యం చేసుకుంటున్నా భూమికి పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలని పలుమార్లు జిల్లా కలెక్టర్, ఆర్డిఓకు, స్థానిక తహసిల్దారుకు, ప్రజా ప్రతినిధులకు మెమోరండం ఇచ్చి మొరపెట్టుకున్నా ఇప్పటివరకు నూతన పాస్ బుక్స్ లు ఇవ్వలేదని అన్నారు. ఈ మధ్యకాలంలో ఆ భూమిని భూమి కాజేయడానికి, ఆక్రమించడానికి పక్కనున్న కొంతమంది భూసాములు ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వము తక్షణం స్పందించి భూమిని సర్వే చేసి హద్దురాళ్ళు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను కోరారు. సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నర్సింహ మాట్లాడుతు రెక్కాడితే గాని డొక్కానిండని దళితులు భూమిని సాగు చేసుకుని బతుకుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగుదారులైన దళితులందరికీ పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని లేనిచో పోరాటాన్ని కొనసాగిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం నూతన పాసుబుక్కుల సాధన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా బిచ్చాల మహేందర్, ప్రధాన కార్యదర్శిగా మూడుగుల రాజు, గౌరవ అధ్యక్షులుగా మూడుగుల అంజయ్య, ఉపాధ్యక్షులుగా బండారి రామచందర్, సహాయ కార్యదర్శిగా చందుపట్ల మల్లయ్య, కార్యవర్గ సభ్యులుగా బిచ్చాల మైసయ్య, మూడ్గుల వెంకటయ్య, మూడ్గుల బాల్ నరసింహ, బండారి జీవన్ రావ్, బిచ్చాల పరుశరాములు, పొట్ట జగన్ ఎన్నుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముడుగుల బాలరాజు, బాల్ నరసింహ, మైసయ్య, కొండలు ప్రభాకర్, ఉప్పలయ్య, మహేష్, వెంకన్న, బిక్షపతి, రమేష్, నరసయ్య, మైసయ్య, కొండలు, రాజు, ఉప్పలయ్య, సుధాకర్, నరసింహ, పెంటయ్య, బిక్షపతి, లక్ష్మి, పరమేష్, కొండల్ ,సీతారాములు, మైసయ్య, జయమ్మ, లింగయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు

సామాజిక కార్యకర్త, హక్కుల నాయకుడు, సీనియర్ జర్నలిస్టు, మూడ నమ్మకాల నిర్మూలనకు, కరెన్సీ నోట్ల పై అంబేద్కర్ ఫోటో సాధన కోసం కృషి చేస్తున్న కొడారి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘణంగా నిర్వహించారు. మొదట భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కు పూలమాలలు వేసి నివాళులర్పించారు‌. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ధరణికోట నర్సింహ, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్, జిల్లా ఎస్సీ/ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్, టీ పి సి సి మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నింటి స్టాన్లీ లు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న కొడారి వెంకటేష్,భవిష్యత్తులో మరిన్ని సామాజిక ఉద్యమాలు నిర్వహించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందే విధంగా కృషి చేయాలని కోరుతూ ఆశీర్వదించారు. పుట్టినరోజు కార్యక్రమంలో వికలాంగుల హక్కుల మహిళా అధ్యక్షురాలు కొత్త లలిత, జిల్లా నాయకులు జాగిల్లపురం అయిలయ్య, సింగారం రమేష్, కాటపల్లి రజిత, ఇంజ పద్మ , మచ్చ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.


ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి:AISF

అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా AISF జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. మహిళల విద్యార్థులకు బాత్ రూమ్ శుభ్రంగా లేకపోవడం మూలంగా ఇబ్బందులు పడుతున్నారు. .లైబ్రరీ సౌకర్యాలు లేకపోవడం మూలంగా విద్యార్థుల అధ్యయనంతో పాటు వారి భవిష్యత్ పైన కూడా ప్రభావం పడుతుందని అన్నారు. పాఠశాలలో పారిశుద్ధ కార్మికులు లేకపోవడం మూలంగా పాఠశాల ఆవరణమంతా శుభ్రంగా లేకపోవడం మరియు మంచినీటి సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో వైరల్ ఫీవర్ తో పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.. చాలా పాఠశాలలో పురాతన భవనాలు కుంగి పోవడంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పాఠశాలలు మార్చడం జరుగుతుంది దీని మూలంగా అనేకమంది విద్యార్థులు చదువుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు కావున తక్షణమే సొంత భవనాలను నిర్మించాలి అదే విధంగా అనేక పాఠశాలలో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ కొరత ఉంది. కావున తక్షణమే అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలని కోరడం జరిగింది లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ గా ఈ సమస్యలన్నీ తీరేవరకు విద్యార్థులకు సరైన విద్య నాణ్యతతో కూడిన సదుపాయాలు కల్పించేంత వరకు పోరాటం కొనసాగుతుందని వారు అన్నారు. అనంతరం ఎస్సీ బాలికల వసతి గృహం, బీసీ కళాశాల బాలుర వసతి గృహం లను సందర్శించి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో విద్యార్థులకు ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా శానిటేషన్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న సంక్షేమ హాస్టల్లో మిస్ చార్జీలను విడుదల చేయాలని మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు కంబాల నరసింహ శివ తదితరులు పాల్గొన్నారు.

APF ఫౌండేషన్ చైర్మన్ దుబ్బాక ఆకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా KTR జన్మదిన వేడుకలు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ KTR గారి జన్మదిన వేడుకలు BRS పార్టీ మున్సిపల్ నాయకులు, APF ఫౌండేషన్ చైర్మన్ శ్రీ దుబ్బాక ఆకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.... మున్సిపల్ నాయకులు, APF ఫౌండేషన్ చైర్మన్ శ్రీ దుబ్బాక ఆకాష్ రెడ్డి  ప్రకృతి పరిరక్షణ సంకల్పంతో మొక్కలు నాటారు...అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపటి తెలంగాణ భవిష్యత్తు KTR  సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఈ సేవ కార్యక్రమాలు నిర్వహించామని, ఈ సందర్భంగా ఆకాష్ రెడ్డి పేర్కొన్నారు.... ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ గంజి విజయ్ కుమార్, యూత్ నాయకులు ,రాజు,ఈశ్వర్, వినోద్, నరేష్,సాయి కృష్ణ శివ,మధు,రాజేష్,సాయి,SK అత్తూ,విష్ణు , యువజన నాయకులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
తండాలు గ్రామపంచాయతీలుగా ఉన్నతీకరణ చేయాలి : ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

అసెంబ్లీ సమావేశాల్లో  ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని బుధవారం  కోరారు. గత ప్రభుత్వం లో తెలంగాణ రాష్ట్రం లో 5848 తాండల్లో సుమారు 1271తాండలను మాత్రమే గ్రామపంచాయతీలు గా చేసారని కానీ అభివృద్ధి చేయలేదన్నారు. గతంలో ఏర్పాటు చేసిన తండా గ్రామపంచాయతీ లకు పక్క భవనం నిర్మించక పోవడం వల్ల చెట్ల కింద పరిపాలన చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు.గత ప్రభుత్వం లో సర్పంచుల కు నిధులు ఇవ్వకపోవడం తో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో మిగిలిన తండాలను గ్రామపంచాయతీలుగా చేసి తండాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు.
జిల్లా గ్రంధాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ రియాజ్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం లోని జిల్లా గ్రంధాలయాన్ని రాష్ట్ర గ్రంధాలయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ రియాజ్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు అక్కడ ఉన్న నిరుద్యోగులతో మాట్లాడి అక్కడ ఉన్న సౌకర్యాలను తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా వారికి కావలసిన వసతులు, పుస్తకాలు సరిగా ఉన్నాయా మరియు వారికి కావలసిన స్టడీ మెటీరియల్ గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయడం వలన మేము సంతోషంగా ఉన్నామని చదువుకోవడానికి సమయం లభించిందని నిరుద్యోగ యువత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా డాక్టర్ రియాజ్ గారు గ్రూప్స్ కొరకు సిద్ధం అయ్యే వారికి ఇచ్చే ఆన్లైన్ తరగతులు మేము కూడా వింటామని యువత తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రంధాలయాలను మరింత అభివృద్ధి చేస్తామని డాక్టర్ రియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రంధాలయ సెక్రటరీ సుధీర్, గ్రంధాలయ సిబ్బంది,నాయకులు అతహర్, అవేస్ చిష్టి, సలాఉద్దీన్, మాజహార్, రఫీద్దీన్ గౌరి తదితరులు పాల్గొన్నారు.

నందనం - సిరివేణి కుంట గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి : దయ్యాల నరసింహ సిపిఎం మండల కార్యదర్శి

నందనం గ్రామం నుండి సిరివేణికుంటకు వెళ్లి దారిలో అసంపూర్తిగా ఉన్నటువంటి బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలని అలాగే చెరువు కింద ఉన్నటువంటి రైతులకు ఉపయోగపడే దారిలో పెరిగిన కంపచెట్లను తొలగించి దారిని ఏర్పాటు చేయాలని డయాల నరసింహ డిమాండ్ చేశారు అదేవిధంగా గ్రామంలో చాలామంది నిరుపేదలకు ఇండ్లు లేక ఉన్నారని ప్రభుత్వము ఇల్లు లేని పేదలందరికీ ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అర్హత కలిగిన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇంకా అర్హత ఉండి పెన్షన్స్ రాని వారందరికీ అన్ని రకాల పెన్షన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామంలో దోమలు నివారణకు ఫాగింగ్ చేపట్టాలని మరియు ప్రధానంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించి గ్రామ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో మండల కమిటీ సభ్యులు కొండాపురం యాదగిరి, అబ్దుల్లాపురం వెంకటేష్ కొల్లూరి సిద్దిరాజు, లక్ష్మారెడ్డి, సురుపంగ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.