దళితులు సేద్యం చేసుకుంటున్నా ప్రభుత్వ భూమికి పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలి: కొండమడుగు నరసింహ డిమాండ్
![]()
గత 60, 65 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నా హన్మాపురం గ్రామ దళితులందరికీ వెంటనే పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం గ్రామంలోని దళితులు సాగు చేసుకుంటున్న సర్వే నెంబరు 87 లోని 15 ఎకరాల 12 గుంటల భూమిని సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నర్సింహ్మ, రైతులతో కలిసి పరిశీలన చేసినా అనంతరం నిర్వహించిన సదస్సులో నర్సింహ్మ పాల్గొని మాట్లాడుతూ హన్మాపురం గ్రామంలోని సర్వేనెంబర్ 87 లోని 15 ఎకరాల 12 గంటల భూమిని 14 ఎస్సీ కుటుంబాలకు చెందిన 29 మంది సేద్యం చేసుకుంటున్నారని వారందరికీ ప్రభుత్వము వెంటనే నూతన పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేసినారు. ఆనాడు ఎన్నో కష్టనష్టాలకు ఓడ్చి పైసా పైసా కూడా పెట్టి భావి తొవ్వి , కరెంటు సాంక్షన్ ను తెచ్చుకొని మోటార్ తో నీటిని తోడి ఆ నీళ్లతో వ్యవసాయ పంటను పండించి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. కానీ ఆ భూములకు పట్టాదారు పాసుబుక్కులు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ది పొందలేదని, బ్యాంకుల నుండి కూడా ఎలాంటి సహాయము తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని వారు ఆవేదన వెలిబుచ్చారు. సేద్యం చేసుకుంటున్నా భూమికి పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలని పలుమార్లు జిల్లా కలెక్టర్, ఆర్డిఓకు, స్థానిక తహసిల్దారుకు, ప్రజా ప్రతినిధులకు మెమోరండం ఇచ్చి మొరపెట్టుకున్నా ఇప్పటివరకు నూతన పాస్ బుక్స్ లు ఇవ్వలేదని అన్నారు. ఈ మధ్యకాలంలో ఆ భూమిని భూమి కాజేయడానికి, ఆక్రమించడానికి పక్కనున్న కొంతమంది భూసాములు ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వము తక్షణం స్పందించి భూమిని సర్వే చేసి హద్దురాళ్ళు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను కోరారు. సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నర్సింహ మాట్లాడుతు రెక్కాడితే గాని డొక్కానిండని దళితులు భూమిని సాగు చేసుకుని బతుకుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగుదారులైన దళితులందరికీ పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని లేనిచో పోరాటాన్ని కొనసాగిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం నూతన పాసుబుక్కుల సాధన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా బిచ్చాల మహేందర్, ప్రధాన కార్యదర్శిగా మూడుగుల రాజు, గౌరవ అధ్యక్షులుగా మూడుగుల అంజయ్య, ఉపాధ్యక్షులుగా బండారి రామచందర్, సహాయ కార్యదర్శిగా చందుపట్ల మల్లయ్య, కార్యవర్గ సభ్యులుగా బిచ్చాల మైసయ్య, మూడ్గుల వెంకటయ్య, మూడ్గుల బాల్ నరసింహ, బండారి జీవన్ రావ్, బిచ్చాల పరుశరాములు, పొట్ట జగన్ ఎన్నుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముడుగుల బాలరాజు, బాల్ నరసింహ, మైసయ్య, కొండలు ప్రభాకర్, ఉప్పలయ్య, మహేష్, వెంకన్న, బిక్షపతి, రమేష్, నరసయ్య, మైసయ్య, కొండలు, రాజు, ఉప్పలయ్య, సుధాకర్, నరసింహ, పెంటయ్య, బిక్షపతి, లక్ష్మి, పరమేష్, కొండల్ ,సీతారాములు, మైసయ్య, జయమ్మ, లింగయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
![]()


యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ KTR గారి జన్మదిన వేడుకలు BRS పార్టీ మున్సిపల్ నాయకులు, APF ఫౌండేషన్ చైర్మన్ శ్రీ దుబ్బాక ఆకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.... మున్సిపల్ నాయకులు, APF ఫౌండేషన్ చైర్మన్ శ్రీ దుబ్బాక ఆకాష్ రెడ్డి ప్రకృతి పరిరక్షణ సంకల్పంతో మొక్కలు నాటారు...అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపటి తెలంగాణ భవిష్యత్తు KTR సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఈ సేవ కార్యక్రమాలు నిర్వహించామని, ఈ సందర్భంగా ఆకాష్ రెడ్డి పేర్కొన్నారు.... ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ గంజి విజయ్ కుమార్, యూత్ నాయకులు ,రాజు,ఈశ్వర్, వినోద్, నరేష్,సాయి కృష్ణ శివ,మధు,రాజేష్,సాయి,SK అత్తూ,విష్ణు , యువజన నాయకులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
చేవెళ్ల దళిత డిక్లరేషన్ పై బడ్జెట్ సమావేశాల్లో స్పష్టత ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి సమగ్రంగా అమలు చేయాలని ప్రజా పర్యవేక్షణ కమిటీ, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన చేవెళ్ల దళిత డిక్లరేషన్ ప్రకారం ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లను పెంచాలని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేస్తామని అలాగే ఇందిరమ్మ గృహ నిర్మాణానికి అంబేద్కర్ అభయ హస్తం పేరుతో 6లక్షల రూపాయలు విడుదల చేయాలని, అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పించాలని, అన్ని కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రభుత్వ రాయితీలు పొందుతున్న ప్రయివేటు కంపెనీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.రానున్న బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చించి దళిత, గిరిజనుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు బట్టు రామచంద్రయ్య, ప్రజా పర్యవేక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సురుపంగ శివలింగం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కృష్ణ, విజిలెన్స్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్, జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ, ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుతాడి సురేష్, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, దళిత సంఘాల నాయకులు అందే సాయి, వద్ధిగల దాసు , కొండలరెడ్డి తదితరులు పాల్గోన్నారు.
Jul 25 2024, 17:02
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.7k