/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz జిల్లా గ్రంధాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ రియాజ్ Vijay.S
జిల్లా గ్రంధాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ రియాజ్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం లోని జిల్లా గ్రంధాలయాన్ని రాష్ట్ర గ్రంధాలయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ రియాజ్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు అక్కడ ఉన్న నిరుద్యోగులతో మాట్లాడి అక్కడ ఉన్న సౌకర్యాలను తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా వారికి కావలసిన వసతులు, పుస్తకాలు సరిగా ఉన్నాయా మరియు వారికి కావలసిన స్టడీ మెటీరియల్ గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయడం వలన మేము సంతోషంగా ఉన్నామని చదువుకోవడానికి సమయం లభించిందని నిరుద్యోగ యువత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా డాక్టర్ రియాజ్ గారు గ్రూప్స్ కొరకు సిద్ధం అయ్యే వారికి ఇచ్చే ఆన్లైన్ తరగతులు మేము కూడా వింటామని యువత తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రంధాలయాలను మరింత అభివృద్ధి చేస్తామని డాక్టర్ రియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రంధాలయ సెక్రటరీ సుధీర్, గ్రంధాలయ సిబ్బంది,నాయకులు అతహర్, అవేస్ చిష్టి, సలాఉద్దీన్, మాజహార్, రఫీద్దీన్ గౌరి తదితరులు పాల్గొన్నారు.

నందనం - సిరివేణి కుంట గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి : దయ్యాల నరసింహ సిపిఎం మండల కార్యదర్శి

నందనం గ్రామం నుండి సిరివేణికుంటకు వెళ్లి దారిలో అసంపూర్తిగా ఉన్నటువంటి బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలని అలాగే చెరువు కింద ఉన్నటువంటి రైతులకు ఉపయోగపడే దారిలో పెరిగిన కంపచెట్లను తొలగించి దారిని ఏర్పాటు చేయాలని డయాల నరసింహ డిమాండ్ చేశారు అదేవిధంగా గ్రామంలో చాలామంది నిరుపేదలకు ఇండ్లు లేక ఉన్నారని ప్రభుత్వము ఇల్లు లేని పేదలందరికీ ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అర్హత కలిగిన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇంకా అర్హత ఉండి పెన్షన్స్ రాని వారందరికీ అన్ని రకాల పెన్షన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామంలో దోమలు నివారణకు ఫాగింగ్ చేపట్టాలని మరియు ప్రధానంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించి గ్రామ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో మండల కమిటీ సభ్యులు కొండాపురం యాదగిరి, అబ్దుల్లాపురం వెంకటేష్ కొల్లూరి సిద్దిరాజు, లక్ష్మారెడ్డి, సురుపంగ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫిట్నెస్ లేని బస్సులు నడిపిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి:AISF

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫిట్నెస్ లేని బస్సులు నడిపిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి *ఏఐఎస్ఎఫ్* జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కిస్తూ ఫిట్నెస్ లేకుండా బస్సులను నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్టీవో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మరియు జిల్లా వ్యాప్తంగా మోత్కూర్ చౌటుప్పల్ వలిగొండ తుర్కపల్లి లోఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల పై చర్యలు తీసుకోవాలని అన్నారు విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటినుండి అనేక ప్రైవేట్ పాఠశాలల బస్సులు ప్రమాదాలకు గురై విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని ఆ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఉన్నత పాఠశాల బాలికలఆశ్రమంలో మరియు ప్రభుత్వ గిరిజన సంక్షేమ కళాశాల బాయ్స్ హాస్టల్లో సర్వే నిర్వహించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు కళ్యాణ్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల దళిత డిక్లరేషన్ పై బడ్జెట్ సమావేశాల్లో స్పష్టత ఇవ్వండి, ఎస్సీ ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి సమగ్రంగా అమలు చేయాలి

చేవెళ్ల దళిత డిక్లరేషన్ పై బడ్జెట్ సమావేశాల్లో స్పష్టత ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి సమగ్రంగా అమలు చేయాలని ప్రజా పర్యవేక్షణ కమిటీ, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన చేవెళ్ల దళిత డిక్లరేషన్ ప్రకారం ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లను పెంచాలని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేస్తామని అలాగే ఇందిరమ్మ గృహ నిర్మాణానికి అంబేద్కర్ అభయ హస్తం పేరుతో 6లక్షల రూపాయలు విడుదల చేయాలని, అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పించాలని, అన్ని కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రభుత్వ రాయితీలు పొందుతున్న ప్రయివేటు కంపెనీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.రానున్న బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చించి దళిత, గిరిజనుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు బట్టు రామచంద్రయ్య, ప్రజా పర్యవేక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సురుపంగ శివలింగం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కృష్ణ, విజిలెన్స్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్, జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ, ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుతాడి సురేష్, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, దళిత సంఘాల నాయకులు అందే సాయి, వద్ధిగల దాసు , కొండలరెడ్డి తదితరులు పాల్గోన్నారు.

స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాలి: ప్రియదర్శిని మేడి బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

బాధ్యతాయుతమైన ఐ. ఏ. ఎస్. అధికారి స్మిత సబర్వాల్, వికలాంగుల పట్ల చేసిన అనుచిత వాఖ్యలు, వెంటనే వెనక్కి తీసుకొని, వికలాంగులకు క్షమాపణ చెప్పాలని ప్రియదర్శిని మేడి బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకి తూట్లు పొడిచే విధంగా ఉన్నాయి అవకాశాలు కల్పిస్తే ఎవరైనా ఏదైనా సాధించగలం రాజ్యాంగం కల్పిస్తుంది. ఆమె మాట్లాడుతూ ఎందరో వికలాంగులు విభిన్న ప్రతిభను కనబర్చి, చరిత్ర పుటల్లోకి ఎక్కిన సంఘటనలు స్మిత సబర్వాల్ మరవరాదని ఆమె అన్నారు.‌ మీరన్నట్టు బ్యూరోక్రాట్లు అంతే సమర్థవంతంగా లొంగకుండా పనిచేస్తూ ఉంటే ఇప్పటికే మన దేశ కరెన్సీ డాలర్ తో సమానం అయి ఉండేది. ఇంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత సంకుచితంగా శోచనీయం.వికలాంగుల సమాజానికి స్మిత సబర్వాల్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని లేనిచో బి ఎస్ పి పార్టీ ఆద్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు.
ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజల కష్టాలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణం స్పందించాలి : సిపిఎం

గ్రామపంచాయతీలలో కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనలలో సమస్యలు పెద్ద ఎత్తున పేర్కపోయి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి తగిన నిధులు కేటాయించి గ్రామాల్లో ఉన్న మౌలిక సమస్యలను పరిష్కారం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. సోమవారం భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం పెంచికల్ పహాడ్, బస్వాపురం గ్రామాలలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం ఆయా గ్రామాలలోని పంచాయతీ కార్యదర్శులకు, ప్రత్యేక అధికారులకు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ్మలు పాల్గొని మాట్లాడుతూ గత ఫిబ్రవరి నుండి సర్పంచ్ పాలన ముగిసి ప్రత్యేక అధికారుల పాలన వచ్చిన తర్వాత గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎవరిని అడగాలను అర్థం కాని పరిస్థితులలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామాలలో రోజురోజుకు మురికి కాలువలు, వీధిలైట్లు, మంచినీళ్ల సమస్యలు పెరుగుతున్నాయని వాటిని తక్షణం పరిష్కారం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. పెంచికల్ పహాడ్ గ్రామంలో మంచినీళ్ల ఫిల్టర్ రిపేరుకు వచ్చి వారం కావస్తున్నా నేటికీ దానిని బాగు చేయించే పరిస్థితి లేదని దాంతో మంచినీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. హనుమాపురం గ్రామంలో లింక్ రోడ్ల సమస్య చాలా పెద్ద ఎత్తున ఉన్నదని అనంతరం, తాజ్ పూర్, కుర్మగూడెం, అనంతరం బస్వాపురం వరకు లింకు రోడ్ల సమస్యలను పరిష్కారం చేయాలి, అక్కడక్కడ దెబ్బతిన్న బీటీ రోడ్లను తక్షణం బాగు చేయాలని అన్నారు. బస్వాపురం నుండి యాదగిరిగుట్ట వరకు లింకు రోడ్డు కూడా తక్షణమే ఏర్పాటు చేయాలని, బస్వాపురం ఉసిల్లవాగుపై బ్రిడ్జిని తక్షణమే నిర్మాణం చేయాలని, భువనగిరి నుండి కృష్ణాపురం పెంచికల్పాడు మీదుగా వెళ్లే ప్రయాణికులకు భువనగిరి ప్రభుత్వ ఐటిఐ దగ్గర అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని కోరినారు. ప్రభుత్వము ఎన్నికల ముందు ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తానన్న హామీని వెంటనే అమలు చేయాలని, అర్హత కలిగి రేషన్ కార్డు లేని పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని, అన్ని రకాల పెన్షన్స్ కూడా తక్షణం ఇవ్వాలని వారు ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వము అన్ని గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం ప్రజలందరినీ సమీకరించి సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం తగిన నిధులు విడుదల చేయాలని కోరినారు. గ్రామాలలో రోజురోజుకు కోతుల, కుక్కల బెడద పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాటి నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షకాలంతో దోమల బెడద పెరిగి ప్రజలు వివిధ రోగాల బారిన పడుతున్నారని గ్రామాలలో తరచుగా గడ్డి మందు, దోమల నివారణ మందు పిచికారి చేయాలని ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పై సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందించకపోతే మండల స్థాయిలో ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ, మండల కమిటీ సభ్యులు సిలివేరి ఎల్లయ్య, రాసాల వెంకటేష్, హనుమాపురం సిపిఎం శాఖ కార్యదర్శి మోటె ఎల్లయ్య, బసవపురం శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య, పెంచికల్ పహాడ్ శాఖ కార్యదర్శి సుబ్బురు పోచయ్య, నాయకులు ప్రజలు బండి శ్రీను, తెల్జీరి మాణిక్యం, కుసుమ మధు, బాల్ద మల్లయ్య, ఉడుత విష్ణు, మచ్చ భాస్కర్, సిల్వేరు జెమ్మయ్య, చిన్నం బాలరాజు, గోపి స్వామి, సిలువేరు జమదగ్ని, చిన్నం సబితా, గోపె సంధ్య, చాట్ల భారతమ్మ, సిలువేరు సత్యలక్ష్మి, నల్ల నవీన్, చిందం నరసింహ, నరాల కృష్ణ, రాసాల గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి: ఆత్మీయ మిత్రుడు సంజీవరెడ్డికి బదిలీ వీడ్కోలు

యాదాద్రి భువనగిరి జిల్లా పౌరసంబంధాల శాఖ లో సుధీర్ఘ కాలం పబ్లిసిటీ అసిస్టెంట్ గా సేవలందించిన తీపి రెడ్డి సంజీవరెడ్డి, ప్రభుత్వ బదిలీల్లో భాగంగా సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా నుండి జనగాం జిల్లా కు బదిలీ పై వెళ్లారు. యాదాద్రి భువనగిరి జిల్లా లో సుమారు 16 సంవత్సరాలుగా జిల్లా అధికారులతో, పాత్రికేయులతో సత్సంబంధాలు కలిగిఉన్న సంజీవరెడ్డి, తెలంగాణ ఉద్యమం కాలంలో చాలా చురుకైన పాత్ర పోషించారు. సకలజనుల సమ్మె కాలంలో పూర్తి కాలం ఉద్యమానికే అంకితమయ్యారు. అందరితో సంజన్న అని పిలిపించుకునే సంజీవరెడ్డి బదిలీ కొంత భాధకరమే అయినా ఉద్యోగులకు బదిలీలు తప్పవని ఆయన అన్నారు. ఈ సందర్బంగా జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పి. వెంకటేశ్వర్లు, కే. శోభన్ బాబు, చారి, సుమన్, సీనియర్ పాత్రికేయులు కొడారి వెంకటేష్ తదితరులు సంజీవరెడ్డి ని శాలువాతో సన్మానించి, బదిలీ వీడ్కోలు పలికారు.
వలిగొండ పట్టణంలో విజిబుల్ పోలీసింగ్ పేరుతో సైబర్ నేరాల పై అవగాహన కల్పించిన పోలీసులు

వలిగొండ పట్టణం లో విజిబుల్ పోలింగ్ పేరుతో సైకిల్ పెట్రోలింగ్ నిర్వహించిన పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణంలో రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు వలిగొండ పోలీసులు  విజిబుల్ పోలీసింగ్ పేరుతో సోమవారం   సైకిల్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో చోరీలు ,మహిళలపై వేధింపులు, సైబర్ నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆంటీ డ్రగ్స్, సైబర్ నెరాల పై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులతో మాట్లాడొద్దని చైన్ స్నాచింగ్ గురించి వివరించారు .అత్యవసర పరిస్థితులలో 100 కి డయల్ చేయాలని సూచించారు. తెలియని మెసేజ్ లపై లింకులపై క్లిక్ చేయవద్దని అన్నారు.
జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించుకుంటే ఈనెల 29 నుండి సమ్మె తప్పదు: AITUC రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్

భువనగిరి జిల్లా హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్ మరియు సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం రూ.15,600 వేతనం మరియు పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతం వెంటనే చెల్లించాలని తేది 29.7.2024 సోమవారం నుండి పనులు నిలుపుదల చేసి నిరవధిక సమ్మె చేయనున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ తెలిపారు. సోమవారం రోజున తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో జిఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని మరియు పెండింగ్ లో ఉన్న 3నెలల వేతనం చెల్లించాలని కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ గారికి మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ చిన్న నాయక్ గారికి తేది 29.7.2024 నుండి చేస్తున్న నిరవధిక సమ్మె నోటీస్ ను సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 2022 జూన్ నెల నుండి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం పెంచిన కొత్త వేతనాలను ఆసుపత్రి కార్మికులు అందుకుంటున్నారని కానీ భువనగిరి జిల్లా ఆసుపత్రిలో మాత్రం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం నిర్వాహణలో ఉన్న టీ. వి టీ ఏజెన్సీ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా ప్రభుత్వ నిబంధనలను తుంగల తొక్కి కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలలో పారదర్శకత లేకుండా కేవలం 10,000 మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుంటున్నాడని ఆయన అన్నారు. పి ఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా అమలు చేసి ఇవ్వని వారికి వెంటనే ఇవ్వాలని, 8 గంటల పనిన విధానాన్ని అమలు చేసి 3 షిఫ్ట్ లు వెంటనే అమలు చేయాలని, సంవత్సర కాలంగా తక్కువ ఇచ్చిన వేతనం వెంటనే చెల్లించాలని, ప్రతి నెల 5వ తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లని పరిష్కరించని యెడల తేదీ 29.7.2024 నాటి నుండి నిరవధిక సమ్మె చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, శానిటేషన్ కార్మికులు రాచకొండ పుష్ప, జేరిపోతుల కమలమ్మ, ఇస్తారమ్మ, సులోచన, కృష్ణవేణి, లలిత, భారతమ్మ, హేమలత, మహేందర్, విజయలక్ష్మి, రేణుక, ఉమారాణి, అండాలు తదితరులు పాల్గొన్నారు.

ముత్తిరెడ్డిగూడెం జడ్పీహెచ్ఎస్ లో ఆంగ్లమును బోధించే టీచర్ ను నియమించాలని ప్రజావాణిలో తల్లిదండ్రుల వినతి

భువనగిరి మండలం ముత్తిరెడ్డి గూడెం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హైస్కూల్ విద్యార్థులకు ఆంగ్లమును బోధించే ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో గ్రామానికి ఇంగ్లీష్ టీచర్ వచ్చిన మరుసటి రోజే అనారోగ్య కారణంగా దీర్ఘ కాలిక సెలవుపై వెళ్ళినట్లు, ప్రత్యామ్నాయంగా మరో ఆంగ్ల టీచర్ ను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని వారు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని జిల్లా విద్యాశాఖాధికారికి, పాఠశాల లో ఆంగ్ల టీచర్ ను ఏర్పాటు చేసేటట్లు ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన వారిలో గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు నీల పెద్ది రాజు, కొమ్ము ప్రకాష్, ఏ. కనకయ్య, జి. నర్సింహ్మ, డి. సిద్దిరాములు, వెంకన్న, బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.