పౌర గ్రంథాలయాల్లో పోస్టులు భర్తీ చేయాలని వినతి
![]()
పౌర గ్రంథాలయాల్లో లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ తెలంగాణ గ్రంధాలయ నిరుద్యోగుల సంఘం కోరింది . రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ ను స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో కలిసి, వారు వినతి పత్రం అందజేశారు. నిరుద్యోగ అభ్యర్థులు మాట్లాడుతూ 35 ఏళ్లుగా పబ్లిక్ లైబ్రరీలో లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయలేదన్నారు .కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తున్న నేపథ్యంలో స్టేట్ సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీ, సిటీ సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీ ,రీజినల్ పబ్లిక్ లైబ్రరీ, తాలూకా పబ్లిక్ లైబ్రరీ ,మండల పబ్లిక్ లైబ్రరీ ,విలేజ్ పబ్లిక్ లైబ్రరీ లో ఖాళీగా ఉన్న గ్రేడ్ - 1, గ్రేట్ - 2, గ్రేడ్ - 3 , గ్రేడ్ - 4 పోస్టులను ప్రకటించాలని కోరారు. ఖాళీగా ఉన్న 1000 నుంచి 1500 వరకు పోస్టులు తగ్గకుండా భర్తీ చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన చైర్మన్ రియాజ్ మాట్లాడుతూ... ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లి జాబ్ క్యాలెండర్ లో నోటిఫికేషన్ ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జానయ్య, శంకర్, కట్టయ్య, సాయిలు, వై మత్స్యగిరి ,మాధవి లత, శ్రీనివాస్ ,చంద్రశేఖర్ ,ధనరాజ్, తదితరులు పాల్గొన్నారు.


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని పహిల్వాన్ పురం అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని ప్రైమరీ స్కూలు ప్రధానోపాధ్యాయులు రమేష్ , అంగన్వాడి టీచర్స్ ఆధ్వర్యంలో నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండున్నర ఏళ్ల పిల్లలను అంగన్వాడి కేంద్రంలో చేర్పించి వారికి పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని ,తల్లిదండ్రులు తమ పిల్లలని అంగన్వాడి కేంద్రంలో చేర్పించాలి .వారి ఆరోగ్య విద్య, దృష్టి సారించాలని కోరారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు .అంగన్వాడి కేంద్రంలో నర్సరీ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపించకుండా ఆ వయసు ఉన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలి .ఆటపాటలతో విద్యను అందిస్తున్నాము మరియు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు బాలమని, రాణి ,ఆశా వర్కర్లు పద్మ ,చంద్రకళ మరియు తల్లులు రజిత, మమత ,సంతోష, అలివేలు, లావణ్య, హేమలత, మౌనిక, గౌతమి, గీత, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
Jul 22 2024, 07:58
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.0k