/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీ పోస్టులను భర్తీ చేసి , 24 గంటల వైద్య సేవలు అందించాలి: సిపిఎం డిమాండ్ Vijay.S
వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీ పోస్టులను భర్తీ చేసి , 24 గంటల వైద్య సేవలు అందించాలి: సిపిఎం డిమాండ్

వలిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు అన్నిటిని భర్తీ చేయాలని 24 గంటల వైద్య సేవలు అందించాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు సిపిఎం పోరుబాటలో భాగంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ మండల కేంద్రమైన వలిగొండ పట్టణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు అవసరం ఉండగా కేవలం ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని ఖాళీగా ఉన్న రెండు డాక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా ఆసుపత్రిలో మూడు మొదటి ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు ఖాళీగా ఉన్న నైట్ వాచ్మెన్ పోస్టును వెంటనే భర్తీ చేయాలని స్వీపర్లు కేవలం ఒక్కరే ఉన్నారని నూతనంగా నిర్మించిన భవనంలో అదనంగా మరొక స్వీపర్ అవసరం ఉందని అదేవిధంగా మేల్ సూపర్వైజర్ ఖాళీగా ఉందని వెంటనే ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు నిత్యం వందలాది మంది ప్రజలు వైద్యం కోసం వస్తున్నారని నూతనంగా నిర్మించిన భవనంలో ప్రభుత్వం వెంటనే అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు ముఖ్యంగా జనరేటర్ సౌకర్యం లేదని,వేటింగ్ చైర్స్ లేకపోవడం వల్ల వైద్యం కోసం వచ్చే మహిళలు,వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వెంటనే వెయిటింగ్ చైర్స్ లను ఏర్పాటు చేయాలని కోరారు వర్షంతో కురుస్తున్న పాత హాస్పటల్ భవనాన్ని వెంటనే తొలగించి అదనంగా ఆ స్థలంలో నూతన హాస్పిటల్ భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు ఈ సర్వే కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు మెరుగు వెంకటేశం,సిపిఎం పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ,సిపిఎం నాయకులు రాధారపు మల్లేశం,వేముల లక్ష్మయ్య,దేశపాక యాదయ్య, పోలేపాక గణేష్,స్థానికులు ఎదురుగట్ల యాదగిరి, పోలేపాక శ్రీరాములు,తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహంలో మౌలిక సమస్యల పరిష్కారం కొరకు SFI మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారికి ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ వలిగొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల సంక్షేమ వసతి గృహంలో ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్ట్ భర్తీ చేయాలన్నారు అదేవిధంగా విద్యార్థుల పట్ల పర్యవేక్షణ లోపంగా వ్యవహరిస్తున్న ఎస్ ఓ ను సస్పెండ్ చేయాలన్నారు అదేవిధంగా హాస్టల్లో మౌలిక సమస్యలను పరిష్కారం చేయాలన్నారు హాస్టల్లో విద్యార్థులకు వాటర్ సరిగ్గా లేక కరెంటు సౌకర్యం సరిగ్గా లేక బాత్రూంలో డోర్లు సరిగా లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు అనారోగ్య పరిస్థితి ఎదురవుతే చెప్పడానికి బాధ్యులు వార్డెన్ లేక ఇబ్బందులు పడతా ఉంటే ఉన్న బాధ్యులు ఎస్ఓ గారు పర్యవేక్షణ చేసి విద్యార్థుల బాగోదులు తెలుసుకోవాల్సిన వారు హాస్టల్ కి రాకుండా సమస్యలు తెలుసుకోకుండా తీవ్రమైన నిర్లక్ష్యంతో వ్యవహరించడం జరుగుతుంది ఈ సరైన పద్ధతి కాదు వారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలన్నారుఈసమస్యలన్నీ ఎస్ఎఫ్ఐ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోగా కలెక్టర్ గారు స్పందించి ఈ సమస్యలను త్వరలో పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు బుగ్గ ఉదయ్ కిరణ్ మండల నాయకులు వేములకొండ వంశీ నరేందర్ ఫర్దిన్ తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి : భువనగిరి లో వన మహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో వనమహోత్సవం లో భాగంగా మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భువనగిరి ఎంఎల్ఏ కుంభం అనిల్ కుమార్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ రామాంజనేయులు పోతంశెట్టివెంకటేశ్వర్లు కౌన్సిలర్ పంగ రెక్క స్వామిఅన్నారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ ఆధ్వర్యంలో వనమహోత్సవం, జరిపినరు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమహోత్సవాన్ని జీవిత పండుగగా భావిస్తారు. వన మహోత్సవాన్ని ప్రారంభించడం వెనుక ఉన్న నినాదం మాతృభూమిని రక్షించడమే. అందుకే దీన్ని వన మహోత్సవం అంటారు. ప్రముఖ నాయకులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరియు జవహర్‌లాల్ నెహ్రూ కూడా ఈ పండుగ గురించి ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. అంతేకాకుండా, స్థానికులు మరియు అటవీ శాఖ వంటి వివిధ ప్రఖ్యాత ఏజెన్సీల మద్దతుతో విభిన్న జాతులకు చెందిన వేలాది మొక్కలు నాటబడ్డాయి. మన భూమికి చెట్లను పెంచడం ఎంత అవసరమో మనందరికీ తెలుసు. ప్రజలు ఇళ్లు, ఆఫీసులు, పాఠశాలలు, కళాశాలలు మొదలైన వాటిల్లో మొక్కలు నాటారు.అంతేకాక, సామాజిక మాధ్యమాలను కూడా మరింత అవగాహన కల్పించేందుకు ఉపయోగిస్తున్నారు. మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ణిత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. ఇంటింటి మొక్కలు పంపిణీ చేసి, వాటి సంరక్షించే విధంగా ప్రజలకు తెలియజేయాలని, మొక్కల పెంపకంతో మానవ మనుగడ సాగుతుందని, భవిష్యత్‌ తరాలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతవరణం అందించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ వార్డ్ ఆఫీసర్ శపరోద్దీ న్ వార్డ్ ప్రజలు , మహిళా సంఘాలు,తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ: గోపరాజుపల్లి లో అమ్మ మాట అంగన్వాడి బాట

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని వెలువర్తి ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణిశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండున్నర ఏళ్ల వయసున్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించి, వారికి ఆహ్లాదకర వాతావరణంలో పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని అంగన్వాడి కేంద్రంలో చేర్పించి వారి ఆరోగ్యం ,విద్యపై దృష్టి సారించాలని కోరారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడి కేంద్రంలో నర్సరీ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపరాజుపల్లి అంగన్వాడీ టీచర్ సలిగంజి మణెమ్మ, చిత్తాపురం అంగన్వాడి టీచర్ ఆర్ మంజుల , ముద్దాపురం అంగన్వాడి టీచర్ పి సునిత, ఆశా వర్కర్లు కవిత, నీరజ ఆయా దేవేంద్ర , గర్భవతులు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.
సమాజంలోని సంఘటనలతో నీలం నాటకం , సమాజానికి మంచి సందేశం: యువ రచయిత దర్శకుడు నీలం నరేష్

"నీలం" నాటకం ప్రతిభ ని ఎవరు  అడ్డుకోలేరని అంటున్నాడు యవ రచయిత, దర్శకుడు, నీలం నరేష్_ , తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు నీలం థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో " నీలం " నాటకం నందమూరి తారక రామారావు ఆడిటోరియం, నాంపల్లి లో అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డా" మామిడి హరికృష్ణ, ఆత్మీయ అతిథులు రచయిత నటుడు డా" మల్లేష్ బాలస్ట్, నటుడు దర్శకుడు ధనరాజ్,మరియు రచయిత దర్శకుడు నటుడు అజయ్ మంకెనపల్లి, కార్యక్రమంలో పాల్గొన్నారు, నాటకం అద్భుతంగా ఉందని భవిష్యత్తులో మరిన్ని నాటకాలు వేయాలని, నీలం నాటకం సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించారని మల్లేష్ బలస్ట్ అన్నారు, అజయ్ మంకే నపల్లి మాట్లాడుతూ ఈ నాటకాలు నటించినటువంటి నటినట్లు అందరికీ అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని మంచి నాటకాలు చేయాలని అలాగే కళాకారులని బాగా పాత్రలో జీవించి నటించరు అని అభినందించారు, నీలం నాటకం డైరెక్టర్ మాట్లాడుతూ ఈ నాటకం సమాజంలో జరుగుతున్నటువంటి, కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని రాయడం జరిగిందని అన్నారు ఈ నాటకంలో నటించినటువంటి నటి,నటుల అందరికీ అభినందనలు తెలిపారు. మా నాటకానికి సహకరించిన డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు అలాగే రానున్న రోజుల్లో మిగతా హరివిల్లు లో రంగులను ప్రదర్శిస్తామని, అన్నారు.

వలిగొండలో వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో సోమవారం  పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు .ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలను సీజ్ చేశామని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారుల పై ,మైన డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలు నడిపిన ,మద్యం సేవించి వాహనాలు నడిపిన కఠిన చర్యలు తప్పవని అన్నారు ,వాహనాలు నడిపేవారు వాహనాలకు సంబంధించిన మరియు వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు దగ్గర ఉంచుకోవాలని అన్నారు.
భువనగిరి: ఉసిల్ల వాగు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి: సిపిఎం డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం గ్రామంలోని బస్వాపురం , భువనగిరి రోడ్డు మధ్యలో ఉన్న వాగు దాటడానికి బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. సోమవారం సిపిఎం పోరుబాటలో భాగంగా భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలో పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఉసిల్ల వాగు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా గత ఎమ్మెల్యేకు, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేకు, అధికారులు ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చిన సమస్య పరిష్కరించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదని అన్నారు. వర్షాకాలంలో వర్షం పడితే వాగు పైనుంచి నీరు పోతే అవతలికి భువనగిరి పట్టణానికి పోవడానికి దాటాడానికి వీలుగాని పరిస్థితి బసాపురం గ్రామ ప్రజలతోపాటు చుట్టుముట్టు ఆరు గ్రామాల ప్రయాణికులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామ రైతులు కూడా బావుల వద్దకు వ్యవసాయ పనులకు, వాడి ఆవుల దగ్గరికి నిరంతరము వెళ్తూ ఉంటారని వర్షం వస్తే నీరు అధికంలో రావడం వల్ల అవతలికి వెళ్లాలంటే చుట్టూ తిరిగి పదిహేను కిలోమీటర్లు తిరిగి వెళ్లవలసిన పరిస్థితి ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవాలని డిమాండ్ చేసినారు. అదే విధంగా గ్రామంలో మురికినీటి కాలువల సమస్యలు పరిష్కరించాలని, లింకు రోడ్లకు సంబంధించి బస్వాపురం నుండి హనుమాపురం , బసాపురం నుండి గంగాసాంపల్లి వరకు లింకు రోడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య, పార్టీ సీనియర్ నాయకులు మధ్యపురం బాల్ నర్సింహ్మ, మచ్చ భాస్కర్, గ్రామ ప్రజలు సత్యనారాయణ , శ్రీనివాస్ , తిరుపతి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ పట్టణంలో మురికి కాలువల్లో పేరుకపోయిన చెత్తాచెదరా న్ని తొలగించాలి: సిపిఎం డిమాండ్

వలిగొండ పట్టణంలో మురికి కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని,చెట్లను తొలగించాలి... సిపిఎం డిమాండ్ వలిగొండ పట్టణంలో వెలువర్తి రోడ్డు నుండి పాత ఎమ్మార్వో కార్యాలయం వెళ్లే దారిలో మురుగు కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని కాల్వకు ఇరువైపులా పెరిగిన పిచ్చి చెట్లను వెంటనే తొలగించి ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా కాపాడాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూర శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు సోమవారం రోజు సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పాత ఎమ్మార్వో కార్యాలయం ఏరియాలో సర్వే నిర్వహించారు వెల్వర్తి రోడ్డు నుండి పాత ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న మురుగు కాలువ పూర్తిగా చెత్తా చెదారంతో నిండిపోయిందని ఈ కాల్వకు ఇరువైపులా చెట్లుపెరిగి దోమలు మురుగునీటి వాసన ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వెంటనే గ్రామపంచాయతీ కార్యదర్శి స్పందించి మురుగు కాలువను శుభ్రం చేయించాలని చెట్లు చదరాలను తొలగించాలని బ్లీచింగ్ పౌడర్ ను చల్లాలని డిమాండ్ చేశారు ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల ఇండ్ల మధ్యలో ఖాళీ స్థలాల్లో నీరు నిలిచి దోమలు పెరగడానికి అవకాశం ఉందని దీంతో అక్కడ ప్రజలకు డెంగ్యూ,మలేరియా,చికెన్ గున్యా లాంటి జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని వెంటనే గ్రామ పంచాయతీ అధికారులు వీటిపై దృష్టి పెట్టి తొలగించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ, నాయకులు కొండూరు సత్తయ్య,వేముల లక్ష్మయ్య,నరేందర్, కవిత,యాకమ్మ,సురేష్,పర్వీన్ తదితరులు పాల్గొన్నారు
అడ్డగూడూరులో AISF నాయకుల ముందస్తు అరెస్ట్

నిర్బంధాలు అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణిచివేస్తున్న పోలీసులు* *తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 8 వేల కోట్ల స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని, ఈ ప్రజా పాలనలో ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించి వారికి సరైన న్యాయం చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయం ముట్టడికి పిలుపు ఇవ్వడం జరిగింది* *ఈ సందర్భంగా ఈరోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరిన ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్,చెరుకు శివరాజ్ గార్లను ముందస్తుగా అరెస్టు చేసి అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది* ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 8 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఫీజు రీయింబర్స్మెంట్ , స్కాలర్షిప్ లు పెయింటింగ్ లో ఉండడం వలన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు పేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి సమస్య పరిష్కారం కోసం నూతన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో పెయింటింగ్స్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి అబ్దుల్లాపూర్ మెట్టు పర్యటన... వలిగొండలో BJYM నాయకుల ముందస్తు అరెస్టు...

ప్రభుత్వం ఏర్పడి 200 రోజుల అయినప్పటికీ ఎలాంటి హామీలు నెరవేర్చలేని ఈ అసమర్థ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ పర్యటించాలన్న భయంతో , BJYM నాయకులను ముందస్తు అరెస్టు లు చేసి జైల్లో పెట్టే దౌర్భాగ్యం స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది* *ఈరోజు తెలంగాణ CM రేవంత్ రెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ట్ పర్యటనకి వెలుతున్న సందర్బంగా ఎక్కడ BJYM నాయకులు అడ్డుపడతారనే భయంతో ముందస్తుగా వలిగొండ మండల కేంద్రానికి చెందిన BJYM నాయకులను ముందస్తు అనుమతి లేకుండా అరెస్టు చేయడం జరిగింది ఈ సందర్బంగా BJYM నాయకులు మాట్లాడుతు BJYM నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ, నిరుద్యోగుల డిమాండ్లను మరియు వారికి ఇచ్చిన హామీలను , నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నెలకు 4000 భృతి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాల్సిందే లేకుంటే సిఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లిన అడ్డుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు మండల బీజేపీ నాయకుల పూచీకత్తు మీద BJYM నాయకులను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బోల్ల సుదర్శన్,బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ , దంతూరి సత్తయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్, మండల సెక్రెటరీ మందుల నాగరాజు, BJYM అసెంబ్లీ కన్వీనర్ బుంగమట్ల మహేష్,BJYM మండల ఆద్యక్షులు ,మందాడి రంజిత్ రెడ్డి,BJYM మండల ప్రదనకార్యదర్శి అమనగంటి శివ కుమార్,BJYM మండల ఉపాధ్యక్షులు మైసోల్ల హరీష్ తదితరులను అరెస్టు చేయడం జరిగింది.