/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz వలిగొండ : ప్రొద్దుటూరులో ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య Vijay.S
వలిగొండ : ప్రొద్దుటూరులో ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వలిగొండ మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామంలో చోటుచేసుకుంది .పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం వలిగొండ మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన కూర శివ ప్రసాద్ వయస్సు 27, తన తమ్ముడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తీవ్ర మనస్తపానికి గురై శివప్రసాద్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని వలిగొండ ఎస్సై మహేందర్ తెలిపారు.
జనాభా నియంత్రణ , ఆరోగ్య జీవన విధానం అనే అంశాల్లో గోడపత్రిక తయారి పోటీల్లో విజేతలు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆరోగ్యకర ప్రపంచం నిర్మాణం కోసం జనాభా నియంత్రణ అవసరమని జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి లింగరెడ్డి అన్నారు .ప్రపంచ జనాభా నియంత్రణ సందర్భంగా జిల్లా కేంద్రంలోని వెన్నెల కాలేజీలో గోడపత్రిక తయారి పోటీలు నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడుతూ... మహిళా సాధికారత కోసం జనాభా నియంత్రణ ,ఆరోగ్య జీవన విధానం అనే అంశాల్లో గోడ పత్రిక తయారి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఎస్ శ్రీకళ, పదో తరగతి ఆదర్శ పాఠశాల చౌటుప్పల్ ప్రథమ బహుమతి, పి సాయి కుమార్ పదవ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలువర్తి ద్వితీయ బహుమతి ఎస్.కె జోయా జోబిన్ 9వ తరగతి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల రామన్నపేట విజేతలుగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహాలక్ష్మి, రమాదేవి, రాములు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వరిగొండ మండల కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

యాదాద్రి భువనగిరి జిల్లా  వలిగొండ మండలం 37 గ్రామపంచాయతీ లతో జిల్లాలోని అతిపెద్ద మండలం గా ఉండడంతోపాటు విద్యుత్,వ్యవసాయ మోటర్లపై ఆధారపడి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న మండల రైతాంగానికి ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రం మండల కేంద్రంలో అందుబాటులో లేక భువనగిరి జిల్లా కేంద్రంతో పాటు రామన్నపేటకు ట్రాన్స్ఫార్మర్లను తీసుకెళ్లడానికి రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతుందని వేలాది రూపాయల అదనపు భారాన్ని భరించాల్సి వస్తుందని వెంటనే వలిగొండలో స్థానిక సబ్స్టేషన్ యందు ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి లు డిమాండ్ చేశారు శనివారం రోజున సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ట్రాన్స్ఫార్మర్స్ రిపేరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని మండల ప్రజలు అనేక సంవత్సరాల నుండి కోరుతున్న ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామన్నారు గత ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించలేదన్నారు ఇప్పటికైనా వెంటనే రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం,స్థానిక ఎమ్మెల్యే స్పందించి వలిగొండ మండల కేంద్రంలో గల సబ్స్టేషన్ యందు ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత రైతులకు కలుగుతున్న ఇబ్బందులను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, మండల కార్యదర్శివర్గ సభ్యులు చీర్క శ్రీశైలం రెడ్డి,మెరుగు వెంకటేశం,మండల కమిటీ సభ్యులు కొండే కిష్టయ్య,కందడి సత్తిరెడ్డి, కవిడే సురేష్,దుబ్బ లింగం,నాయకులు దొడ్డి భిక్షపతి,రాదారపు మల్లేశం,జక్కా రాఘవరెడ్డి,బండమీది సుందరయ్య,చేగురి నర్సింహ,మాడుగుల వెంకటేశం,మందుల యాదయ్య,ఏటేల్లి నర్సింహ,మంగ పాండు,వేముల నాగరాజు,పోలేపల్లి స్వామి,బండమిది సత్తయ్య,జరుగుమల్ల శ్రీకాంత్,మైసోళ్ల నరేందర్, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు
భువనగిరి: RRR రైతులకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి: భానుచందర్ బొజ్జ


యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బొజ్జ భాను చందర్ మాట్లాడుతూ ...రాయగిరి గ్రామం గతం లో అనేక సార్లు కొన్ని వందల ఎకరాలు ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది అని ఇప్పుడు RRR పేరుతో దాదాపు 280ఎకరాలు మల్ల ఇవ్వాలి అంటే ఇవ్వడానికి సిద్ధంగా లేము అని గత ప్రభుత్వం పై అనేక ఉద్యమాలు చేసి రైతులు జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే, అనాడు ఉద్యమం లో ప్రస్తుత మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ప్రస్తుత MLA కుంభం అనిల్ రెడ్డి  కూడా పూర్తి మద్దతు తెలిపారు అని అన్నారు, అన్నాడు శాసనసభ ఎన్నికల ప్రచారం లో భాగంగా ప్రియాంక గాంధీ నోటా కూడా RRR అలైన్మెంట్ మారుస్తా అని కూడా అన్నడం జరిగింది. మరియు మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకన్న గారు అనిల్ కుమార్ రెడ్డి అన్న గారు కూడా మేము గెలిచాక రాయగిరి నుండి RRR పోకుండా మొదటగా వచ్చిన మూటకొండూరు పై నుండి వచ్చే అలైన్మెంట్ హే ఖరారు చేస్తాం అని రైతులకు మాట ఇవ్వడం తో రైతులు ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించి అధికారం కట్టబెట్టారు అని చెప్పుకా వచ్చారు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టి కి తీసుకెళ్లి అలైన్మెంట్ మార్చే విధంగా చేయాలి అని రైతులు వేడుకుంటున్నారు, గత ప్రభుత్వం లాగా చేయొద్దు అని రాయగిరి పార్టీ నాయకులు కూడా అనుకుంటున్నారు, వీలు అయినంత త్వరగా అలైన్మెంట్ మర్చి రాయగిరి రైతులకు న్యాయం చేయాలనీ కోరుతున్నారు అని తెలిపారు.
భువనగిరి: RRR రైతులకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి: భానుచందర్ బొజ్జ


యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బొజ్జ భాను చందర్ మాట్లాడుతూ ...రాయగిరి గ్రామం గతం లో అనేక సార్లు కొన్ని వందల ఎకరాలు ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది అని ఇప్పుడు RRR పేరుతో దాదాపు 280ఎకరాలు మల్ల ఇవ్వాలి అంటే ఇవ్వడానికి సిద్ధంగా లేము అని గత ప్రభుత్వం పై అనేక ఉద్యమాలు చేసి రైతులు జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే, అనాడు ఉద్యమం లో ప్రస్తుత మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ప్రస్తుత MLA కుంభం అనిల్ రెడ్డి  కూడా పూర్తి మద్దతు తెలిపారు అని అన్నారు, అన్నాడు శాసనసభ ఎన్నికల ప్రచారం లో భాగంగా ప్రియాంక గాంధీ నోటా కూడా RRR అలైన్మెంట్ మారుస్తా అని కూడా అన్నడం జరిగింది. మరియు మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకన్న గారు అనిల్ కుమార్ రెడ్డి అన్న గారు కూడా మేము గెలిచాక రాయగిరి నుండి RRR పోకుండా మొదటగా వచ్చిన మూటకొండూరు పై నుండి వచ్చే అలైన్మెంట్ హే ఖరారు చేస్తాం అని రైతులకు మాట ఇవ్వడం తో రైతులు ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించి అధికారం కట్టబెట్టారు అని చెప్పుకా వచ్చారు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టి కి తీసుకెళ్లి అలైన్మెంట్ మార్చే విధంగా చేయాలి అని రైతులు వేడుకుంటున్నారు, గత ప్రభుత్వం లాగా చేయొద్దు అని రాయగిరి పార్టీ నాయకులు కూడా అనుకుంటున్నారు, వీలు అయినంత త్వరగా అలైన్మెంట్ మర్చి రాయగిరి రైతులకు న్యాయం చేయాలనీ కోరుతున్నారు అని తెలిపారు.
ఉద్దీపనతోనే పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు: వివి ఎం పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నదే ఉద్దీపన ముఖ్య ఉద్దేశం అని నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం అన్నారు .శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని తన మానస పుత్రిక ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉద్దీపన పాఠశాలను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య మాట్లాడుతూ మట్టిలో కూడా మాణిక్యాలను తయారు చేస్తున్న ఎమ్మెల్యే వేముల వీరేశం అన్న మా అందరికీ ఆదర్శం అన్నారు. ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకుని మా ప్రాంతంలో కూడా విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల ఉన్న పిల్లలకు విద్యను అందించడమే ఉద్దీపన ఉద్దేశం అన్నారు .సామాన్య కుటుంబంలో పుట్టి గొప్ప ఆలోచన చేస్తున్న ఎమ్మెల్యే వేముల వీరేశంకి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ,ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శంబయ్య ,నల్గొండ డిఈవో బిక్షపతి ,ఉద్దీపన చీఫ్ అడ్వైజర్ ఆనంద్, మంగారెడ్డి హెడ్మాస్టర్ భద్రయ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గౌస్ నగర్ లో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా  భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామానికి చెందిన ప్రిన్స్ టైలర్ ప్రోపేటర్ రాచర్ల శంకరప్ప ఇటీవలనే అనారోగ్యంతో మరణించగా, ఆయన కుటుంబానికి శివ స్వాముల బృందం తరఫున పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్ల మాసు బాలరాజు గౌడ్, భూష బోయిన నరసింహ యాదవ్, పాక జహంగీర్ యాదవ్, నల్లమసు ప్రసాద్ గౌడ్, రాగీరు పాండు గౌడ్, పాక శంకర్ యాదవ్, పాక మహేష్ యాదవ్, రాగిరి బాలరాజు గౌడ్, బోడపట్ల మోహన్ రెడ్డి, భూష బోయిన సాయి, ఈర్ల భాస్కర్, కుటుంబ సభ్యులు రాచర్ల కమలమ్మ, రాచర్ల వేణు పాల్గొన్నారు.
జిల్లాలో నలుగురు ప్లీడర్లను లా ఆఫీసర్లు గా విధులను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే

యాదాద్రి భువనగిరి జిల్లా లో నలుగురు ప్లీడర్లను లా ఆఫీసర్లుగా విధులను నిర్వహించాలని  కలెక్టర్ హనుమంతు కె.జెండగే శుక్రవారం ఆదేశాలు జారీ చేసారు.హైకోర్టు పరిధిలో ఉన్న ఆయా కోర్టులలో విధులు నిర్వహించడానికి అదనపు ప్రభుత్వ ప్లీడర్లు, ప్రత్యేక ప్రభుత్వ ప్లీడర్లు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లను శాసన వ్యవహారాలు, న్యాయశాఖ ఎంపిక చేసింది.
గవర్నమెంట్ ప్లీడర్ గా కల్లూరి రవిందర్ రెడ్డి,అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ గా ఎం.ఏ రహీమ్,అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు గా భీమగాని హరిబాబు గౌడ్ ,మక్తాల నరసింహ లను ఆరు నెలల కాలానికి కాకుండా ప్రభుత్వం నియామకాలు చేపట్టే వరకు విధులను నిర్వహించేలా జిల్లా కలెక్టర్ హనుమంతు కె.జెండగే ఉత్తర్వులు జారీ చేసారు.వీరు సీనియర్ సివిల్ కోసం అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ జడ్జి కోర్టు , ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ భువనగిరి, ఆలేరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు,రామన్నపేట చౌటుప్పల్ కోర్టు లలో విధులను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వారికి ఆదేశాలను జారీ చేసారు.
డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి : AITUC రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో ఇండియన్ ఆటో డ్రైవర్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఎండీ ఇమ్రాన్ ముఖ్యఅతిథిగా హాజరై ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు ప్రతి నెల రూ.10 వేలు ఇచ్చేంత వరకు త్వరలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించినున్నట్లు అయన తెలిపారు. భువనగిరిలో ఆటోలకు పార్కింగ్ స్థలం కేటాయించాలని, కొత్త బస్టాండ్ లో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని, గత ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో, చాలా మంది డిగ్రీలు, ఉన్నత చదువులు చదివి ఉపాధి దొరకకపోవడంతో కుటుంబాన్ని పోషించడం కోసం అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారని అన్నారు. ఆటో డ్రైవర్లకు జీవనభృతి కింద నెలకు రూ.10,000/- ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఆటో డ్రైవర్ల బతుకుల కోసం పోరాటం చేయవలసి వస్తుందని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు గనబోయిన వెంకటేష్ (రాణా)సీనియర్ నాయకులు గొర్ల లక్ష్మణ్, ఎండీ షరీఫ్, ఇండియన్ ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు శానవాజ్, శకూర్, సల్మాన్, శ్రీను, చాంద్, అజయ్, జమీర్, సుల్తాన్, డానియేల్, స్వామి, ఆనంద్, షఫీ, పరమేష్, కృష్ణ, నర్సింహా, తదితరులు పాల్గొన్నారు.

పహిల్వాన్ పురం గ్రామంలో బొడ్రాయికి జలాభిషేకం... ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామ మహిళలు

యాదాద్రి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్ పురం గ్రామంలో మహిళలు, మహిళలు అందరూ బొడ్రాయికి నీళ్లు పోయడం మరియు పసుపు కుంకుమలతో అభిషేకించడం జరిగినది అందరూ వరుణ దేవుని వేడుకొని భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం జరిగినది తర్వాత వాన దేవుని పాటలతో బతుకమ్మ ఆడడం జరిగినది. వర్షాలు కురిపించి తమ పంటలు ఎండిపోకుండా చూడాలని వరుణ దేవుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో  పహిల్వాన్ పురం మహిళల  బంధారపు బాలమణి ,కళ్లెం కలమ్మ, సరిత, ఒట్టు పెళ్లి అంజమ్మ ,శంకరమ్మ ,బండారి అనిత, బండారి అలివేలు ,వేముల వినోద ,బండారి లక్ష్మమ్మ, పచ్చిమట్ల రేణుక ,రాగిరు లతాశ్రీ తదితర మహిళలు  పాల్గొన్నారు.