/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz భువనగిరి: RRR రైతులకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి: భానుచందర్ బొజ్జ Vijay.S
భువనగిరి: RRR రైతులకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి: భానుచందర్ బొజ్జ


యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బొజ్జ భాను చందర్ మాట్లాడుతూ ...రాయగిరి గ్రామం గతం లో అనేక సార్లు కొన్ని వందల ఎకరాలు ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది అని ఇప్పుడు RRR పేరుతో దాదాపు 280ఎకరాలు మల్ల ఇవ్వాలి అంటే ఇవ్వడానికి సిద్ధంగా లేము అని గత ప్రభుత్వం పై అనేక ఉద్యమాలు చేసి రైతులు జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే, అనాడు ఉద్యమం లో ప్రస్తుత మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ప్రస్తుత MLA కుంభం అనిల్ రెడ్డి  కూడా పూర్తి మద్దతు తెలిపారు అని అన్నారు, అన్నాడు శాసనసభ ఎన్నికల ప్రచారం లో భాగంగా ప్రియాంక గాంధీ నోటా కూడా RRR అలైన్మెంట్ మారుస్తా అని కూడా అన్నడం జరిగింది. మరియు మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకన్న గారు అనిల్ కుమార్ రెడ్డి అన్న గారు కూడా మేము గెలిచాక రాయగిరి నుండి RRR పోకుండా మొదటగా వచ్చిన మూటకొండూరు పై నుండి వచ్చే అలైన్మెంట్ హే ఖరారు చేస్తాం అని రైతులకు మాట ఇవ్వడం తో రైతులు ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించి అధికారం కట్టబెట్టారు అని చెప్పుకా వచ్చారు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టి కి తీసుకెళ్లి అలైన్మెంట్ మార్చే విధంగా చేయాలి అని రైతులు వేడుకుంటున్నారు, గత ప్రభుత్వం లాగా చేయొద్దు అని రాయగిరి పార్టీ నాయకులు కూడా అనుకుంటున్నారు, వీలు అయినంత త్వరగా అలైన్మెంట్ మర్చి రాయగిరి రైతులకు న్యాయం చేయాలనీ కోరుతున్నారు అని తెలిపారు.
ఉద్దీపనతోనే పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు: వివి ఎం పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నదే ఉద్దీపన ముఖ్య ఉద్దేశం అని నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం అన్నారు .శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని తన మానస పుత్రిక ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉద్దీపన పాఠశాలను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య మాట్లాడుతూ మట్టిలో కూడా మాణిక్యాలను తయారు చేస్తున్న ఎమ్మెల్యే వేముల వీరేశం అన్న మా అందరికీ ఆదర్శం అన్నారు. ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకుని మా ప్రాంతంలో కూడా విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల ఉన్న పిల్లలకు విద్యను అందించడమే ఉద్దీపన ఉద్దేశం అన్నారు .సామాన్య కుటుంబంలో పుట్టి గొప్ప ఆలోచన చేస్తున్న ఎమ్మెల్యే వేముల వీరేశంకి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ,ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శంబయ్య ,నల్గొండ డిఈవో బిక్షపతి ,ఉద్దీపన చీఫ్ అడ్వైజర్ ఆనంద్, మంగారెడ్డి హెడ్మాస్టర్ భద్రయ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గౌస్ నగర్ లో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా  భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామానికి చెందిన ప్రిన్స్ టైలర్ ప్రోపేటర్ రాచర్ల శంకరప్ప ఇటీవలనే అనారోగ్యంతో మరణించగా, ఆయన కుటుంబానికి శివ స్వాముల బృందం తరఫున పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్ల మాసు బాలరాజు గౌడ్, భూష బోయిన నరసింహ యాదవ్, పాక జహంగీర్ యాదవ్, నల్లమసు ప్రసాద్ గౌడ్, రాగీరు పాండు గౌడ్, పాక శంకర్ యాదవ్, పాక మహేష్ యాదవ్, రాగిరి బాలరాజు గౌడ్, బోడపట్ల మోహన్ రెడ్డి, భూష బోయిన సాయి, ఈర్ల భాస్కర్, కుటుంబ సభ్యులు రాచర్ల కమలమ్మ, రాచర్ల వేణు పాల్గొన్నారు.
జిల్లాలో నలుగురు ప్లీడర్లను లా ఆఫీసర్లు గా విధులను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే

యాదాద్రి భువనగిరి జిల్లా లో నలుగురు ప్లీడర్లను లా ఆఫీసర్లుగా విధులను నిర్వహించాలని  కలెక్టర్ హనుమంతు కె.జెండగే శుక్రవారం ఆదేశాలు జారీ చేసారు.హైకోర్టు పరిధిలో ఉన్న ఆయా కోర్టులలో విధులు నిర్వహించడానికి అదనపు ప్రభుత్వ ప్లీడర్లు, ప్రత్యేక ప్రభుత్వ ప్లీడర్లు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లను శాసన వ్యవహారాలు, న్యాయశాఖ ఎంపిక చేసింది.
గవర్నమెంట్ ప్లీడర్ గా కల్లూరి రవిందర్ రెడ్డి,అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ గా ఎం.ఏ రహీమ్,అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు గా భీమగాని హరిబాబు గౌడ్ ,మక్తాల నరసింహ లను ఆరు నెలల కాలానికి కాకుండా ప్రభుత్వం నియామకాలు చేపట్టే వరకు విధులను నిర్వహించేలా జిల్లా కలెక్టర్ హనుమంతు కె.జెండగే ఉత్తర్వులు జారీ చేసారు.వీరు సీనియర్ సివిల్ కోసం అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ జడ్జి కోర్టు , ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ భువనగిరి, ఆలేరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు,రామన్నపేట చౌటుప్పల్ కోర్టు లలో విధులను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వారికి ఆదేశాలను జారీ చేసారు.
డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి : AITUC రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో ఇండియన్ ఆటో డ్రైవర్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఎండీ ఇమ్రాన్ ముఖ్యఅతిథిగా హాజరై ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు ప్రతి నెల రూ.10 వేలు ఇచ్చేంత వరకు త్వరలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించినున్నట్లు అయన తెలిపారు. భువనగిరిలో ఆటోలకు పార్కింగ్ స్థలం కేటాయించాలని, కొత్త బస్టాండ్ లో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని, గత ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో, చాలా మంది డిగ్రీలు, ఉన్నత చదువులు చదివి ఉపాధి దొరకకపోవడంతో కుటుంబాన్ని పోషించడం కోసం అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారని అన్నారు. ఆటో డ్రైవర్లకు జీవనభృతి కింద నెలకు రూ.10,000/- ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఆటో డ్రైవర్ల బతుకుల కోసం పోరాటం చేయవలసి వస్తుందని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు గనబోయిన వెంకటేష్ (రాణా)సీనియర్ నాయకులు గొర్ల లక్ష్మణ్, ఎండీ షరీఫ్, ఇండియన్ ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు శానవాజ్, శకూర్, సల్మాన్, శ్రీను, చాంద్, అజయ్, జమీర్, సుల్తాన్, డానియేల్, స్వామి, ఆనంద్, షఫీ, పరమేష్, కృష్ణ, నర్సింహా, తదితరులు పాల్గొన్నారు.

పహిల్వాన్ పురం గ్రామంలో బొడ్రాయికి జలాభిషేకం... ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామ మహిళలు

యాదాద్రి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్ పురం గ్రామంలో మహిళలు, మహిళలు అందరూ బొడ్రాయికి నీళ్లు పోయడం మరియు పసుపు కుంకుమలతో అభిషేకించడం జరిగినది అందరూ వరుణ దేవుని వేడుకొని భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం జరిగినది తర్వాత వాన దేవుని పాటలతో బతుకమ్మ ఆడడం జరిగినది. వర్షాలు కురిపించి తమ పంటలు ఎండిపోకుండా చూడాలని వరుణ దేవుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో  పహిల్వాన్ పురం మహిళల  బంధారపు బాలమణి ,కళ్లెం కలమ్మ, సరిత, ఒట్టు పెళ్లి అంజమ్మ ,శంకరమ్మ ,బండారి అనిత, బండారి అలివేలు ,వేముల వినోద ,బండారి లక్ష్మమ్మ, పచ్చిమట్ల రేణుక ,రాగిరు లతాశ్రీ తదితర మహిళలు  పాల్గొన్నారు.

జన విజ్ఞాన వేదిక జాతీయ మహాసభలను జయప్రదం చేయండి: కొడారి వెంకటేష్ జిల్లా కన్వీనర్ జన విజ్ఞాన వేదిక

జన విజ్ఞాన వేదిక ఐదవ జాతీయ మహా సభలను, ఈనెల 14 న బెంగుళూరు లోని బసవపుర మేన్ రోడ్డులో గల ఆర్కే కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 36 సంవత్సరాలుగా ప్రగతి కోసం సైన్, ప్రజలకోసం సైన్స్, శాంతి కోసం సైన్స్, స్వావలంబన కోసం సైన్స్ అనే నినాదాలతో మెరుగైన పౌర సమాజ నిర్మాణం కోసం జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, కోల్ కతా, చెన్నై లాంటి నగరాల్లో జన విజ్ఞాన వేదిక పనిచేస్తుందని ఆయన తెలిపారు. విద్యార్థులు, యువతీ యువకులు జన విజ్ఞాన వేదిక సంస్థలో సభ్యులుగా చేరి, మూఢ నమ్మకాలను, మూఢ విశ్వాసాలను విడనాడి "సైన్స్ పురోభివృద్ధికి" కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అమరజీవి కామ్రేడ్ నోముల రాంరెడ్డి ఆశయాలను సాధిద్దాం: మాటూరి బాలరాజు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు

అమరజీవి కామ్రేడ్ నోముల రాంరెడ్డి గారి ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన ఆశయాలని సాధించినప్పుడే ఆయనకు మనమిచ్చే ఘననివాళని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు,సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి లు అన్నారు . శుక్రవారం  వలిగొండ మండల పరిధిలోని సంగెం గ్రామంలో నోముల రామి రెడ్డి 18 వ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నోముల రామిరెడ్డి ఉన్నత కుటుంబంలో పుట్టి పెరిగిన సిపిఎం డివిజన్ నాయకులు కందాల రంగారెడ్డి సారధ్యంలో సంగెం గ్రామంలో ప్రభుత్వ బంచరాయి,పోరంబోకు భూములను భూమిలేని పేదలకు పంచాలని వివిధ కులాల వృత్తిదారులకు ఇవ్వాలని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి ప్రభుత్వాల మెడలు వంచి వారందరికీ ప్రభుత్వ భూములు ఇప్పించారన్నారు* *కల్లుగీత కార్మికుల హక్కుల కోసం,దున్నేవాడికే భూమి అనే నినాదంతో పోరాటాలు నిర్వహించారని అన్నారు* *సంగం గ్రామం తో పాటు పరిసర గ్రామాలుగా ఉన్న వర్కట్ పల్లి, గోకారం,ధర్మారెడ్డిపళ్లి గ్రామాల్లో సిపిఎం పార్టీ విస్తరణ కోసం నిరంతరం కృషి చేశారని పేదల సమస్యల పరిష్కారానికి ఎర్రజెండా నాయకత్వమంలో సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో ప్రజా పోరాటాలు నిర్వహించారని అన్నారు* *భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం నిర్వహించారని వారి యొక్క స్ఫూర్తితో నేడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు* *ఈ కార్యక్రమంలో రాంరెడ్డి సహచరులు సింగిల్ విండో చైర్మన్ సుర్కంటి వెంకట్ రెడ్డి సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్ మాజీ సర్పంచ్ లు కీసరి రాంరెడ్డి కాసుల కృష్ణ,మాజీ ఎంపీటీసీ పబ్బతి మల్లేశం,సిపిఎం శాఖ కార్యదర్శి మండల కమిటీ సభ్యులు భీమనబోయిన జంగయ్య సీనియర్ నాయకులు ఏనుగు సాయి రెడ్డి, నోముల జంగారెడ్డి,అంగిడి దేవేందర్ రెడ్డి,సురకంటి లక్ష్మారెడ్డి,ఏనుగు ప్రభాకర్ రెడ్డి,బండి గారి శంకరయ్య,వరికుప్పల మల్లేశం,కీసరి రంగారెడ్డి,మెట్టు రవీందర్ రెడ్డి,చేగురి నర్సింహ,నారి రామస్వామి,మాడుగుల వెంకటేశం,జక్కుల వెంకటేశం, రామిరెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.వర్థంతి అనంతరం రాంరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి స్థూపం వద్ద మొక్కలు నాటడం జరిగింది.


తెలంగాణ రాష్ట్ర DGP జితేందర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం డిజిపి గా ఉన్న రవి గుప్త ను హోం శాఖ స్పెషల్ సిఎస్ గా బదిలీ చేసింది. తెలంగాణ రాష్ట్ర డిజిపిగా జితేందర్ నియామకం కావడంతో డిజిపి కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల  ఐలయ్య గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం  అందజేసి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి లడ్డు, ప్రసాదాన్ని అందజేశారు.
న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రములో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి మజీద్, కార్యదర్శి రామదాసు లు మాట్లాడుతూ... న్యాయవాదులపై రోజురోజుకు జరుగుతున్న దాడులకు రక్షణగా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, న్యాయవాదులకు రక్షణగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.