దళిత ఎస్సై మృతికి కారకులను ఉద్యోగం నుండి తొలగించి హత్య నేరం నమోదు చేసి అరెస్టు చేయాలి: తళ్ళమల్ల హసేన్ మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
![]()
అశ్వరావుపేట సిఐ జితేందర్ రెడ్డి, మరో ఐదుగురు కానిస్టేబుల్, కుల అహంకారానికి అవమానానికి గురై, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన శ్రీరాముల శ్రీనివాసు మృతి చెందారు. *ఈ విషయం పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించాలని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తల్లమల్ల హసేన్,రాష్ట్ర కార్యదర్శి దాసరి దేవయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బోయల అఖిల్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నామా వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల నరసయ్య ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు*. సీఐ జితేందర్ రెడ్డి కుల వివక్ష అహంకారంతో, ఎస్సై శ్రీరాముల శ్రీను ను అవమానించినట్లు ఇటీవల టీవీ చానల్స్ పత్రికలలో వార్తలు వచ్చాయి సిఐ జితేందర్ రెడ్డి, తన వద్ద పనిచేస్తున్న, ఐదుగురు కానిస్టేబుల్ వేధింపులు కుల వివక్ష కారణంగా,ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ అశ్వారావు పేట (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) ఎస్సై శ్రీరాములు శ్రీను (38) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. జూన్ 30న మహబూబ్‌నగర్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు. దళిత వర్గానికి చెందిన ఎస్సై శ్రీరాముల శ్రీను ను అవమానించి ఆత్మహత్యకు కారకుడైన,సీఐ జితేందర్ రెడ్డి, పోలీస్ కానిస్టేబుళ్లు సన్యాసినాయుడు, సుభాని, శేఖర్, శివనాగరాజు, ఉమెన్ పీసీ నాగరాణి,పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు హత్య నేరం కింద అరెస్టు అరెస్టు ఉద్యోగాల నుండి తొలగించాలి శ్రీరాముల శ్రీను,కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి ఎస్సై శ్రీరాములు శ్రీను భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


భువనగిరి మండలం నమాత్ పల్లి గ్రామంలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ప్రజా సమస్యలపై ప్రభుత్వం వెంటనే గ్రామంలో ధ్వంసమైన ఎస్సీ కాలనీలో అంతర్గత సిసి రోడ్లు నిర్మించాలని, నమాత్ పల్లి టు తుక్కాపూర్ వెళ్లే దారిని BT రోడ్డు వేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, మండల కార్యదర్శిలు మాటూరు బాలరాజు గౌడ్, దయ్యాల నరసింహలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోవారు మాట్లాడుతూ గ్రామంలో 25 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎస్సీ కాలనీ అంతర్గత సిసి రోడ్లు పూర్తిగా గుంతల మయoమై ధ్వంసం అయ్యాయని ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై ఎమ్మెల్యే కుంభoఅనిల్ కుమార్ రెడ్డి గారు, అధికారులు తక్షణమే స్పందించి ఇస్ట్ మెంట్ వేసి సిసి రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే నమాత్ పల్లి TOతుక్కాపూర్ రోడ్డు బీటీ రోడ్డు మంజూరు చేయాలని వంగాల ఎల్లయ్య బావి వద్ద పెద్ద ఎత్తున గుంతల మయం అయిందని తక్షణమే మట్టి పోసి మరమ్మతులు చేయాలని అన్నారు. అలాగే గ్రామంలో కోళ్ల ఫారాల వ్యర్ధాలు తిని వీధి కుక్కలు మనుషులను పశువులపై దాడి చేస్తున్నాయని వాటిని అరికట్టాలని, రోడ్ల వెంబడి పేరుకుపోయిన చెత్తాచెదారం పరిష్కరించి దోమల మందు పిచికారి చేయాలని, సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అక్కడక్కడ వీధిలైట్లు పోయాయని లైట్లు వేయాలని అధికారులను కోరారు. ప్రజా సమస్యలపై జరగబోయే తాసిల్దార్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని కార్యకర్తలను ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి ఎల్లంల వెంకటేశం, మండల కమిటీ సభ్యులు జిట్టా అంజిరెడ్డి, వికలాంగుల సంఘం జిల్లా నాయకులు సుప్పంగ ప్రకాష్, సిపిఎం నాయకులు బత్తిని దానయ్య గౌడ్, ఐతరాజు కిష్టయ్య, బీనబోయిన ముత్యం ప్రకాష్ గ్రామ రైతులు, మహిళలు పాల్గొన్నారు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామంలో ఆదివారం జై భీమ్ సేన ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద న్యూస్ పేపర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జై భీమ్ సేన అధ్యక్షులు వల్లమల్ల రత్నయ్య మాట్లాడుతూ... గోపరాజు పల్లి గ్రామంలో గ్రామ ప్రజల సౌకర్యార్థం వార్తాపత్రికను ప్రతిరోజు జై భీమ్ సేన ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుందని అన్నారు. గ్రామంలోని పాఠకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ సేన గౌరవ అధ్యక్షులు సంగిశెట్టి సుందర్ రావు, కారోబార్ వనం జనార్ధన్ ,గ్రామ పెద్దలు పాలకూర్ల యాదయ్య, ఏనుగుల గంగయ్య పైళ్ళ యాదయ్య, సంగిశెట్టి కిష్టయ్య,గ్రామ నాయకులు ఏనుగుల సత్తయ్య , పొల బోయిన శేఖర్ ,మేడి కుమార్, సేన ఆర్గనైజింగ్ సెక్రటరీ నీలం నరేందర్ కుమార్, జనరల్ సెక్రెటరీ సంగిశెట్టి విజయ్ కుమార్ పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా:దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా శనివారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల సంఘం అధ్యక్షులు పోకల సాయికుమార్ భువనగిరిలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. దళితుల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించి హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తినని కొనియాడారు. ప్రతి ఒక్కరు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న ప్రకారం వికలాంగుల పెన్షన్ నాలుగు వేల నుండి ఆరు వేలకు, ఇతర పెన్షన్లు రెండు వేల నుండి నాలుగు వేలకు పెంచుతూ తీర్మానం చేసి, వెంటనే పెంచిన పెన్షన్లు ఇవ్వాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ధరణికోట నర్సింహ డిమాండ్ చేశారు. మహాజన నేత మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, అడిషనల్ కలెక్టర్ గంగాధర్ కు వినతిపత్రం అందజేశారు. వికలాంగుల ధర్నా కు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు ధరణికోట నర్సింహ మాట్లాడుతూ వికలాంగుల హక్కుల చట్టం -2016 ను రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేయాలని, వికలాంగుల శాఖ కు స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో వికలాంగులకు 5 శాతం బడ్జెట్ కేటాయించి , ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఎస్ కె షబ్బీర్, అనంతుల ఎల్లారెడ్డి ఎర్ర వీరన్న, బర్రె శంకర్, జిల్లా నాయకులు జాగిల్లాపురం అయిలయ్య, మచ్చ ఉపేందర్, సింగారం రమేష్, ధనుంజయ,లాలయ్య, కరుణాకర్,ఇప్పల రమేష్, వెంకట రమణ, యూనిస్ తదితరులు పాల్గొన్నారు.
Jul 08 2024, 07:06
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.9k