/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz తమిళనాడు రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడి దారుణ హత్య, ప్రభుత్వమే బాధ్యత వహించి దోషులను కఠినంగా శిక్షించాలి : మేడి ప్రియదర్శిని Vijay.S
తమిళనాడు రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడి దారుణ హత్య, ప్రభుత్వమే బాధ్యత వహించి దోషులను కఠినంగా శిక్షించాలి : మేడి ప్రియదర్శిని

బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్మ్‌స్ట్రాంగ్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలనీ బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి ప్రియదర్శిని డిమాండ్ చేశారు. పెరంబూర్‌లోని తన ఇంటి సమీపంలో కొందరు పార్టీ కార్యకర్తలతో ఆర్మ్‌స్ట్రాంగ్ మాట్లాడుతుండగా, ఆరుగురు దుండగులు దాడి చేశారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు పదునైన ఆయుధాలతో ఆర్మ్‌స్ట్రాంగ్‌ను నరికి చంపి పరారయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా, అప్పటికే ఆర్మ్‌స్ట్రాంగ్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గతేడాది ఆర్కాట్ సురేష్ అనే గ్యాంగ్‌స్టర్ హత్యకు ఆర్మ్‌స్ట్రాంగ్‌కు సంబంధం ఉందని, ప్రతీకార కోసమే హత్యే అయ్యుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను మేడి ప్రియదర్శిని తీవ్రంగా ఖండించారు. స్టాలిన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని మండిపడ్డారు. హత్యపై స్పందించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆర్మ్‌స్ట్రాంగ్‌ను దళితుల బలమైన గొంతుగా అభివర్ణించారు. దోషులను కఠినంగా శిక్షించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో బిజెపి అధికారం లోకి వచ్చాక మత పరమైన, కుల వివక్షతో కూడిన హత్యలు పెరిగాయని, ప్రశ్నించే వారిపై దాడులు, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ లపై, మహిళలపై దాడులు పెరిగాయన్నారు.ఇలాంటి ఘటనలు అణిచివేసి, నేరస్థులను శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయ స్థానాలు కూడా ఇలాంటి ఘటనలు కేసులను వేగంగా విచారణ జరిపించలన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ కి నివాళులర్పించిన పోకల సాయికుమార్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల సంఘం అధ్యక్షులు


యాదాద్రి భువనగిరి జిల్లా:దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా శనివారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల సంఘం అధ్యక్షులు పోకల సాయికుమార్ భువనగిరిలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. దళితుల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించి హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తినని కొనియాడారు. ప్రతి ఒక్కరు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు.
భువనగిరి: సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు, పట్టించుకోని పాలకులు: సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ

హన్మాపురం గ్రామంలోరాత్రిపూట వీధిలైట్లు లేక చిమ్మ చీకటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఎక్కడికక్కడ గడ్డి పెరిగి దోమలతో విష జ్వరాలతో ఇబ్బందులు పడుతూ, తాగడానికి కూడా సరైన నీరు రాక సమస్యలు వినే నాథుడు లేక పట్టించుకునే అధికారులు లేక గ్రామపంచాయతీ పాలన ముగిసి ఇంచార్జి పాలనతో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ ఆవేదన వెలిబుచ్చారు. సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం గ్రామంలో సిపిఎం శాఖ ఆధ్వర్యంలో వార్డు వార్డు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ పాలక వర్గం లేకపోవడంతో ప్రజా సమస్యలను పట్టించుకోని నాధుడే లేకుండా పోయాడని గ్రామంలో ఎక్కడ చూసిన సమస్యలే స్వాగతం పలుకుతున్నాయని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో మంచినీళ్ల సమస్య, వీధిలైట్ల సమస్య, దోమల బెడద, రోడ్లు, డ్రైనేజీ లాంటివి పెద్ద ఎత్తున ఉన్నాయని వాటిని తీర్చడానికి వెంటనే గ్రామ సభ సమావేశాన్ని నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక అధికారి కృషి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా తాను ఇచ్చిన హామీలలో ముఖ్యమైనవి ఇల్లు స్థలాలు రేషన్ కార్డులు పెన్షన్లు తక్షణం లేని వారందరికీ ఇవ్వాలని, భూమిలేని పేదలందరికీ కూడా ఆర్థిక సహాయం అందిస్తానన్న ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకుని అమలు చేయాలని కోరారు. గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం వారం రోజుల లోపు అధికారులు చర్యలు తీసుకోకపోతే సిపిఎం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ముందు ఆందోళన చేపడతామని నర్సింహ హెచ్చరించారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి మోటె ఎల్లయ్య, నాయకులు రాగాల రాజేశ్వర్, తోటకూరి నాగరాజు, కుసుమ మధు, గ్రామ ప్రజలు రంగా నారాయణ, చందుపట్ల మల్లయ్య, మూడుగుల ఎల్లయ్య, తుమ్మేటి అంజయ్య, బుచ్చాల కొండలు, మూడుగుల నరసింహ, నాయిని బాలయ్య, శ్రీను, నరసింహ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లు దయ్యాల నర్సింహ్మ సిపిఎం మండల కార్యదర్శి
వికలాంగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: ధరణికోట నరసింహ వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు


తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న ప్రకారం వికలాంగుల పెన్షన్ నాలుగు వేల నుండి ఆరు వేలకు, ఇతర పెన్షన్లు రెండు వేల నుండి నాలుగు వేలకు పెంచుతూ తీర్మానం చేసి, వెంటనే పెంచిన పెన్షన్లు ఇవ్వాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ధరణికోట నర్సింహ డిమాండ్ చేశారు. మహాజన నేత మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, అడిషనల్ కలెక్టర్ గంగాధర్ కు వినతిపత్రం అందజేశారు. వికలాంగుల ధర్నా కు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు ధరణికోట నర్సింహ మాట్లాడుతూ వికలాంగుల హక్కుల చట్టం -2016 ను రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేయాలని, వికలాంగుల శాఖ కు స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో వికలాంగులకు 5 శాతం బడ్జెట్ కేటాయించి , ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఎస్ కె షబ్బీర్, అనంతుల ఎల్లారెడ్డి ఎర్ర వీరన్న, బర్రె శంకర్, జిల్లా నాయకులు జాగిల్లాపురం అయిలయ్య, మచ్చ ఉపేందర్, సింగారం రమేష్,  ధనుంజయ,లాలయ్య, కరుణాకర్,ఇప్పల  రమేష్, వెంకట రమణ, యూనిస్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి AIYF జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ అర్ధరాత్రి అక్రమ అరెస్ట్


యాదాద్రి భువనగిరి AiYF జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ ని అర్ధరాత్రి అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని శుక్రవారం  విద్యార్థి , యువజన నాయకులపై రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి సమయాన అరెస్టులు కొనసాగించడం జరిగినది.ఎలాంటి ముట్టడి, బందు పిలుపులు లేకున్నా... విద్యార్థి ,యువజన సంఘాల నాయకుల రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి సమయాన అరెస్టులు చేయడం జరిగినది .రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో స్నేహ పూరితం ఉన్నప్పటికీ AiYF, AiSF నాయకులను వాళ్ల ఇంటి వద్ద నుండి... అక్రమంగా అర్ధరాత్రి అరెస్టులు చేసినారు.ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్, ఎర్ర కిరణ్ మేడి దేవేందర్ లు తెలిపారు.
కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న వలిగొండ మండల బిజెపి, బీజేవైఎం నాయకుల అక్రమ అరెస్ట్

బీజేవైఎం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం  కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్నా వలిగొండ మండలం బీజేపీ, బీజేవైఎం నాయకులని అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. వలిగొండ బీజేపీ మండల అధ్యక్షులు బోల్ల సుదర్శన్ మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించమని కలెక్టర్ కార్యాలయం ధర్నాకు వెళ్తున్న నాయకులను ఈ చాతగాని కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్యగా భావిస్తూ ,అధికారంలోనికి వచ్చి 7 నెలలు పూర్తవుతున్న , జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని ఎన్నికల మానిఫెస్టోలో పెట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను ఇలా మోసం చేస్తున్నారని అన్నారు , ఈ చేతగాని ప్రభుత్వం కొనసాగడానికి అర్హత లేదు ఈ ప్రభుత్వం మీద కొట్లాడడానికి బీజేపీ ,బీజేవైఎం నిరంతరం పోరాడుతూనే ఉంటుంది అని ఈ సందర్బంగా వారు అన్నారు, అరెస్ట్ అయిన బీజేపీ, బీజేవైఎం వలిగొండ మండలం నాయకులు అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది,పోలీస్ స్టేషన్లో నిరసనలు తెలుపడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ , బీజేవైఎం నాయకులు కనతల అశోక్ రెడ్డి,మందుల నాగరాజు,దయ్యాల వెంకటేష్, బర్ల మల్లేశం, పాతకోట నరేష్ అవనగంటి శివ మైసొల్ల హరీష్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు
వలిగొండ మండల వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతం: ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్


ఎస్ఎఫ్ఐ,ఏఐఎస్ఎఫ్ వలిగొండ మండల కమిటీలు* *గురువారం రోజున దేశవ్యాప్త విద్యాసంస్థల బందులో భాగంగా వలిగొండ మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాలలో ఎస్ఎఫ్ఐ బంద్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వలిగొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు వెల్లంకి మహేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మెడికల్ విద్యార్థుల నిర్వహించే ప్రవేశ పరీక్షలలో జరిగిన అవగాహన నిరసిస్తూ జాతీయ పరీక్షల సమగ్రతలను కాపాడాలని అన్నారు కేంద్ర రాష్ట్ర విద్యా సంస్థలలో ఎన్డీఏ ను రద్దు చేయాలని నేటి యూజీసీ నెట్ టిఆర్ఎస్ కంబైన్డ్ నెట్ ఒకటోగులపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి జాతీయ పరీక్షల సమగ్రత కృషి చేయాలని కాపాడాలని ఉమ్మడి జాబితాలోని అంశమైన విద్యా పై రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను లాగేసుకొని విద్య పూర్తి నియంత్రణ కోసం యత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించాలని అన్నారు మరియు నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని దేశంలో పాఠశాలల మూసివేతనువిరమించుకోవాలన్నారు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీకి నియంత్రణ చట్టం తెచ్చి, అధిక ఫీజులను నియంత్రణ చేయాలని విద్యారంగ పరిరక్షణకై తీసుకున్న కార్యాచరణలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేయడం జరిగిందిబందులో భాగంగా పులిగిల్ల,గోకారం,అరూరు,సంగెం గ్రామాలలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్ ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు ఎండి ఫర్దిన్ పట్టణ అధ్యక్షులు మైసోల్ల నరేందర్,మండల సహాయ కార్యదర్శి వేములకొండ వంశీ చెరుక సుదర్శన్ యాసోబు ఏఐఎస్ఎఫ్ మండల కన్వీనర్ బైకాని గణేష్, ఏఐవైఎఫ్.. ఏఐఎస్ఎఫ్ నాయకులు మేడి దేవేందర్, సంగి కృష్ణ , అనిల్ రెడ్డి ,మహేష్ తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు*
మోత్కూరు : విద్యార్థి యువజన సంఘాలు చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతం

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి లను భర్తరఫ్ చేయడంతో పాటు నీట్ పరీక్ష ఫలితాలను తక్షణమే రద్దు చేసి పరీక్షను మళ్ళీ నిర్వహించడంతో పాటు అభ్యర్థులకు సరైన న్యాయం చేయాలని, ప్రవేశ పరీక్షల్లో విఫలమైన ఎన్‌టీఏ ను రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్న నీట్, యూజీసీ-నెట్ లీకేజీల వ్యవహారాన్ని సీబీఐ చేత కాకుండా సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్రమైన విచారణ చేపట్టాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నాడు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ ఎస్ యు ఐ ఏఐవైఎఫ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయంతమైంది. జిల్లా లోని మోత్కూర్ మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల విద్యాసంస్థల తరగతులు బహిష్కరించారు. ఈ సందర్బంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జగ్జీవన్ రావ్ సెంటర్ లో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి లీకైన నీట్ యోజేసినట్టు ప్రశ్న పత్రాలను దగ్ధం చేశారు. ఈ రాస్తారోకో నుద్దేశించి విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ మరియు యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీకేజీ ల వల్ల దేశంలో సుమారు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని, నీట్ మరియు నెట్ వంటి ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్షల పేపర్ లీకేజీల ఉదాంతం రోజురోజుకు పెరిగి పెద్దదవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు బీహార్ పోలీసులు 14మందిని అరెస్టు చేశారని, అదేవిధంగా మరికొంత మందికి నోటీసులు జారీచేసి సీబీఐ విచారణ అని చేతులు దులుపుకున్నారే తప్ప ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ దర్యాప్తు ఇంతవరకు చేయలేదని మండి పడ్డారు. గత ఏడేళ్లలో బిజెపి పాలిత రాష్ట్రాలలో సుమారు 70 ప్రవేశ, పోటీ పరీక్షల పేపర్స్ లీకేజీ అయ్యాయని, దీనివల్ల 1.7 కోట్ల మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారాయని, మరోవైపు వెలుగులోకి రాని లీకేజీలు ఇంకెన్నో ఉన్నాయని విమర్శించారు. పేపర్ లీకేజీల వల్ల విద్యార్థులకు, నిరుద్యోగ అభ్యర్థులకు పోటీ మరియు ప్రవేశ పరీక్షల పై ఉన్న విశ్వసనీయత, నమ్మకం దెబ్బతింటుందని, నీట్ మరియు నెట్ పేపర్స్ లీకేజి వల్ల నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయమంటే కేంద్ర ప్రభుత్వం తమ తప్పును కప్పి పుచ్చుకోవడం కోసం "ది నోటిఫికేషన్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్" చట్టాన్ని తీసుకొస్తున్నట్టు ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. తక్షణమే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి లను భర్తరఫ్ చేసి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) రద్దు చేయడంతో పాటు నీట్ ప్రవేశ పరీక్షను తిరిగి నిర్వహించాలని, అదేవిధంగా నీట్, యూజీసీ-నెట్ పేపర్ లీకేజి కేసు పై సుప్రీం కోర్టు జడ్జితో సమగ్రమైన దర్యాప్తు జరిపించి దోషులను కటినంగా శిక్షించాలని, ఎన్.టీ.ఏ నిర్వాకం వల్ల నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రుఅనిల్ , యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సురేష్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు శ్రీను ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాంపాక చందు ఎస్ఎఫ్ఐ నాయకులు చింటు ఏఐవైఎఫ్ నాయకులు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రయాణికులకు అసౌకర్యంగా మారిన భువనగిరి ఆర్టీసీ బస్ స్టేషన్, సౌకర్యాలు మెరుగుపరచాలని lవినియోగదారుల డిమాండ్

భువనగిరి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ అసౌకర్యాలకు నిలయంగా మారిందని అధికారులు చర్యలు తీసుకొని సౌకర్యాలు మెరుగు పరచాలని వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిత్యం వేలాదిమంది ప్రజలు భువనగిరి బస్ స్టేషన్ ద్వారా వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారని, ప్రతి రోజూ సుమారు నలబై డిపోలకు చెందిన బస్సులు బస్సులు భువనగిరి బస్ స్టేషన్ కు వచ్చిపోతుంటాయని ఆయన అన్నారు.తెలంగాణ ఆర్టీసీ అధికారులు మాత్రం భువనగిరి బస్ స్టేషన్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన అన్నారు. ప్రయాణికులకు తాగు నీరు సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం, మంచి క్యాంటీన్ సౌకర్యం, బస్ స్టేషన్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో అధికారుల అలసత్వం ఎక్కువగా ఉందని ఆయన ఆరోపిస్తున్నారు.భువనగిరి బస్ స్టేషన్ లోపల ఉన్న దుకాణాలు తొలగించి, ప్రయాణికుల సౌకర్యార్థం వేరే ప్రదేశంలో ఏర్పాటు చేయాలని గతంలో ఎన్నోసార్లు వినియోగదారుల సంఘాల ప్రతినిధులు విన్నవించినా , ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని కొడారి వెంకటేష్ అన్నారు. ముఖ్యంగా నల్లగొండ వైపు వెళ్లే దారిలో వచ్చే దుర్వాసనతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యంగా ఉందని, అలాగే నల్లగొండ వెళ్ళే వైపు ఉన్న కార్గో సెంటర్ ను ఏకంగా బస్ స్టేషన్లో ఏర్పాటు చేసారని, కార్గో వస్తువులు బస్ స్టేషన్లో అడ్డదిడ్డంగా పడి వేయడంతో ప్రయాణికులకు అసౌకర్యంగా మారిందని ఆయన అన్నారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రైవేటు వాహనాలకు బస్ స్టేషన్ లోనికి అనుమతి లేకున్నా, అధికసంఖ్యలో ఆటోలకు బస్ స్టేషన్లో అడ్డాగా మారిందని ఆయన అన్నారు. ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగు పరచాలని లేనిచో ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

వలిగొండ: త్రిబుల్ ఆర్ బాధితులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు పరచాలి : సిపిఎం డిమాండ్

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటి ఎంపీ నేటి స్థానిక జిల్లా మంత్రి భువనగిరి ఎమ్మెల్యే, ఎంపీ లు త్రిబుల్ ఆర్ బాధితులకు మేము అధికారంలోకి వస్తే అలైన్మెంట్ ను మారుస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు* *గత ప్రభుత్వం త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం కోసం ముందు చేసిన అలైన్మెంట్ను మార్చి చిన్న సన్నకారు రైతులకు చెందిన భూములను కోల్పోయే విధంగా రోడ్డు నిర్మాణం కోసం చేర్పులు, మార్పులు చేసిందన్నారు దీనిపై భూ నిర్వాసితులతో పాటు రైతు సంఘాలు సంస్థలు అనేక రాజకీయ పార్టీలు ఆందోళన నిర్వహించాయన్నారు నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేటి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మమ్మల్ని ఎమ్మెల్యే ఎంపీలుగా గెలిపిస్తే త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను మారుస్తామని చెప్పి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారా? లేదో దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు* *మండల పరిధిలోని వర్కట్ పల్లి,గోకారం,పహిల్వాన్ పురం,పొద్దుటూర్,రెడ్ల రేపాక ఐదు గ్రామాల్లో ఈ రోడ్డు రావడంతో అనేకమంది చిన్న సన్నకారు రైతులు తమ భూములు కోల్పోవాల్సి వస్తుందన్నారు మరొకపక్క చౌటుప్పల్ ఆర్డీవో జంక్షన్ల కోసం 103 ఎకరాలు భూసేకరణ చేయాల్సి వస్తుందని దీనికి ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిందని ప్రకటించారన్నారు రైతులు భూములు ఇవ్వమని తెగేసి చెబుతున్న మళ్లీ రైతులతో ఆర్డీవోల పరిధిలో అభిప్రాయ సేకరణ చేయాలని పాస్ పుస్తకాలు మిగతా డాక్యుమెంట్లు తీసుకురావాలని అధికారులు ఆదేశించడం ఏమిటని ప్రశ్నించారు ఇప్పటికైనా స్థానిక జిల్లా మంత్రి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు వెంటనే స్పందించాలని అలైన్మెంట్ను మార్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.