ఈ రోజు పంచాంగం జులై 06, 2024
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
ఈ రోజు పంచాంగం
జులై 06, 2024
విక్రమ సంవత్సరం: 2081 పింగళ
శక సంవత్సరం: 1946 క్రోధి
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: గ్రీష్మ
మాసం: ఆషాఢ
పక్షం: శుక్ల - శుద్ధ
తిథి: పాడ్యమి రా.తె.04:07 వరకు
తదుపరి విదియ
వారం: శనివారం - మందవాసరే
నక్షత్రం: పునర్వసు రా.తె.05:13 వరకు
తదుపరి పుష్యమి
యోగం: వ్యాఘత రా.03:45 వరకు
తదుపరి హర్షణ
కరణం: కింస్తుఘ్న సా.04:11 వరకు
తదుపరి బవ రా.తె.04:07 వరకు
తదుపరి బాలవ
వర్జ్యం: సా.04:57 - 06:35 వరకు
దుర్ముహూర్తం: ఉ.05:46 - 07:26
రాహు కాలం: ఉ.09:04 - 10:42
గుళిక కాలం: 05:46 - 07:26
యమ గండం: ప.01:59 - 03:37
అభిజిత్: 11:54 - 12:46
సూర్యోదయం: 05:46
సూర్యాస్తమయం: 06:54
చంద్రోదయం: ఉ.పూ.05:49
చంద్రాస్తమయం: రా.07:32
సూర్య సంచార రాశి: మిథునం
చంద్ర సంచార రాశి: మిథునం
దిశ శూల: తూర్పు
గుప్త - వారాహి - శాకంబరి
- గుహ్య - ఆషాఢ నవరాత్రారంభం
పునర్వసు కార్తె
శ్రీ టెంబెస్వామి పుణ్యతిథి
శుక్రమౌఢ్య నివృత్తి
మహాకవి కాళిదాసు
పుణ్యతిథి
ఆషాఢ స్నానారంభం
అమృతలక్ష్మి వ్రతారంభం
పూరి జగన్నాథ నేత్రోత్సవం -
జగన్నాథ దర్శనారంభం
కంచి జగద్గురు శ్రీ
సచ్చిదానన్దఘనేన్ద్ర సరస్వతి
స్వామి పుణ్యతిథి
భగవంత్ మహారాజ్
పుణ్యతిథి
పూరీ గుండీచా మందిర
మార్జనోత్సవం
ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గా
దేవి అషాఢమాసోత్సవారంభం



తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ నిన్న 04-07-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,826 మంది... స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... 27,530 మంది... నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.23 కోట్లు ... ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట ATC వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు... ఉచిత సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం... టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.... టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 5 గంటల సమయం... 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం...
మేషం వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. వృషభం కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. మిధునం నూతన రుణాలు చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య ససమ్యలు చికాకు పరుస్తాయి. కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కర్కాటకం ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సింహం నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కన్య ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి. గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. తుల బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికామౌతుంది. వృశ్చికం చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ధనస్సు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మకరం వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. కుంభం ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు. కొన్నిపనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. మీనం చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
కలియుగం: 5126
తిరుమల శ్రీవారికి నివేదించే అన్నప్రసాదంపై వస్తున్న అవాస్తవ విషయాలను భక్తులు నమ్మవద్దని టీటీడీ అధికారులు కోరారు.
హుస్సేన్ సాగర్ కు సెయిలింగ్ పోటీలు కొత్త సొబగులు అద్దుతున్నాయి. సాగర జలాల్లో అందమైన తెరచాపలపై అద్భుతమైన విన్యాసాలతో సెయిలర్లు ఆకట్టుకుంటున్నారు.
Jul 06 2024, 09:17
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.5k