మోత్కూరు : విద్యార్థి యువజన సంఘాలు చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతం
![]()
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి లను భర్తరఫ్ చేయడంతో పాటు నీట్ పరీక్ష ఫలితాలను తక్షణమే రద్దు చేసి పరీక్షను మళ్ళీ నిర్వహించడంతో పాటు అభ్యర్థులకు సరైన న్యాయం చేయాలని, ప్రవేశ పరీక్షల్లో విఫలమైన ఎన్‌టీఏ ను రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్న నీట్, యూజీసీ-నెట్ లీకేజీల వ్యవహారాన్ని సీబీఐ చేత కాకుండా సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్రమైన విచారణ చేపట్టాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నాడు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ ఎస్ యు ఐ ఏఐవైఎఫ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయంతమైంది. జిల్లా లోని మోత్కూర్ మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల విద్యాసంస్థల తరగతులు బహిష్కరించారు. ఈ సందర్బంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జగ్జీవన్ రావ్ సెంటర్ లో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి లీకైన నీట్ యోజేసినట్టు ప్రశ్న పత్రాలను దగ్ధం చేశారు. ఈ రాస్తారోకో నుద్దేశించి విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ మరియు యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీకేజీ ల వల్ల దేశంలో సుమారు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని, నీట్ మరియు నెట్ వంటి ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్షల పేపర్ లీకేజీల ఉదాంతం రోజురోజుకు పెరిగి పెద్దదవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు బీహార్ పోలీసులు 14మందిని అరెస్టు చేశారని, అదేవిధంగా మరికొంత మందికి నోటీసులు జారీచేసి సీబీఐ విచారణ అని చేతులు దులుపుకున్నారే తప్ప ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ దర్యాప్తు ఇంతవరకు చేయలేదని మండి పడ్డారు. గత ఏడేళ్లలో బిజెపి పాలిత రాష్ట్రాలలో సుమారు 70 ప్రవేశ, పోటీ పరీక్షల పేపర్స్ లీకేజీ అయ్యాయని, దీనివల్ల 1.7 కోట్ల మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారాయని, మరోవైపు వెలుగులోకి రాని లీకేజీలు ఇంకెన్నో ఉన్నాయని విమర్శించారు. పేపర్ లీకేజీల వల్ల విద్యార్థులకు, నిరుద్యోగ అభ్యర్థులకు పోటీ మరియు ప్రవేశ పరీక్షల పై ఉన్న విశ్వసనీయత, నమ్మకం దెబ్బతింటుందని, నీట్ మరియు నెట్ పేపర్స్ లీకేజి వల్ల నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయమంటే కేంద్ర ప్రభుత్వం తమ తప్పును కప్పి పుచ్చుకోవడం కోసం "ది నోటిఫికేషన్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్" చట్టాన్ని తీసుకొస్తున్నట్టు ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. తక్షణమే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి లను భర్తరఫ్ చేసి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) రద్దు చేయడంతో పాటు నీట్ ప్రవేశ పరీక్షను తిరిగి నిర్వహించాలని, అదేవిధంగా నీట్, యూజీసీ-నెట్ పేపర్ లీకేజి కేసు పై సుప్రీం కోర్టు జడ్జితో సమగ్రమైన దర్యాప్తు జరిపించి దోషులను కటినంగా శిక్షించాలని, ఎన్.టీ.ఏ నిర్వాకం వల్ల నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రుఅనిల్ , యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సురేష్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు శ్రీను ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాంపాక చందు ఎస్ఎఫ్ఐ నాయకులు చింటు ఏఐవైఎఫ్ నాయకులు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
![]()


ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటి ఎంపీ నేటి స్థానిక జిల్లా మంత్రి భువనగిరి ఎమ్మెల్యే, ఎంపీ లు త్రిబుల్ ఆర్ బాధితులకు మేము అధికారంలోకి వస్తే అలైన్మెంట్ ను మారుస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు* *గత ప్రభుత్వం త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం కోసం ముందు చేసిన అలైన్మెంట్ను మార్చి చిన్న సన్నకారు రైతులకు చెందిన భూములను కోల్పోయే విధంగా రోడ్డు నిర్మాణం కోసం చేర్పులు, మార్పులు చేసిందన్నారు దీనిపై భూ నిర్వాసితులతో పాటు రైతు సంఘాలు సంస్థలు అనేక రాజకీయ పార్టీలు ఆందోళన నిర్వహించాయన్నారు నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేటి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మమ్మల్ని ఎమ్మెల్యే ఎంపీలుగా గెలిపిస్తే త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను మారుస్తామని చెప్పి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారా? లేదో దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు* *మండల పరిధిలోని వర్కట్ పల్లి,గోకారం,పహిల్వాన్ పురం,పొద్దుటూర్,రెడ్ల రేపాక ఐదు గ్రామాల్లో ఈ రోడ్డు రావడంతో అనేకమంది చిన్న సన్నకారు రైతులు తమ భూములు కోల్పోవాల్సి వస్తుందన్నారు మరొకపక్క చౌటుప్పల్ ఆర్డీవో జంక్షన్ల కోసం 103 ఎకరాలు భూసేకరణ చేయాల్సి వస్తుందని దీనికి ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిందని ప్రకటించారన్నారు రైతులు భూములు ఇవ్వమని తెగేసి చెబుతున్న మళ్లీ రైతులతో ఆర్డీవోల పరిధిలో అభిప్రాయ సేకరణ చేయాలని పాస్ పుస్తకాలు మిగతా డాక్యుమెంట్లు తీసుకురావాలని అధికారులు ఆదేశించడం ఏమిటని ప్రశ్నించారు ఇప్పటికైనా స్థానిక జిల్లా మంత్రి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు వెంటనే స్పందించాలని అలైన్మెంట్ను మార్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Jul 04 2024, 18:59
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.5k