/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Delhi CM: లిక్కర్ కేసు డబ్బులు ఎక్కడున్నాయో.. రేపు కోర్టులోనే వెల్లడిస్తారు.. కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు Yadagiri Goud
Delhi CM: లిక్కర్ కేసు డబ్బులు ఎక్కడున్నాయో.. రేపు కోర్టులోనే వెల్లడిస్తారు.. కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిన్న ఈడీ కస్టడీలో ఉన్న తన భర్త కేజ్రీవాల్‌ను కలిశానని చెప్పారు..

లిక్కర్ కేసు డబ్బు ఎక్కడ ఉందో రేపు కేజ్రీవాల్ కోర్టులో దేశ ప్రజలకు చెబుతారన్నారు. దాని ఆధారాలు బయటపెడతారని ఆమె తెలిపారు.

కేజ్రీవాల్‌కు డయాబెటిస్ ఉందని, షుగర్ లెవల్స్ సరిగ్గా లేవన్నారు. గడిచిన రెండేళ్లలో ఈడీ 250 పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిందని ఒక్క పైసా దొరలేకదన్నారు.

మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్ నివాసంలో ఎలాంటి డబ్బులు దొరకలేదని సునీతా కేజ్రీవాల్ తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడన్నారు. తన శరీరం జైల్లో ఉన్నా.. ఆత్మ ప్రజల్లోనే ఉందని వెల్లడించారు.

రేపు కోర్టు ముందుకు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ఈనెల 21వ తేదీన అరెస్ట్ చేశారు. 22న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. ఆయనకు న్యాయస్థానం 6 రోజుల ఈడీ కస్టడీకి విధించింది. ఈరోజుతో ఈడీ కస్టడీ ముగుస్తుంది. రేపు కేజ్రీవాల్‌ను కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్‌ను మరో ఐదు రోజులు ఈడీ అధికారులు కస్టడీకి అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..

ప్రధాని మోడీ నివాసం వద్ద నేడు ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నా

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవా ల్‌ అరెస్టుకు నిరసనగా

ఆమ్ ఆద్మీ పార్టీ మంగళ వారం ప్రధాని మోడీ నివాసం వద్ద నిరసన చేపట్టనుంది.

దీంతో ఢిల్లీ పోలీసులు ప్రధాని నివాసం వద్ద భద్ర తను పటిష్టం చేశారు.

దేశ రాజధానిలోని పలు ప్రాంతా ల్లో కూడా పోలీసులు భద్రత ను పెంచారు.

నిరసనల కారణంగా న్యూఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో రాకపోక లపై ఆంక్షలు విధించే అవ కాశం ఉందని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు..

ఎమ్మెల్సీ కవితకు నేడు ముగియనున్న ఈడీ కస్టడీ

ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ మంగళవారంతో ముగియ నున్నది.

దీంతో ఈడీ అధి కారులు బుధవారం ఉద యం 11.00 గంటలకు ఆమెను ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ లోని ప్రత్యేక కోర్టులో హాజ రుపరుచనున్నారు.

ఈసందర్భంగా ఈడీ తనను అక్రమంగా అరెస్ట్‌ చేసిందని కవిత మరోమారు న్యాయ స్థానానికి తెలియజేయ నున్నారు. కేవలం రాజకీయ కక్షతో నమోదైన కేసు అని వివరించనున్నారు.

తనను విడుదల చేయాలని కోరనున్నారు. ఈడీ అధికా రులు ఈ నెల 15న కవిత ను అరెస్ట్‌ చేసి 16న కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే.

మొదట వారం రోజులు కస్టడీ విధించిన కోర్టు..23వ తేదీన మరో మూడు రోజులు పొడిగించింది...

కట్టుదిట్టంగా ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్

ఫిబ్రవరి 28నుండి నిర్వ హించిన ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో దానికి సంబంధించిన

ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్‌ను బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది.

వాల్యూయేషన్ కేంద్రాల్లోకి ఫోన్లను అనుమతించకూ డదని ఆదేశించింది.

గతం లో సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

రాష్ట్రంలో 16 కేంద్రాల్లో 20 వేల మంది అధ్యాపకులు వాల్యూయేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. నాణ్యమై న మూల్యాంకనం కోసం ఒక్కొక్కరికి రోజుకు 30 పేపర్లు మాత్రమే ఇస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో హోలీ పండగ పూట విషాదాలు

హోలీ పండుగ పూట సోమ వారం పలు కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నా యి.

కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబా బాద్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన వేర్వేరు సంఘట నల్లో ఏడుగురు యువకు లు, ఒక బాలుడు మృతి చెందారు.

సికింద్రాబాద్ కంటోన్మెం ట్ పరిధిలో ద్విచక్ర వాహనా లపై వెళ్తున్న వారిని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.వివరాల్లోకి వెళ్తే..కొమురం భీం ఆసిఫా బాద్ జిల్లా, కౌటాల మండ లం, నదిమాబాద్ గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితు లు సోమవారం ఉదయం హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు.

అనంతరం మధ్యాహ్నం స్నానం చేయడాని కో సం వార్ధా నది వద్దకు వెళ్లారు. వీరిలో ఇద్దరు స్నానం చేసి ఒడ్డుపైకి వచ్చారు. మిగతా నలుగురు నదిలో స్నానం చేస్తూ లోతుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లి గల్లంత య్యారు.

దీంతో నది ఒడ్డున ఉన్న మిగతా ఇద్దరు వెంటనే గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులకు తెలియజేయ డంతో వారు పరుగుపరు గున,వచ్చిగాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు గజ ఈతగాళ్లతో నదిలో గాలించ గా అల్లం సాయి (22), ఉప్పల సంతోష్ (24), ప్రవీణ్ (24), కమలాకర్ (24) అనే నలుగురి మృతదేహా లు లభ్యమయ్యాయి.

మృతులంగా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నా యి. జిల్లా ఎస్‌పి సురేష్‌ కుమార్, డిఎస్‌పి కరుణా కర్, సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

తెలంగాణ లో ముదురుతున్న ఎండలు

రాష్ట్రంలో ఎండలు ముదు రు తున్నాయి. పలు ప్రాంతా ల్లో పగటి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్ముతున్నాయి. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా రికార్డవుతున్నాయి.

రాగల ఐదు రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతా వరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం వేళల్లో పొగముం చు వాతావరణం నెలకునే అవకాశం ఉంది.ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37, కనిష్టంగా 24డిగ్రీలు నమోదయ్యే అవకాశాలున్నాయి.

తరువాత 48గంటల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38డిగ్రీలకు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడిం చింది. రాష్ట్రంలో కూడా సగటు ఉష్ణోగ్రతలు గరిష్టం గా 38నుంచి 41డిగ్రీలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.

రాష్ట్రంలో మంగళవారం ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపిం ది. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, కొమరంభీం, అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, రంగారెడ్డి, పెద్దపల్లి, ములుగు, కరీంనగర్, వరంగల్ జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ జాబితాలో ఉన్నాయి.

ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు పైనే నమోద య్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది....

Kejriwal: నిర్బంధంలో ఉన్న డోంట్ కేర్.. ఫస్ట్ ఆర్డర్ జారీ చేసిన కేజ్రీవాల్

మద్యం కుంభకోణంలో కేసులో అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) నిర్బంధం నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వానికి సంబంధించి తన మొదటి ఉత్తర్వును జలవనరుల శాఖకు జారీ చేశారు..

ఇవాళ సమావేశం నిర్వహించనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి సీఎం ఆదేశాల గురించి సమాచారం ఇవ్వనున్నారు. కేజ్రీవాల్‌ అరెస్టుతో దిల్లీ ప్రభుత్వం ఎలా నడుస్తుందనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది.

కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అనే అనుమానం చాలా మందికి కలిగింది. సీఎం కేజ్రీవాల్ ను జైలుకు పంపితే అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి అనుమతి తీసుకుని ప్రభుత్వాన్ని నడిపేందుకు జైలులోనే కార్యాలయం నిర్మిస్తామని పంజాబ్‌ సీఎం చెప్పారు. పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ స్థానాన్ని ఎవరూ తీసుకోలేరని తెలిపారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా పార్టీని స్థాపించారని గుర్తు చేసుకున్నారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపలేమని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదని, చట్టం ప్రకారం నేరం రుజువయ్యేంత వరకు జైలు నుంచే పని చేయవచ్చని మాన్‌ స్పష్టం చేశారు.

సుమారు 2 గంటల విచారణ జరిపిన అనంతరం మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. అనంతరం కోర్టు కేజ్రీవాల్ కు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి పంపింది. కేజ్రీవాల్ అరెస్టుపై పార్టీ నేతలు భగ్గుమన్నారు. ఈడీని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్టు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కేసులో కేజ్రీవాల్ కంటే ముందు దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా, మాజీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ లను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

టెట్ పరీక్ష కు నార్మలైజేషన్ ఉందా? లేదా? అభ్యర్థుల్లో గందరగోళం

ఉపాధ్యాయ ఉద్యోగస్తులకు నిర్వహించే టీచర్‌ ఎలిజిబి లిటీ టెస్ట్‌ టెట్‌, పలు వివా దాలకు కేంద్రంగా మారుతు న్నది...

ఇప్పటికే ఫీజుల పెంపుతో అభ్యర్థుల నడ్డివిరిచిన సర్కారు.. నోటిఫికేషన్‌లో నార్మలైజేషన్‌పై స్పష్టత ఇవ్వకపోవడం మరో వివాదానికి కారణమైంది. టెట్‌లో నార్మలైజేషన్‌ ఉంటుందా? ఉండదా? అనే సందేహాలు అభ్యర్థులను పట్టిపీడిస్తున్నాయి.

టెట్‌ నోటిఫికేషన్‌లో నార్మ లైజేషన్‌పై విద్యాశాఖ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. టెట్‌ను తొలిసారిగా కంప్యూ టర్‌ బేస్డ్‌ టెస్ట్‌ సీబీటీ,విధా నంలో నిర్వహించబోతు న్నారు.

మే 20 నుంచి జూన్‌ 3 వరకు 15 రోజులపాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఒక్కో సెషన్‌లో 30 -35 వేల మందికి మాత్రమే పరీక్షను నిర్వహించే వీలుంది. ఒకే సబ్జెక్టుకు రెండు, మూడు సెషన్లల్లో పరీక్షలు నిర్వహిం చే అవకాశముంది.

ఒక పేపర్‌ ఈజీగా..లేదా మధ్యస్తంగా.. మరో పేపర్‌ కఠినంగా వస్తే ఆయా సెషన్‌లో పరీక్షకు హాజరైన వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.సులభంగా ప్రశ్నలొచ్చిన వారికి లాభం జరగగా, కఠినంగా వచ్చినవారికి నష్టం కలిగే అవకాశమున్నది.

ఇంతటి కీలకమైన విష యంపై విద్యాశాఖ స్పష్ట తనివ్వకపోగా, ఈ విషయా న్ని పూర్తిగా విస్మరించడం గమనార్హం. గతంలో టెట్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహించడం వల్ల అభ్యర్థులందరికీ ఒకే ప్రశ్నపత్రాన్నిచ్చేవారు.

పేపర్ల మూల్యాకంనంలో ఇబ్బందులొచ్చేవి కాదు. కానీప్పుడు ఆన్‌లైన్‌లో నిర్వహించడంతో కొత్త సమస్యలు ఉత్పన్నమవు తున్నాయి. దీనిపై విద్యా శాఖకు చెందిన ఓ ఉన్నతా ధికారిని సంప్రదించగా.. ఇప్పటి వరకు నార్మలైజే షన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

అన్నింటా అమలు..

ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీ క్షలన్నింటిలోనూ నార్మలైజే షన్‌ విధానం అమవుతు న్నది. మరి ఇలాంటప్పుడు టెట్‌కెందుకు లేదన్న ప్రశ్నలు అభ్యర్థుల నుంచి వినిపిస్తు న్నాయి.

జాతీయంగా నిర్వహించే జేఈఈ మొదలుకొని.. టీఎస్‌పీఎస్సీ, గురుకుల నియామక పరీక్షలన్నింటిలో నార్మలైజేషన్‌ను అమలు చేస్తున్నారు.

3, 6 తరగతులకు కొత్త సిలబస్‌

వచ్చే విద్యా సంవత్సరానికి (2024-25) సంబంధించి 3, 6 తరగతుల సిలబస్‌ మారనుందని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ సీబీఎస్‌ఈ, వెల్లడించింది.

ఈ రెండు తరగతులకు మినహా మిగిలిన వాటికి మారబోదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తన అను బంధ పాఠశాలలకు సీబీఎస్‌ ఈ తెలియజేసింది.

3, 6 తరగతుల కొత్త సిల బస్‌తో పాటు పాఠ్యపుస్త కాలను త్వరలో విడుదల చేస్తామని సీబీఎస్‌ఈకి విద్య, పరిశోధన, శిక్షణ జాతీయ మండలి ఎన్‌సీ ఈఆర్‌టీ, సమాచారం ఇచ్చింది.

పాఠశాలలన్నీ కొత్త సిల బస్‌ను అనుసరించాలని సీబీఎస్‌ఈ డైరెక్టర్‌ అకడ మిక్స్‌ జోసెఫ్‌ ఎమ్మాన్యు యేల్‌ సూచించారు. 6వ తరగతి విద్యార్థులకు అద నంగా బ్రిడ్జి కోర్సు ఉంటుంది.

3వ తరగతికి కుదించిన విధివిధానాలను ఎన్‌సీ ఈఆర్‌టీ,విడుదల చేయ నుంది. కొత్త విద్యా విధానా నికి అనుగుణంగా పాఠశా లల అధిపతులకు, ఉపా ధ్యాయులకు సామర్థ్య నిర్వహణ శిక్షణ కార్యక్ర మాలను చేపడతాం’ అని వివరించారు...

ఫోన్ ట్యాపింగ్ కేసు: పోలీసుల అదుపులో ఏఎస్పీ భుజంగరావు

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మరో కీలక మలుపు చోటు చేసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

ప్రణీత్ రావుతో కలిసి భుజంగరావు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి..

భూపాలపల్లి ఏఎస్పీగా ఉన్న భుజంగరావు.. గతంలో తెలంగాణ ఇంటెలిజెన్స్‌లో పనిచేశారు. రేపు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరు పర్చునున్నారు. ప్రణీత్ రావును, భుజంగరావును శనివారం పోలీసులు ఎనిమిది గంటలపాటు విచారించారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ పోలీసులు.. భుజంగరావు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్రావును ఇప్పటికే ఆరు రోజుల పాటు పోలీసులు విచారించారు. రేపు( ఆదివారం) మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచే అవకాశం ఉ‍న్నట్లు తెలుస్తోంది. ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. ఎస్‌ఐబీలో పని చేసిన పలువురు అధికారులు, కానిస్టేబుల్స్‌ను పిలిచి విచారించారు..

మరోవైపు ఎస్‌ఐబీలో పని చేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో స్పెషల్ టీమ్ ముందు హాజరయ్యారు. వీరితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్‌ఐబీలో పని చేసిన వాళ్లందరినీ విచారించే అవకాశం ఉ‍న్నట్లు తెలుస్తోంది..