మోడీ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయండి: ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్
![]()
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు, కార్పోరేట్ , మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా రేపు 16 న జరిగే దేశ వ్యాప్త కార్మిక సమ్మేను, గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ పిలుపునీచ్చారు.
గురువారం రోజున వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఇమ్రాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సం..కావస్తున్నా రైతాంగ కార్మిక,ప్రజల సమస్యలు పరిష్కరించలేదన్నారు, భారత్ వెలిగి పోతూంది, అచ్చేదిన్ ఆయేగా,విశ్వ గూరూ,మేకిన్ ఇండియా అంటూ మోసపూరిత ఆకర్షణ నినాధాలు ఇచ్చింది తప్ప చేసింది ఏమి లేదన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడులుగా తెచ్చిందని ఈ లేబర్ కోడలు కార్పొరేట్లకే ఉపయోగపడతాయని తెలియజేశారు.కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని సైతం మోడీ ప్రభుత్వం కాలరాస్తూ 12 గంటలు శ్రమదోపిడి చేసుకునేలా యజమాన్యాలకు అవకాశం కల్పిస్తూ లేబర్ కోడ్ లలో తీసుకువచ్చారని విమర్శించారు.
కార్మికుల నిజవేతనాలు 20 శాతం తగ్గి పోయాయన్నారు. ఈ పరిస్థితుల్లో బిజేపి ప్రభుత్వం అవలంబించే కార్మిక,రైతాంగ,ప్రజా వ్యతిరేక విధానాలు మతతత్వ ధోరణులకు నిరసనగా దేశాన్ని రైతులను,కార్మికులను,ప్రజలను రక్షించడం కోసం రేపు 16న జరుగుతున్న దేశ వ్యాప్త కార్మికుల సమ్మె-గ్రామీణ భారత్ బంద్ లో జిల్లా లోని రైతులు, కార్మికులు, కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనాలనీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో సిపిఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య, పట్టణ కార్యదర్శి మచ్చ లక్ష్మీనారాయణ, నాయకులు బోడిగే సుదర్శన్, చొప్పరి వెంకటేశం, పారుపల్లి నరసింహ, మచ్చ గిరి, రాములు తదితరులు పాల్గొన్నారు.












పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ళ చార్యులు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే సన్మానించారు. ఈనెల 19న రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న కూరెళ్ళ గ్రంథాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను ,జిల్లా కలెక్టర్ కు కూరెళ్ళ విఠలాచార్య మంగళవారం ఆయన చాంబర్ లో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విఠలా చార్య ను సత్కరించారు.
చదువుకుని లెక్చరర్ గా ఉద్యోగం చేసిన విఠలాచార్య పుస్తకాలను కలెక్ట్ చేస్తూ.. వచ్చి ఈ రిటైర్మెంట్ తర్వాత లైబ్రరీ ని ఏర్పాటు చేశారు. పట్టదలు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ..వయసుతో సంబంధం లేదని వారు నిరూపించారు. 2024 జనవరి 25న భారత ప్రభుత్వం వీరికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ డి మహేందర్ లాల్ మండలంలోని ప్రజలు కొన్ని సూచనలు ,సలహాలు పాటించాలని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...గ్రామాల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులు, సంచరిస్తున్నట్లుగా అనుమానం కలిగితే వెంటనే... ఆ సమాచారాన్ని వలిగొండ పోలీసులకు అందజేయాలని అన్నారు. చిన్నపిల్లలను ఒంటరిగా వదిలిపెట్టకుండా, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా అపరిచిత వ్యక్తులు.. మీ ఊర్లో సంచరిస్తూ ...మీ బంగారు వస్తువులకి మెరుగు దిద్దుతామంటూ.. వచ్చినట్లయితే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని అన్నారు. మహిళలు మరియు వృద్ధులు బంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా నడుచుకుంటూ... ప్రయాణిస్తున్నట్లయితే, మీ ఆభరణాలు కనిపించకుండా, వస్త్రాలతో కప్పుకోవాలని, సైబర్ నెరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులతో ,మీ బ్యాంకు సంబంధిత వివరాలు తెలియజేయకుండా ....తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా అపరిచితుల ఆన్లైన్ లింక్స్, వెబ్సైట్ లో ,మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దని తెలిపారు.

Feb 15 2024, 19:59
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.1k