భువనగిరి పట్టణంలోని ఎస్సీ హాస్టల్ ను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత
భువనగిరి పట్టణంలోని ఎస్సీ వసతి గృహాన్ని మంగళవారం ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఇటీవల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.. వసతి గృహాన్ని పరిశీలించి విద్యార్థినిల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినిల సూసైడ్ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు.అయితే పూర్తిస్థాయిలోనే ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.. మృతదేహాల పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం పూర్తిస్థాయిలో విచారణ మొదలుపెట్టనున్నట్లు సమాచారం..




గిగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ప్రమాద బీమా కార్యక్రమాన్ని ప్రారంభించిన నాగినేనిపల్లి ఎంపీటీసీ ఫకీరు రాజేందర్ రెడ్డి, బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో... గిగా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రమాద బీమా కార్యక్రమాన్ని నాగినేనిపల్లి ఎంపీటీసీ పకీరు రాజేందర్ రెడ్డి , అర్హులకు బీమా పత్రాలని అందజేశారు. ఈ సందర్భంగా ...వారు మాట్లాడుతూ చిన్నచిన్న వస్తువులకు బీమా చేయించుకునే మనం 150 రూపాయలతో, బీమా చేయించుకుంటే మన ప్రాణానికి ఆపదలో ఉన్నప్పుడు.. ఈ ప్రమాద బీమా ఉపయోగపడుతుందని, అలాగే ప్రతి వ్యక్తికి అవసరమని ,అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నాయకులు బూర నర్సయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.







Feb 06 2024, 16:21
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.2k