అదమా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు
యాదాద్రి భువనగిరి జిల్లా
వలిగొండ మండల పరిధిలోని దోనురు ప్రతాప రెడ్డి గార్డెన్ లో, అధమా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ....అధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు సోమవారం రోజున ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదమా కంపెనీ నేషనల్ సేల్స్ మేనేజర్ పాపునాయుడు హాజరైనారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ...యాసంగి వరి సేద్యంలో రైతులు ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో మొగిపురుగు,అగ్గి తెగులు,సమస్యలకు బోరెగాన్ 50 ఎస్పీ,బ్లాజిల్ క్లాస్టోడియ మందులను వాడాలని సూచించారు.అనంతరం రంగ ప్రవీణ్,తవుటం నరహరిలు పాపు నాయుడిని ఘనంగ సన్మానించారు.ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ సతీష్ కుమార్,సేల్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నర్సింహ రెడ్డి, ఏజిఎం మార్కెటింగ్ శివప్రకాష్, డిస్టిబ్యుటర్లు రంగా చంద్రశేఖర్, డీలర్స్ నరేంద్ర కమిషన్, రఘురామ, ఇస్మాయిల్, శ్రీనివాస ట్రేడర్, మండల పరిధిలోని రైతులు తదితరులు పాల్గొన్నారు.
![]()
![]()
![]()



గిగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ప్రమాద బీమా కార్యక్రమాన్ని ప్రారంభించిన నాగినేనిపల్లి ఎంపీటీసీ ఫకీరు రాజేందర్ రెడ్డి, బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో... గిగా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రమాద బీమా కార్యక్రమాన్ని నాగినేనిపల్లి ఎంపీటీసీ పకీరు రాజేందర్ రెడ్డి , అర్హులకు బీమా పత్రాలని అందజేశారు. ఈ సందర్భంగా ...వారు మాట్లాడుతూ చిన్నచిన్న వస్తువులకు బీమా చేయించుకునే మనం 150 రూపాయలతో, బీమా చేయించుకుంటే మన ప్రాణానికి ఆపదలో ఉన్నప్పుడు.. ఈ ప్రమాద బీమా ఉపయోగపడుతుందని, అలాగే ప్రతి వ్యక్తికి అవసరమని ,అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నాయకులు బూర నర్సయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.









Feb 06 2024, 11:12
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.0k