భువనగిరి లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బిఆర్ఎస్ శ్రేణులు
భువనగిరి పట్టణంలో ప్రిన్స్ కార్నర్ వద్ద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకి బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై చేస్తున్నారని అన్నారు. పాలన చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం కేసిఆర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో నాడు తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా రాష్ట్రం నిలిస్తే.. కాంగ్రెస్ పాలనలో.. రెండు నెలలు గడవక ముందే , ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు . సీఎం రేవంత్ రెడ్డి గౌరవ ప్రదమైన హోదాలో ఉండి, గల్లి లీడర్ గా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ,పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి ,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
![]()
![]()








పౌష్టికాహారం తీసుకుని క్యాన్సర్ బారి నుండి రక్షించుకోవాలి


హైకోర్టు న్యాయమూర్తి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ శరత్ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి న్యాయం అందే విధంగా న్యాయవాదులు పనిచేయాలని.. చట్టం అందరికీ ఒకటేనని అన్నారు. జిల్లా న్యాయస్థానంలో, న్యాయవాదులతో సమావేశంలో ..తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి కే శరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ కేసుల పరిష్కార పరిధిలో పరిశీలన ,మొదలు అంశాలపై సమీక్షించి, తగు సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత న్యాయమూర్తుల పై ఉంటుందని అన్నారు. కోర్టు భవనం కోసం నూతనంగా కేటాయించిన స్థలంలో కోర్టు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు .ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు ,జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.



Feb 05 2024, 21:10
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.7k