భువనగిరి లో ఇద్దరు విద్యార్థుల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి:.ఆలిండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్
శనివారం రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో భువనగిరి బాలికల గురుకుల పాఠశాలలో చనిపోయిన ఇద్దరు విద్యార్థుల మరణాల పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, పోలీసులు నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించాలని ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థులు ధైర్యవంతులని, ఆత్మహత్య చేసుకునే పిరికివారు కాదని, విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారని ఆయన అన్నారు. విద్యార్థులపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చని, ఆ తర్వాత హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, సూసైడ్ నోట్ కూడా ఫేక్ నోట్ అని, చాలా కాలంగా రాత్రి వేళల్లో వసతిగృహంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని ...ఆయన అన్నారు. వెంటనే పోలీసులు వసతి గృహం వార్డెన్ ను, వంట మనుషులను , నైట్ వాచ్ ఉమెన్ ను మరియు ఆటోడ్రైవర్ చింతల ఆంజనేయులను అరెస్టు చేసి, సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, వసతిగృహాల విద్యార్థులకు రక్షణతో పాటు మనోధైర్యం కల్పించాలని ఆయన కోరారు. ఇద్దరు విద్యార్థుల మృతి విషయాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరిగేలా, దోషులకు శిక్ష పడేలా చూస్తామని ఆయన అన్నారు.
![]()
![]()




పౌష్టికాహారం తీసుకుని క్యాన్సర్ బారి నుండి రక్షించుకోవాలి


హైకోర్టు న్యాయమూర్తి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ శరత్ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి న్యాయం అందే విధంగా న్యాయవాదులు పనిచేయాలని.. చట్టం అందరికీ ఒకటేనని అన్నారు. జిల్లా న్యాయస్థానంలో, న్యాయవాదులతో సమావేశంలో ..తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి కే శరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ కేసుల పరిష్కార పరిధిలో పరిశీలన ,మొదలు అంశాలపై సమీక్షించి, తగు సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత న్యాయమూర్తుల పై ఉంటుందని అన్నారు. కోర్టు భవనం కోసం నూతనంగా కేటాయించిన స్థలంలో కోర్టు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు .ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు ,జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల సిపిఎం పార్టీ ,మండల కార్యదర్శి సిర్పంగి స్వామిని పరామర్శించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇటీవల యాక్సిడెంట్ లో కాలుకు ప్యాక్చర్ కావడంతో ఇంటివద్ద స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి వారి యోగక్షేమాలు తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని అన్నారు. సిర్పంగి స్వామికి మనో ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.






Feb 04 2024, 21:49
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
82.6k