ఎల్ . కే అద్వాని కి భారతరత్న ప్రకటించడం హర్షనీయం: జిల్లా టెలికం బోర్డు మెంబర్ దంతూరి సత్తయ్య గౌడ్
![]()
మాజీ ఉప ప్రధాని భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యులు లాల్ కృష్ణ అద్వానీకి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడం హర్షించదగ్గ విషయమని భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా టెలికం బోర్డు అడ్వైజరీ మెంబర్ దంతూరి సత్తయ్య గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం రోజున ఆయన మాట్లాడుతూ ప్రజా జీవితంలో పారదర్శకత జవాబుదారి తనం రాజకీయ విలువలకు కట్టుబడి దశాబ్దాలుగా దేశ పౌరసత్వం సంస్కృతికి బాధ్యతతో నిర్వర్తించిన కృషివలుడు అలుపెరుగని రాజకీయ యోధుడు లాల్ కృష్ణ అద్వానీ అని ఆయన అన్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో కోట్లాదిమంది భారత దేశ ప్రజలలో తాను కూడా ఒకడిని కావడం తనకెంతో గర్వముగా ఉన్నదని దేశానికి ఆయన చేసిన సేవలు గురించి దంతూరి సత్తయ్య గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండల బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
![]()
![]()



హైకోర్టు న్యాయమూర్తి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ శరత్ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి న్యాయం అందే విధంగా న్యాయవాదులు పనిచేయాలని.. చట్టం అందరికీ ఒకటేనని అన్నారు. జిల్లా న్యాయస్థానంలో, న్యాయవాదులతో సమావేశంలో ..తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి కే శరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ కేసుల పరిష్కార పరిధిలో పరిశీలన ,మొదలు అంశాలపై సమీక్షించి, తగు సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత న్యాయమూర్తుల పై ఉంటుందని అన్నారు. కోర్టు భవనం కోసం నూతనంగా కేటాయించిన స్థలంలో కోర్టు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు .ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు ,జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల సిపిఎం పార్టీ ,మండల కార్యదర్శి సిర్పంగి స్వామిని పరామర్శించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇటీవల యాక్సిడెంట్ లో కాలుకు ప్యాక్చర్ కావడంతో ఇంటివద్ద స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి వారి యోగక్షేమాలు తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని అన్నారు. సిర్పంగి స్వామికి మనో ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.







జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవీర్భావ దినోత్సవ వేడుకలను ఆత్మకూరు మండల కేంద్రం కట్ట మైసమ్మ దేవాలయం వద్ద ఉపాధిహామీ కూలీలు, ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గారు కేక్ కట్ చేసి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బడుగు బలహీన వర్గాలను ఆదుకొనే లక్ష్యంతో.. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేడు ...గ్రామాభివృద్ధి మరియు సంక్షేమంలో భాగస్వామ్యం కావడం నేడు ఉపాధి హామీ పథకం 19 వ వసంతంలో అడుగుపెట్టడం హర్షణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ నిరంజన్ వలీ, ఏపిఓ రమేష్, పంచాయతీ కార్యదర్శి ఆనంద్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి,మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం, నాయకులు కట్టేకోల హన్మంతు గౌడ్, ఎద్దు వెంకటేశ్వర్లు , పైళ్ళ దామోదర్ రెడ్డి,రంగ స్వామి,కోరే కనకయ్య, ఎలగందుల సైదులు, కొండపల్లి ముత్యాలు, ఉపాధి హామీ సిబ్బంది యాది రెడ్డి, శ్రీశైలం,సత్యనారాయణ మరియు కూలీలు పాల్గొన్నారు.

Feb 04 2024, 17:22
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
25.9k