జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పులిగిల్ల లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో గల ఉన్నత పాఠశాలలో శనివారం రోజున స్వయం పరిపాలన దినోత్సవం విద్యార్థులచే ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా ఆ పాత్రలో ఒదిగిపోయారు.... ఒక విద్యార్థిని ఉపాధ్యాయులుగా ఏ విధంగా నియంత్రణలో ఉంచాలో, ఈ విధంగా వారికి తెలిసింది. విద్యార్థులు వివిధ అధికారుల పాత్రలో ,విద్యాశాఖ అధికారిగా ,ఎమ్మెల్యేగా ,హెడ్మాస్టర్ గా పలు పాఠ్యాంశాలను వివరిస్తూ ...ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఎమ్మెల్యేగా వ్యవహరించిన కంచి రాంచరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ...పాఠశాలకు అవసరమైన నిధులు సమకూరుస్తామని హామీ ఇవ్వడంతో అందరూ నవ్వులతో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
![]()
![]()




యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల సిపిఎం పార్టీ ,మండల కార్యదర్శి సిర్పంగి స్వామిని పరామర్శించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇటీవల యాక్సిడెంట్ లో కాలుకు ప్యాక్చర్ కావడంతో ఇంటివద్ద స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి వారి యోగక్షేమాలు తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని అన్నారు. సిర్పంగి స్వామికి మనో ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.







జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవీర్భావ దినోత్సవ వేడుకలను ఆత్మకూరు మండల కేంద్రం కట్ట మైసమ్మ దేవాలయం వద్ద ఉపాధిహామీ కూలీలు, ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గారు కేక్ కట్ చేసి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బడుగు బలహీన వర్గాలను ఆదుకొనే లక్ష్యంతో.. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేడు ...గ్రామాభివృద్ధి మరియు సంక్షేమంలో భాగస్వామ్యం కావడం నేడు ఉపాధి హామీ పథకం 19 వ వసంతంలో అడుగుపెట్టడం హర్షణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ నిరంజన్ వలీ, ఏపిఓ రమేష్, పంచాయతీ కార్యదర్శి ఆనంద్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి,మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం, నాయకులు కట్టేకోల హన్మంతు గౌడ్, ఎద్దు వెంకటేశ్వర్లు , పైళ్ళ దామోదర్ రెడ్డి,రంగ స్వామి,కోరే కనకయ్య, ఎలగందుల సైదులు, కొండపల్లి ముత్యాలు, ఉపాధి హామీ సిబ్బంది యాది రెడ్డి, శ్రీశైలం,సత్యనారాయణ మరియు కూలీలు పాల్గొన్నారు.



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోకారం, జాలు కాలువ గ్రామాలలో శుక్రవారం వలిగొండ ఎస్సై డి మహేందర్ సైబర్ నేరాలు, సీసీటీవీ ఉపయోగాలు, నేర నివారణ చర్యలు పై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలను పంచుకుంటే తర్వాత వాళ్లు బ్యాంక్ అధికారుల వలె నమ్మించి ఓటిపి తెలుసుకొని బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తారని తెలిపారు. గ్రామాలలో సిసిటీవీలను ఉపయోగించాలని సిసిటీవీ వలన నేరాలను అరికట్టవచ్చని అన్నారు. దొంగలను, నేరస్తులను గుర్తించడంలో సీసీటీవీలు సహాయపడతాయని... సమాజంలో నేరం చేసే అవకాశాలను తగ్గిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాల యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Feb 03 2024, 22:16
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
16.2k