వలిగొండలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఎఫ్ ఎస్ సి ఎ సభ్యులు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో క్రీడాకారుల సౌకర్యం కోసం మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ...ఫ్రెండ్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ..ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో స్టేడియంకు కావాల్సిన స్థలాన్ని గుర్తించి ,మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. లోతుకుంట గ్రామంలో స్టేడియం నిర్మాణానికి అవసరమైన స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎస్ సి ఏ అధ్యక్షుడు కొండూరు బాలరాజు, గంజి చండీ ప్రసాద్, కొండూరు భాస్కర్, కాసుల వెంకటేశం, కూర శ్రీనివాస్, యానాల సత్యనారాయణ రెడ్డి, స్వామి రాజ్, పిట్టల రాజు, ఐటిపాముల ప్రభాకర్, కాటేపల్లి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
![]()
![]()








జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవీర్భావ దినోత్సవ వేడుకలను ఆత్మకూరు మండల కేంద్రం కట్ట మైసమ్మ దేవాలయం వద్ద ఉపాధిహామీ కూలీలు, ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గారు కేక్ కట్ చేసి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బడుగు బలహీన వర్గాలను ఆదుకొనే లక్ష్యంతో.. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేడు ...గ్రామాభివృద్ధి మరియు సంక్షేమంలో భాగస్వామ్యం కావడం నేడు ఉపాధి హామీ పథకం 19 వ వసంతంలో అడుగుపెట్టడం హర్షణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ నిరంజన్ వలీ, ఏపిఓ రమేష్, పంచాయతీ కార్యదర్శి ఆనంద్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి,మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం, నాయకులు కట్టేకోల హన్మంతు గౌడ్, ఎద్దు వెంకటేశ్వర్లు , పైళ్ళ దామోదర్ రెడ్డి,రంగ స్వామి,కోరే కనకయ్య, ఎలగందుల సైదులు, కొండపల్లి ముత్యాలు, ఉపాధి హామీ సిబ్బంది యాది రెడ్డి, శ్రీశైలం,సత్యనారాయణ మరియు కూలీలు పాల్గొన్నారు.



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోకారం, జాలు కాలువ గ్రామాలలో శుక్రవారం వలిగొండ ఎస్సై డి మహేందర్ సైబర్ నేరాలు, సీసీటీవీ ఉపయోగాలు, నేర నివారణ చర్యలు పై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలను పంచుకుంటే తర్వాత వాళ్లు బ్యాంక్ అధికారుల వలె నమ్మించి ఓటిపి తెలుసుకొని బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తారని తెలిపారు. గ్రామాలలో సిసిటీవీలను ఉపయోగించాలని సిసిటీవీ వలన నేరాలను అరికట్టవచ్చని అన్నారు. దొంగలను, నేరస్తులను గుర్తించడంలో సీసీటీవీలు సహాయపడతాయని... సమాజంలో నేరం చేసే అవకాశాలను తగ్గిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాల యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





Feb 03 2024, 20:26
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
23.5k