మాజీ మంత్రి ,సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావును సన్మానించిన తెలంగాణ ఉద్యమ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి
భువనగిరి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసిన మాజీ మంత్రి ,సిద్దిపేట ఎమ్మెల్యే, తన్నీరు హరీష్ రావు సమావేశం అనంతరం తెలంగాణ ఉద్యమ నాయకులు జిట్టా బాలకృష్ణ రెడ్డి నివాసం కి విచ్చేసిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకి తెలంగాణ ఉద్యమ నేత జీట్టా బాలకృష్ణ రెడ్డి , మాజీ మంత్రి హరీష్ రావుని శాలువా తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభలు మద్ది రాజు రవిచంద్ర , భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ,ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
![]()
![]()




యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోకారం, జాలు కాలువ గ్రామాలలో శుక్రవారం వలిగొండ ఎస్సై డి మహేందర్ సైబర్ నేరాలు, సీసీటీవీ ఉపయోగాలు, నేర నివారణ చర్యలు పై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలను పంచుకుంటే తర్వాత వాళ్లు బ్యాంక్ అధికారుల వలె నమ్మించి ఓటిపి తెలుసుకొని బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తారని తెలిపారు. గ్రామాలలో సిసిటీవీలను ఉపయోగించాలని సిసిటీవీ వలన నేరాలను అరికట్టవచ్చని అన్నారు. దొంగలను, నేరస్తులను గుర్తించడంలో సీసీటీవీలు సహాయపడతాయని... సమాజంలో నేరం చేసే అవకాశాలను తగ్గిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాల యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.









సైబర్ నేరల పట్ల ప్రజలు విద్యార్థులు యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి ,తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రావన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ అన్నారు. వలిగొండ పట్టణంలో గురువారం సాయంత్రం ... సైబర్ నేరాలపై పట్టణ ప్రజలకి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ....ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంక్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు .ఫోన్లో ఓటిపి.. ఫోన్ పే ,గూగుల్ పే కేవైసీలను అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్ స్పందించ వద్దన్నారు. ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నడిపివారు... కొత్త వ్యక్తుల మాటలను నమ్మ వద్దని... తెలియని మెసేజ్ ల పై క్లిక్ చేయరాదని తెలిపారు. అలాగే సీసీటీవీ ఉపయోగాల గురించి తెలియజేశారు.


Feb 02 2024, 23:55
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.4k