స్వామి రామానంద తీర్థ గ్రామీణ అభివృద్ధి సంస్థను వృత్తి విశ్వవిద్యాలయంగా మార్పు చేయాలని సీఎం ని కోరిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ని గురువారం కలిసిన భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి .... ఈ సందర్భంగా
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలో ఉన్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ అభివృద్ధి సంస్థను వృత్తి విశ్వవిద్యాలయంగా మార్పు చేయాలని వినతిపత్రం అందజేశారు.
RRR రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని సీఎంని కోరారు..
అలాగే నియోజకవర్గంలోని భునాదిగాని కాలువ మరమ్మతులకు159.03 కోట్లు, ధర్మారెడ్డి పల్లి కాలువ మరమ్మతులకు 129.80 కోట్లు, పిల్లాయిపల్లి కాల్వ మరమ్మతులకు 95.60 కోట్లు నిధులు కేటాయించాలని కోరడం జరిగింది .
మరియు తెలంగాణ సాయుధ రైతు ,పోరాటయోధుడు రావినారాయణరెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారని ,ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు.
![]()
![]()


































వలిగొండ మండల కేంద్రంలో ,అంబేద్కర్ చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా యుద్ధ నౌక గద్దర్ 75వ జయంతి సందర్భంగా గద్దర్ ఫోటోకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గద్దర్ విప్లవ పార్టీ కార్యకర్త ,రచయిత, గాయకుడు ,గద్దర్ గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ విప్లవ కవి ,ఈయనకు గద్దర్ అను పేరును స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన గద్దర్ పార్టీ కు గుర్తుగా తీసుకోవడం జరిగిందని అన్నారు.కళాకారులు మాట్లాడుతూ ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి.. దళిత పేదలు అనుభవిస్తున్న కష్టా నష్టాలను ఆయన బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియజేసేవారు. ఆయన పాడిన పాటలకు మేము ఆకర్షితులమై కళాకారులంగా ఇప్పుడు మేము జీవిస్తూనే ఉన్నాము... ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ ,వెనకబడ్డ కులాలకు ఎంతో చైతన్యాన్ని స్ఫూర్తిని నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, ఎస్సీ , ఎస్ టి, బీసీ ,మైనార్టీ సంఘాలు, రాజకీయ నాయకులు ,ఘనంగా జయంతిని నిర్వహించారు .ఈ కార్యక్రమంలో కొత్త రామచందర్ ,మామిండ్ల రత్నయ్య, రవీందర్, పెరమండ్ల యాదగిరి ,సాయిని యాదగిరి, ఆకుల వెంకటేశం ,సత్తిరెడ్డి, కొండూరు సత్తయ్య, శీను, గోదా అచ్చయ్య ,పోలె పాక సత్యనారాయణ ,లోతుకుంట సర్పంచ్ బిక్షపతి ,కందుల అంజయ్య, బిక్షపతి, నరసింహ, పోలేపాక బిక్షపతి, పవన్ కుమార్ ,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Feb 02 2024, 00:00
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.7k