NLG: మర్రిగూడ మండల కేంద్రంలో ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందించిన జై భీమ్ సాహో యూత్

నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నందు జై భీమ్ సాహూ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మండల స్థాయిలో నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలుగా.. మొదటి బహుమతి అయితగోని విజయ, రెండవ బహుమతి అక్షిత, మూడవ బహుమతి పావని గెలుపొందడం జరిగింది.

యూత్ ప్రెసిడెంట్ ఈద గిరీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొదటి బహుమతి దాత ఉప్పరి శ్రీనివాస్ (ఎస్ఐ నాగోల్), రెండవ బహుమతి సూర్య సత్యనారాయణ, మూడవ బహుమతి వీరమల్ల లోకేష్ డొనేట్ చెయ్యటం జరిగింది. మొదటి బహుమతి రూ. 5016/-, 2వ బహుమతి 4016/-, 3వ బహుమతి రూ3016/- లను విజేతలకు అందజేశారు. అదేవిధంగా చిన్నపిల్లలకు, మ్యూజికల్ చైర్స్, స్పూన్ గేమ్స్ నిర్వహించి బహుమతులు అందించారు. అనంతరం కమిటీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ నల్ల యాదయ్య, నాగోల్ ఎస్సై తుప్పరి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేష్, లోకేష్, పగడాల రఘు, కోఆర్డినేటర్ గ్యార యాదగిరి, బండ విజయ్, జాజుల రామకృష్ణ, చెలగోని వెంకటేష్, ఈద రమేష్, ఈద సంతోష, తుప్పరి పావని, చెలగొని స్వాతి, ఈద భాస్కర్, ఈద సురేష్, యూసఫ్, ఈద కాశీ, ఈద అభి, మారి, అధిక సంఖ్యలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు. 

Jan 16 2024, 18:10