ఎంసెట్ పేరులో మార్పు?
ఎంసెట్ పేరులో మార్పు?
హైదరాబాద్:జనవరి 15
రాష్ట్రంలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ప్రవేశ పరీక్ష పేరును మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
2017 నుంచి ఎంసెట్‌లో మెడికల్ సీట్ల భర్తీని తొలగించి, ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సులను నీట్ ద్వారా భర్తీ చేస్తోంది. అయినా ఎంసెట్ పేరులో ఎం మెడికల్ అనే పదం అలాగే కొనసాగుతూ వస్తోంది.
ఈ నేపథ్యంలో మెడికల్ పేరు తొలగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గవర్నమెంట్‌కు ప్రతిపాదనలు పంపింది. ఎంసెట్‌లో ఎం అక్షరాన్ని తీసేసి.. టీఎస్ఈఏ సెట్ లేదా టీఎస్‌ఈఏపీ సెట్‌గా మార్చాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.
ఎంసెట్ ద్వారానే బీఫార్మసీ సీట్లను భర్తీ చేస్తున్నందున పీ అక్షరాన్ని తాజాగా పోటీ పరీక్ష పేరుకు చేర్చునున్నట్లు తెలిసింది..

ఎంసెట్ పేరులో మార్పు?

అమరావతి: చంద్రబాబుతో పవన్ డిన్నర్ మీటింగ్
ఢిల్లీ: ఖర్గే నివాసంలో కీలక సమావేశం.. సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, దీపా దాస్ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి..
ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖాళీగా ఉన్న మంత్రి పదవుల అంశంపై చర్చ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. స్టీల్ ప్లాంట్‌లోని బీఎఫ్-3లో చెలరేగిన మంటలు.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది.
సీఎంకు ఇద్దరు పీఆర్వోల నియామకం
అమరావతి: వైసీపీ మూడో జాబితా విడుదల.. 23 మందితో వైసీపీ మూడో జాబితా..
సూళ్ళూరుపేట- తిరుపతి ఎంపీ గురుమూర్తి , పెడన - ఉప్పాల రాము, పెనమలూరు - జోగి రమేష్, చిత్తూరు-విజయానంద రెడ్డి, మార్కాపురం -జంకె వెంకట రెడ్డి, రాయదుర్గం - మెట్టు గోవింద్ రెడ్డి, పూతలపట్టు - డా. సునీల్, తిరువూరు - నల్లగట్ల స్వామి దాస్.
హైదరాబాద్: అయోధ్య ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరిస్కరించడం సరికాదు.. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి మరోసారి బయటపడింది.. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌లో భాగంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది..
జనవరి 22 కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది.. అయోధ్య కేసు విచారణ సమయంలో కాంగ్రెస్ వితండవాదం చేసింది.. అసలు రాముడు ఉన్నాడా అంటూ కోర్టులో వాదనలు వినిపించింది.. బహిష్కరించడం కాంగ్రెస్‌కు అలవాటైంది. -కిషన్ రెడ్డి
అమరావతి: నేడు జగనన్న తోడు పథకం లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం వైఎస్ జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కార్యక్రమం.. చిరు వ్యాపారస్తులు, చేతి వృత్తుల వారికి వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి 10 వేల రూపాయల రుణం లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం
Jan 16 2024, 07:32
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.3k