NLG: చలో ఢిల్లీ.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో పార్లమెంట్ ముట్టడి కరపత్రాల ఆవిష్కరణ
నల్లగొండ జిల్లా, దేవరకొండ డివిజన్:
కొండమల్లేపల్లి : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ చలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రామావత్ లక్ష్మణ్,బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. భారతదేశ విద్య రంగాన్ని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడాలనే లక్ష్యంతోటి, జనవరి 12న ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
భారత దేశంలో బిజెపి అధికారంలో వచ్చిన తర్వాత ఉన్నత విద్య పై ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంటుందని, బిజెపి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం, రాజ్యాంగ స్ఫూర్తి కి భావవ్యక్తీకరణ భిన్నంగా నూతన విద్యా విధానం పేరుతో విద్యారంగాన్ని కాషాయకరణం కొరకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. సిలబస్ మార్పులు చేసి ఆర్ఎస్ఎస్ భావజాలతో పాఠ్యాంశాలు నింపే ప్రయత్నం చేస్తున్నారని, విద్యారంగంలో అన్ని కీలకమైన పోస్టులలో ఆర్ఎస్ఎస్ బిజెపి సంబంధించిన వ్యక్తులను నింపుతున్నారని.. అందుకే ఈ సవాళ్లను స్వీకరిస్తూనే దేశంలో విద్యార్థి ఉద్యమాల ఊపును కొనసాగించడం అత్యవసరం, అందుకే దేశంలో లౌకిక ప్రజాస్వామ్య ప్రగతిశీల 16 విద్యార్థి సంఘాల అన్ని ఒకే వేదికపై వచ్చి యునైటెడ్ స్టూడెంట్ ఆఫ్ ఇండియా పేరుతో యునైటెడ్ స్టూడెంట్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి, భారత దేశంలో విద్యా ఉపాధి రంగాన్ని రక్షించే పోరాటాన్ని బలోపేతం చేయడంలో చేతులు కలపాలని విద్యార్థుల్లోకానికి పిలుపునిస్తున్నామని అన్నారు.
అదేవిధంగా భారత ప్రజాస్వామాన్ని రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతున్న విద్యార్థి లోకానికి, ఈ పార్లమెంట్ మార్చ్ నిర్వహణకు ఆర్థిక, హార్దిక సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కొండమల్లేపల్లి మండల అధ్యక్ష కార్యదర్శిలు జై చరణ్, కొర్ర లక్ష్మణ్ నాయక్, మండల ఉపాధ్యక్షులు రామావత్ గోపి, రోహిత్, వికాస్, రాకేష్, మానస, మహేశ్వరి, లలిత, సంధ్య, శివ గణేష్, రాహుల్, నవీన్, సాయి, టిల్లు, వరుణ్, తదితరులు పాల్గొన్నారు.
Jan 06 2024, 17:44