నల్లగొండ: ప్రజా సమస్యల పరిష్కారమే ఏ జండగా పనిచేస్తాం: సిపిఎం పార్టీ
ప్రజా సమస్యల పరిష్కారమే ఏ జండగా పనిచేస్తాం
పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీని విస్తరించాలి
కమ్యూనిస్టులకు ఓట్లు సీట్లు ముఖ్యం కాదని ప్రజా సమస్యల పరిష్కారమే ఏజండగా ముందుకు వెళ్లాలని సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం పిలుపునిచ్చారు
గురువారం రాత్రి నల్లగొండ పట్టణంలోని 11వ వార్డు కతాలగుడెంలో సిపిఎం 11వ వార్డు శాఖ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ తెలంగాణలో నియంత పాలన అంతరించి ప్రజా పాలన ప్రారంభం కావడం అభినందనీయమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఐదు అమలు చేయడానికి తీసుకుంటున్న దరఖాస్తులు విచారణల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే అర్హులందరికీ అమలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి పొందుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఆధార్ కార్డు ప్రాతిపదికన నగదు చెల్లింపు వ్యవస్థ తీసుకురావడం ద్వారా ఉపాధి కూలీలు పనికి అర్హత కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేసి పట్టణ పేదలకు ఉపాధి కల్పించాలని కోరారు.
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో 552 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు డ్రా ద్వారా ఎంపిక చేసి అర్హులను గుర్తించారని వారికి వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు స్వాధీనపరచాలని విజ్ఞప్తి చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని, కతాల గూడెం లోని స్మశాన వాటిక లో మౌలిక వసతులు కల్పించి, రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. సాగర్ రోడ్ నుండి కొత్తపెల్లి కాల్వ వరకు నాలుగో వరుసల రోడ్లు, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ,కతాలగూడెం నుండి మామిల్లగూడెం మీదుగా గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వరకు రెండు వరుసల తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాలనీలలో అంతర్గత సిసి రోడ్లు నిర్మాణం చేసి డ్రైనేజీ నిర్మించకపోవడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు. వార్డు విస్తీర్ణానికి అనుగుణంగా మున్సిపల్ కార్మికుల సంఖ్య పెంచాలని అధికారులను కోరారు.
ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యురాలు దండెంపల్లి సరోజ, 11వ వార్డు శాఖ కార్యదర్శి పనస చంద్రయ్య,శాఖ సభ్యులు దండెంపల్లి మారయ్య, యాదయ్య ,పల్లె నగేష్, కృష్ణ, చంద్రబాబు, జానమ్మ,తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఐదు అమలు చేయడానికి తీసుకుంటున్న దరఖాస్తులు విచారణల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే అర్హులందరికీ అమలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి పొందుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఆధార్ కార్డు ప్రాతిపదికన నగదు చెల్లింపు వ్యవస్థ తీసుకురావడం ద్వారా ఉపాధి కూలీలు పనికి అర్హత కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేసి పట్టణ పేదలకు ఉపాధి కల్పించాలని కోరారు.
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో 552 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు డ్రా ద్వారా ఎంపిక చేసి అర్హులను గుర్తించారని వారికి వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు స్వాధీనపరచాలని విజ్ఞప్తి చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని, కతాల గూడెం లోని స్మశాన వాటిక లో మౌలిక వసతులు కల్పించి, రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. సాగర్ రోడ్ నుండి కొత్తపెల్లి కాల్వ వరకు నాలుగో వరుసల రోడ్లు, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ,కతాలగూడెం నుండి మామిల్లగూడెం మీదుగా గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వరకు రెండు వరుసల తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాలనీలలో అంతర్గత సిసి రోడ్లు నిర్మాణం చేసి డ్రైనేజీ నిర్మించకపోవడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు. వార్డు విస్తీర్ణానికి అనుగుణంగా మున్సిపల్ కార్మికుల సంఖ్య పెంచాలని అధికారులను కోరారు.
భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు
12 మంది మృతి
నల్లగొండ: హజ్రత్ సయ్యద్ షావలి ఉల్లా ( సయ్యద్ సాబ్ ) వారి ఉర్సు ఉత్సవాలు సందర్భంగా నేడు సాయంత్రం 6 గంటలకు స్థానిక తాలూదారి మజీద్ పాత కలెక్టరేట్ నల్గొండ నుండి గంధం భక్తి శ్రద్ధలతో ఉరుసు ఉత్సవాల కమిటీ అధ్యక్షులు అయిన గౌరవ శ్రీ కట్టెల శివకుమార్ గారి ఆధ్వర్యంలో గంధం ప్రారంభించబడి,ఊరేగింపు మునుగోడు రోడ్డు ఈద్గా దర్గా సయ్యద్ షావలి దర్గాకి రాత్రి 8 గంటలకు చేరుకుంది.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికి తీసి పేదలకు పంచాలి
సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అదనపు(రెవెన్యూ) కలెక్టర్ వెంకట్ రెడ్డి గారికి వినతిపత్రం జరిగింది.ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణ సమీపంలో గల కుడకుడ శివారులో సర్వేనెంబర్ 126 లో సుమారు 85 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ ప్రభుత్వ భూమి మొత్తం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు మరియు కొంతమంది స్థానిక నాయకులు కలిసి కబ్జా చేసి తప్పుడు దారుల్లో కొంతమంది పట్టాలు సంపాదించారని విమర్శించారు. అదేవిధంగా గత ఆరు సంవత్సరాల నుంచి మా పార్టీ ఆధ్వర్యంలో పేదలు గుడిసెలేస్తే టీఆర్ఎస్ నాయకులు మరియు నిత్యం పేద ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పుకునే ఒక ఎర్రజెండా పార్టీ నాయకులు కలిసి మా మహిళలపై దాడులు చేశారని అన్నారు. ఆ ఇంటి స్థలాలను నేడు వారు, టిఆర్ఎస్ నాయకులు కలిసి ఆక్రమించుకొని దొడ్డి దారిలో పట్టాల పొందారు,మరికొందరు స్వతంత్ర సమర యోధుల పేరుతోటి, ఎక్స్ మిల్ట్రీ వాళ్ళ పేరుతోటి తప్పుడు దారుల్లో గుట్టలను పట్టా చేయించుకొని, వాటిని నేడు ప్లాట్లు చేసి అమాయక ప్రజలకు అమ్ముతున్నారు.అదేవిధంగా ఉపేందర్ అనే అతను మునిసిపాలిటీలో పనిచేస్తూ అధికార పార్టీ నాయకుల అండదండ తోటి 126 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమిని అక్కడ ఉన్న పేదలకు అమ్ముతున్నాడు. ఈ కబ్జాదారులను కట్టడి చేయక పోతే ప్రభుత్వ భూమి మొత్తం చివరికి ప్రభుత్వానికి పేద ప్రజలకు లేకుండా పోతుంది అన్నారు. కాబట్టి కబ్జాదారులను శిక్షించి,కబ్జా భూములను వెలికితీసి అర్హులైన పేదలందరికీ 126 గజాల ఇంటి స్థలం ఇచ్చి, ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని మా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము అన్నారు. ఇదే విషయం గతంలో ఉన్న కలెక్టర్ గారికి , చివ్వెంల ఎమ్మార్వో గారికి, పోలీసు వారికి,గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి మా పార్టీ ద్వారా అనేకసార్లు తెలియజేశాము అయినా ఎలాంటి స్పందన లేకపోగ,మాపై తప్పుడు కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తంచేశారు. కలెక్టర్ గారు స్పందించి వారం రోజుల్లో కబ్జా భూమిని వెలికి తీసి, కబ్జాదారులను శిక్షించి ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని, లేనియెడల మా పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రాంజీ, ఐఎఫ్టియు జిల్లా నాయకులు సయ్యద్ హుస్సేన్,పివైఎల్ నాయకులు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ: నేడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) విలీనం.. ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్న వైఎస్ షర్మిల.. ఈరోజే కాంగ్రెస్ పార్టీలో చేరనున్న షర్మిల
ఉదయం 11 గంటలకు విస్తృత సమావేశం. రానున్న లోక్ సభ ఎన్నికలు, రాహుల్ గాంధీ “భారత్ న్యాయ యాత్ర” పై సమాలోచనలు..

టెలికాం అడ్వైజరీ బోర్డు మెంబర్ గా పాపని వనజ
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ శాఖ నుండి ఉత్తర్వులు జారీ చేసింది. గత 30 సంవత్సరాలుగా ఆమె పార్టీలో వివిధ హోదాలలో పనిచేస్తున్నారు. ఆమె సేవలను గుర్తించిన పార్టీ బోర్డు మెంబర్ గా అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా పాపని వనజ వాసుదేవ్ మంగళవారం ఒక ప్రకటనలో... తన నియామకానికి సహకరించిన బిజెపి కేంద్ర, రాష్ట్ర, జిల్లా నాయకులతోపాటు స్థానిక నాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
మరోసారి ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..
ఇప్పటికే రెండు సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాని కేజ్రీవాల్..
ఓసారి ఎన్నికల ప్రచారం, మరోసారి విపాసన ప్రక్రియ సాకుగా చూపిన ఢిల్లీ సీఎం.. నేటి విచారణకు కూడా హాజరుకావడం లేదని ఈడీకి లేఖ
Jan 05 2024, 18:23
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
20.0k