సావిత్రిబాయి పూలే జన్మదినం పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం...

కవి ,రచయిత్రి, సంఘసంస్కర్త అయిన శ్రీమతి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు బీసీ సంక్షేమ సంఘం మహిళ ఉద్యోగ యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో
నల్లగొండ గడియారం సర్కిల్లో అమరవీరుల స్థూపం వద్ద సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ,
శ్రీమతి సావిత్రిబాయి పూలే మహిళల కోసం1848 సంవత్సరంలో ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేసి ,
వారికి విద్య బోధన చేసిందని
అదేవిధంగా అసహయులకు ఆసరా కల్పించిందని,
తన జీవితం మొత్తం మహిళల కోసం బడుగు బలహీన వర్గాల కోసం సేవ చేస్తూ ప్రాణత్యాగం చేసిందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి ,జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు సింగం లక్ష్మి, సెక్రెటరీ చింతపల్లి సదాలక్ష్మి, శంకరదుర్గ, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ ,
యువజన సంఘం అధ్యక్షులు మునాస ప్రసన్నకుమార్,
కే పర్వతాలు, గుండు వెంకటేశ్వర్లు, పాలడుగు నాగార్జున, పందుల సైదులు గౌడ్, బత్తుల శ్రీనివాస్ ,ఊట్కూరి గిరి, కారింగు లలిత, వల కీర్తి శ్రీనివాస్, మల్లెబోయిన సతీష్ యాదవ్, కొప్పు యాదయ్య గౌడ్, కొప్పు మహేష్ గౌడ్, పగిళ్ల కృష్ణ ,గడ్డం దశరథ కొద్దిగా సుమలత స్వాతి తదితరులు పాల్గొన్నారు.
Jan 04 2024, 10:35