/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz ISRO: కొత్త ఏడాది తొలిరోజే ప్రయోగం.. పీఎస్‌ఎల్‌వీ-సీ58 కౌంట్‌డౌన్‌ షురూ Mane Praveen
ISRO: కొత్త ఏడాది తొలిరోజే ప్రయోగం.. పీఎస్‌ఎల్‌వీ-సీ58 కౌంట్‌డౌన్‌ షురూ

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) 2024 కొత్త ఏడాది తొలి రోజే పీఎస్‌ఎల్‌వీ-సి58 ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేసింది. పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక మనదేశానికి చెందిన ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం(ఎక్స్‌పోశాట్‌)ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది..

ఇందుకు సంబంధించి సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ (శ్రీహరికోట)లో కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైంది. ఈ ప్రక్రియ 25 గంటలపాటు కొనసాగి సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి58 వాహకనౌక షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది ఎక్స్‌పోశాట్‌ను కక్ష్యలోకి వదిలిపెట్టిన తర్వాత పీఎస్‌4 10 ఇతర పేలోడ్‌లను హోస్ట్‌ చేయనుంది..

ఎక్స్‌పోశాట్‌ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుంది. ఇమేజింగ్‌, టైం-డొమైన్‌ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా.. ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ, ఎక్స్‌-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్‌ లక్ష్యం. ఈ ఉపగ్రహ జీవితకాలం అయిదేళ్లు. పీఎస్‌ఎల్‌వీ చివరి దశ మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లనుంది. దీనికి పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటల్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ మాడ్యూల్‌(పీవోఈఎం) అని నామకరణం చేశారు.

TS: జిల్లా కోర్టు జడ్జి గా ఎంపికైన ఏపిపి శ్రీనయ్య

నల్లగొండ జిల్లా:

కొండమల్లేపల్లి మండలంలోని కొలుముంతల పహాడ్ గ్రామానికి చెందిన వస్కుల నర్సింహ- సత్తెమ్మ దంపతులకు కుమారుడు శ్రీనయ్య తెలంగాణ రాష్ట్ర జిల్లా కోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2012 నుండి 2023 వరకు ఆయన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధులు నిర్వహించారు. ఇటీవల వెలువడిన ఫలితాలలో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కొమ్ము రాజశేఖర్, తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

TS: నల్లగొండ జిల్లా ఎస్పీగా చందనా దీప్తి.. ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ.. నల్లగొండ జిల్లా ఎస్పీగా ఐపీఎస్ అధికారి చందనా దీప్తిని నియమించింది. ప్రస్తుతం నల్గొండ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఐపిఎస్ అధికారి అపూర్వరావు ను ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, సిఐడి విభాగానికి ఎస్పీగా బదిలీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

TS: సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డి.ఎస్.పి

హైదరాబాద్: తెలంగాణ మాజీ డీఎస్పీ నళిని శనివారం డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసారు.

తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు.

తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు.

అవసరమైతే తనను కలిసేందుకు నళిని కి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.

NLG: ఎన్జీ కాలేజ్ లో మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సమావేశం

నల్లగొండ: తెలంగాణ సాధన కోసం మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, నేడు పట్టణంలోని ఎన్జీ కాలేజ్ లో సమావేశం అయ్యారు. ఉద్యమకారులు మాట్లాడుతూ.. మలిదశ ఉద్యమంలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు కోల్పోయామని.. అది గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులకు 250 గజాల స్థలంతో పాటు 1969 ఉద్యమకారులకు ఇచ్చిన బెనిఫిట్స్ తమకు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా మలిదశ ఉద్యమకారుల కమిటీ కన్వీనర్ గా పెరిక జయరాజు ని ఎన్నుకొన్నారు. ఉద్యమకారులు మాతంగి అమర్, నలుగురు కిరణ్ కుమార్, పెరిక వెంకటేశ్వర్లు, అల్ల పరమేష్, ఎండీ కాసిం, పర్వతం వేణు, కట్ట శీను, రాంబాబు, లింగస్వామి పాల్గొన్నారు.

కొండమల్లేపల్లి: ఘనంగా ఎస్ఎఫ్ఐ 54వ ఆవిర్భావ దినోత్సవం

నల్లగొండ జిల్లా:

ఎస్ఎఫ్ఐ, దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో, నేడు కొండమల్లేపల్లి లో SFI 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా SFI పతాకాన్ని డివిజన్ అధ్యక్షులు రామావత్ లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. విద్యార్థి పోరాటాలకు దిక్సూచి అయిన SFI , 1970 డిసెంబర్ 30,31 తేదీలలో కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం పట్టణంలో ఆవిర్భవించి, విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. 

స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో గత 54 సంవత్సరాలుగా విద్యార్థులను, ప్రజలను చైతన్య పరుస్తూ భగత్ సింగ్, సావిత్రి బాయి, అంబేద్కర్ లాంటి మహనీయుల స్పూర్తితో సమసమాజన స్థాపనకై కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే విద్య వ్యతిరేక విధానాలపై నిరంతరం మిలిటెంట్ పోరాటాల నిర్వహిస్తూ, ప్రాణ త్యాగాలకు కూడా వెనుకాడని ఏకైక విద్యార్థి సంఘం SFI అని అన్నారు. అలాగే దేశంలో అత్యధిక మెంబర్షిప్ కలిగిన సంఘం ఎస్ఎఫ్ఐ అని కొనియాడారు. 

అదేవిదంగా కొఠారి కమిషన్ ప్రకారం విద్యపై కేంద్ర ప్రభుత్వం 10% నిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 30% కేటాయించాలని పేర్కొన్నా, పాలక ప్రభుత్వాలు విద్యను విస్మరించడం దారుణమని అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా, ఇప్పటికి విద్యను కొనుక్కునే పరిస్థితిలొనే ఉండటం దారుణం అని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం పేరుతో కార్పొరేట్ వారికి లాభం చేకూరేలా చేస్తూ పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర చేస్తుదన్నారు. ఈ నూతన జాతీయ విద్యావిధాన రద్దుకై మేధావులు, విద్యార్థులను కలుపుకొని SFI పోరాటాలు కొనసాగిస్తుందని తెలియచేసారు.

అలాగే మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరుబాట చేయాలని, అమ్మాయిలను పుట్టనిద్దాం - చదవనిద్దాం -ఎదగానిద్దాం కాపాడుకుందాం అనే నినాదాలను ముందుకు తీసుకపోవాలని సూచించారు. అందరికి విద్య - అందరికి ఉపాధి కల్పనకై కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చరణ్, సాయి,రాహుల్, రాజేశ్వరి, అనిత, ఆంజనేయులు, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

TS: విద్యా రంగంపై సమీక్షించనున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు విద్యా రంగంపై సమీక్షించనున్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన ప్రశ్నపత్రం లీకేజీ లు మరియు ఫలితాల ప్రకటనలో తప్పులకు ఆస్కారం లేకుండా SSC, IPE పబ్లిక్ పరీక్షలు, EAMCET, CET లను సజావుగా నిర్వహించే చర్యలపై చర్చించనున్నారు.

TS: ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారుల కు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులకు ఆదేశాలు. రైతు బంధు, పింఛన్ల పై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికి యథావిధిగా ఈ పథకాలు అందుతాయి. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.



TS: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. ముందుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టి, అనంతరం నామినేటెడ్ పదవుల పంపకం చేపట్టాలని భావించినప్పటికీ.. కొన్ని కారణాలతో ముందుగానే ఈ పదవులు భర్తీ చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ముందే ఈ నామినేటెడ్ పదవులు భర్తీ చేపట్టే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతుంది.

HYD: రైలు పట్టాలపై గొడవ, రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

హైదరాబాద్: వారిద్దరూ ఫ్రెండ్స్ మద్యం తాగడం, గంజాయి పీల్చడం వారి హాబీ, తరచూ గొడవలు పడుతుంటారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం వారి మధ్య మళ్లీ వివాదం మొదలైంది. దీంతో రైలు పట్టాలపైకి వెళ్లారు. అక్కడ ఘర్షణ పడ్డారు. ఇదే క్రమంలో రైలు దూసుకొచ్చింది. దీంతో ట్రైన్ ఢికొని.. వారిద్దరూ అక్కడే దుర్మరణం చెందారు.

ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ పాతబస్తీ భవానీ నగర్‌లో కలకలం రేపింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. రైలు పట్టాలపై కొంతమంది గొడవ పడుతున్న సమయం లో ఒక్కసారిగా రైలు వచ్చి ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటన తర్వాత మరి కొంతమంది అక్కడ నుంచి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు.స్థానికుల నుంచి సమాచారం అందుకున్న భవాని నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

రైల్వే పోలీసులు కూడా అక్కడికి చేరుకుని మృత దేహాలను మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు