ఆటనై వస్తా పాటని వస్తా పల్లె పల్లెకు ప్రజా గద్దరై వస్తా పాట ఆవిష్కరణ
ఓయూ తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ చింతకింది కాశీం.
హైదరాబాద్, ఓయూ :
తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు వేముల గోపీనాథ్, ప్రజాయుద్ధ నౌక గద్దర్ పై రాసిన ఆటనై వస్తా.. పాటనై వస్తా... పాటను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు తెలుగు శాఖ విభాగం అధ్యక్షులు ప్రొఫెసర్ చింతకింది కాశీం
ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రొ. కాశీం మాట్లాడుతూ
పల్లె పల్లెకు ప్రజా యుద్ధమై గద్దర్ వచ్చాడని ,తెలుగు సాహిత్యాన్ని దిగంతాలకు వ్యాపింపజేసి పాటను హిమాలయ శిఖరమంత ఎత్తుకు ఎలుగెత్తి పాడాడని, తెలుగు సాహిత్యాన్ని, కవిత్వాన్ని ఈ 50 ఏళ్లలో గద్దర్ శాసించాడాన్నారు.
గద్దరన్న ఆగస్టు 6 2023న అమరుడయ్యాడు. గద్దరన్న భౌతికంగా మనకు దూరమయ్యారు కానీ గద్దరన్న పాట, "మరణించిన ఒక తార రాలిపోయి రాజు మరణించిన ఒక తార గగనం ఎక్కి రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖవి జీవించే ప్రజల నాలుకల యందు" అని గుర్రం జాషువా రాసినట్లు గద్దరన్న ప్రజల నాలుకల్లో జీవిస్తూ ఉన్నాడు .
ఆయన అమరుడు. ఆయనకు మరణము లేదు. ఆయన ఆటకు, పాటకు మరణం లేదు. అందుకే గద్దరన్న అమరుడైన తర్వాత ఇప్పటికీ తెలుగు సాహిత్యంలో ప్రముఖ విమర్శకులు రచయితలు రాసిన ప్రత్యేక సంచికలు వందలాది పేజీలతో ఒక అరడజన్ ప్రత్యేక సంచికలు వచ్చాయి.
అదేవిధంగా గద్దరన్న తెలుగు నేలమీద ఒక వారసత్వాన్ని కొనసాగించాడు. ఒక ఆచరణని స్థిరపరిచారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సుద్దాల హన్మంతు, బండి యాదగిరి నెలకొల్పిన వారసత్వాన్ని 1970లో గద్దరన్న కొనసాగించాడు. ఆ ఆచరణ స్థిరపరచడం వలన ఇప్పుడు గోసి కట్టుకొని గొంగడేసుకుని చేతిలో ఎర్రజెండా పట్టుకొని విప్లవ గానం చేసే ఒక పద్ధతిని తెలుగు నేల మీద గద్దర్ వేదికై వస్తున్నాడు.
అంటే ఒక కళాఖండం వస్తున్నది. ప్రజలందరూ ప్రేక్షకులందరూ అనుకునేటట్లు ఒక పద్ధతిని రూపొందించారు. అల్లసాని పెద్దనని ఒక 50 నుండి 100 మంది అనుసరించారు. గద్దరన్నను వేలాదిమంది అనుసరించారు, అనుసరిస్తూ ఉన్నారు. అందుకే గద్దరన్న మరణం కావటాన్ని జీర్ణించుకోలేని కళాకారులు ఆయన లాగా పాడాలని, ఆడాలని భావించిన కళాకారులు ఈ తెలుగు నేలమీద వేలాది ఘంటాలుగా వికసిస్తున్నారు.
కనుక ఆయన మీద ఇప్పటి వరకు కొన్ని వందల పాటలు వచ్చాయి. ఇవాళ తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో తెలంగాణ విద్యార్థి వేదికలో కార్యకర్తగా, నాయకత్వం స్థాయిలో పనిచేసి విశ్వవిద్యాలయ స్థాయిలో చదువుకున్నటువంటి గోపీనాథ్ గద్దర్ మీద పాట రాయడం , ఒక విద్యార్థి నాయకుడు మాత్రమే కాదని కళాకారుడు. నల్లగొండ జిల్లాలో మాదిగ కుటుంబంలో పుట్టి పెరిగిన కళాకారుడు ఏ కళ అయితే వారికి అందించిందో ఆ కళారూపాన్ని అందుకొని గోపినాథ్ తన సోదరుడు అందీప్ ఇద్దరు కలిసి పాడిన పాట ఇది.
ఆటనై వస్తా పాటనై వస్తా పాట ఎంత ముఖ్యమో పాటకి సంగీతం అంతే ముఖ్యం కనుక అరుణోదయ కళాకారుడిగా అరుణోదయ కార్యకర్తగా నాయకుడిగా ఉన్నా వెంకట్ ఒక అద్భుతమైన మంచి శ్రావ్యమైన సంగీతాన్ని అందించాడు. దీనికంటే ఈ పాట ప్రముఖంగా గద్దరన్న ఆలోచన విధానాన్ని ప్రజల మార్పు కోసం విప్లవం కోసం ఏదైతే గద్దరన్న కోరుకున్నాడో ఈ పాటలో ఉన్నది.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సభ్యులు కోట శ్రీనివాస్, ఎం,ఎస్ ఎఫ్ జాతీయ అధ్యక్షులు సోమశేఖర్ , టిపిసిసి మేనిఫెస్టో కమిటీ సభ్యులు డాక్టర్ లింగం యాదవ్, న్యాయవాదులు లక్ష్మీ దేవి, ఆంజనేయులు, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు పోటు నారాయణ, శ్రీమాన్ , పగిళ్ల సందీప్, రాజేంద్రప్రసాద్, పేరాల గోపి,చందు ,భాస్కర్, గ్యారా శ్రీనివాస్, సంపతి సోమయ్య, శ్రీనివాస్, వెంకటేష్,వినోద్, మహేష్ ,సూర్యుడు,పీటర్, చరణ్, తదితరులు పాల్గొన్నారు.
Oct 23 2023, 10:12