/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Chandrababu: పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసుల యత్నం Yadagiri Goud
Chandrababu: పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసుల యత్నం

పుంగనూరు: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 'ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పర్యటనలో భాగంగా అంగళ్లు నుంచి పుంగనూరు బయల్దేరిన చంద్రబాబును అడ్డుకునేందుకు వైకాపా శ్రేణులు విశ్వప్రయత్నం చేస్తున్నాయి.

రహదారికి అడ్డంగా లారీని అడ్డు పెట్టరు. లారీ అడ్డు తొలగించాలని ఆందోళనకు దిగిన తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఈ క్రమంలో పోలీసు వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి, గాల్లోకి కాల్పులు జరిపినట్టు సమాచారం. పోలీసులు లాఠీ ఛార్జిలో పలువురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి.

వైకాపా దాడిలో 20కార్లు ద్వంసం..

పుంగనూరు పట్టణంలోకి చంద్రబాబుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. చంద్రబాబు వచ్చే మార్గంలో భీమగానిపల్లి వద్ద ప్రధాన రహదారిపై కంటైనర్‌ లారీ, వాహనాలను పోలీసులు అడ్డుపెట్టారు. దీంతో పోలీసులు, తెదేపా కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరో వైపు అంగళ్లు నుంచి చంద్రబాబు కాన్వాయ్‌ వెంట వెళ్తున్న తెదేపా నేతల వాహనాలపై వైకాపా శ్రేణులు రాళ్ల దాడి చేశాయి. ఈ ఘటనలో దాదాపు 20కి పైగా కార్ల అద్దాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది.

అంగళ్లులో రెచ్చిపోయిన వైకాపా..

అధికారమే అండగా అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలం అంగళ్లులో వైకాపా శ్రేణులు రెచ్చిపోయారు. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తెదేపా శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లను వైకాపా కార్యకర్తలు చించేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడి చేశాయి. వైకాపా రాళ్ల దాడిలో మదనపల్లె మండలం కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్రతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను నిలువరించేందుకు ప్రయత్నించారు. రాళ్లదాడి చేస్తున్న వైకాపా కార్యకర్తలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని తెదేపా శ్రేణులు ఆరోపించారు. గాయపడిన కార్యకర్తలకు వెంటనే చికిత్స చేయించాలి పార్టీ నాయకులను చంద్రబాబు ఆదేశించారు.

ధైర్యం ఉంటే రండి.. చూసుకుందాం: చంద్రబాబు

''తెదేపా కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారు. డీఎస్పీ తన యూనిఫామ్‌ తీసేయాలి. బాంబులకే భయపడలేదు.. రాళ్లకు భయపడతానా? ధైర్యం ఉంటే రండి చూసుకుందాం. పులివెందులకే వెళ్లాను ఇక్కడికి రాకూడదా? నేనూ చిత్తూరు జిల్లాలోనే పుట్టా. పోలీసుల అండతోనే వైకాపా నేతలు రాజకీయం చేస్తున్నారు. ఎవరి జోలికీ మేము పోము.. మా జోలికి వస్తే ఊరుకోము. పుంగనూరు వెళ్తున్నా.. అక్కడి పుడింగి సంగతి తేలుస్తా. ఇక్కడ ఒక రావణాసురుడు ఉన్నాడు. అతనికి ట్యాగ్‌ ఎమ్మెల్యే. ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. ఇలాంటి నాయకులను రాజకీయంగా భూస్థాపితం చేయాలి. ఇక్కడ జరిగిన ఘటనలో పోలీసుల వైఫ్యలం ఉంది. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. అంగళ్లు ఘటనపై విచారణ జరపాలి. రాబోయే రోజుల్లో వైకాపాను తరిమికొట్టే పరిస్థితి వస్తుంది. పోలీసులు ఎవరికి ఊడిగం చేస్తున్నారు. ప్రజలు భూస్థాపితం చేస్తారనే భయంతోనే ఇలా చేస్తున్నారు'' అని చంద్రబాబు మండిపడ్డారు..

Governor Tamilisai: ఆర్టీసీ బిల్లుకు ఇంకా ఆమోదం తెలపని గవర్నర్‌

హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ నుంచి అనుమతి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును గవర్నర్‌ తమిళిసైకు పంపి రెండు రోజులు గడిచినప్పటికీ..

ఆమె ఇంకా ఆమోదం తెలపలేదు. ఈ శాసనసభ సమావేశాల్లో బిల్లు పెట్టాలని ప్రభుత్వం భావించింది.

అయితే ఇది ఆర్థికపరమైన బిల్లు కావడంతో గవర్నర్‌కు పంపించింది. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం బిల్లు రూపొందించింది..

SB NEWS

SB NEWS

Central Jail: సెంట్రల్ జైలులో మత్తు పదార్థాల కలకలం.. ఖైదీలకు చేరవేస్తున్న నిందితుడు అరెస్ట్

visakha Central Jail: గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆగడం లేదు. రోజు రోజుకూ గంజాయి అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి..

ఎంతలా అంటే.. ఏకంగా సెంట్రల్‌ జైలులో అమ్మకాలు జరిగేంతగా పెరిగిపోయాయి. విశాఖపట్నంలోని సెంట్రల్‌ జైలులో మత్తు పదార్థాలు కలకలం సృష్టించాయి. గంజాయి, గుట్కాలు గుట్టు చప్పుడు కాకుండా ఖైదీలకు చేరవేస్తున్న నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. చాలా కాలంగా ఖైదీలకు మత్తు పదార్థాలు చేరవేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు..

సెంట్రల్‌ జైలులో ఖైదీలకు మత్తు పదార్థాలను చేరవేస్తున్న మైలపల్లి ఎల్లాజీని సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మత్తు పదార్థాలను బాల్స్‌లాగా చుట్టి జైలు గోడ మీద నుంచి విసరడం ద్వారా ఖైదీలకు నిందుతుడు చేరవేస్తున్నాడు.

చాలా కాలంగా నిందితులను పట్టుకోవాలని వేచిచూస్తున్న పోలీసులు.. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. అతడిని పట్టుకోవడం కోసం నిఘా పెట్టిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. ఆరిలోవ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి 14 రోజులు రిమాండ్ విధించారు.

ఈ నేపథ్యంలో గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు విక్రయించినా, రవాణా చేసినా, సేవించినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబమని పోలీసులు హెచ్చరించారు. స్వలాభం కోసం ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే గంజాయి అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందన్నారు. ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు..

రైతు రుణమాఫీ, ఆర్టీసీ విలీనంపై తీర్మానాలు ప్రవేశపెట్టిన ఎమ్మెల్సీలు

రైతు రుణమాఫీ సహా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను అభినందిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు గురువారం శాసనమండలి

లో తీర్మానాలను ప్రవేశపెట్టారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రైతు రుణమాఫీ చేయడం పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల అభినందిస్తూ

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, శాసనమండలి విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌రావు మరో తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని రైతుల రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని వారన్నారు.

రైతులకు రూ. 19వేల కోట్ల రుణాలను మాఫీచేస్తామని ప్రకటించి గురువారం నుంచే రుణాలను మాఫీ చేయడం ప్రారంభించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు. టీఎస్‌ ఆర్టీసీ సంస్థను విలీనం చేయడంతో ఆర్టీసీలో పనిచేస్తున్న 43,373 మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారని వెల్లడించారు.

సంస్థ పరిరక్షణతో పాటు, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు....

వీకెండ్ వచ్చేసింది.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి :ఆగస్టు 04

వీకెండ్ వచ్చేసింది. వీకెండ్‌లో సర్వసాధారణంగా భక్తుల రద్దీ పెరుగుతుందన్న విషయం తెలిసిందే.

శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. నేడు టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 59,898 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.44 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 26,936 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు....

ములుగు జిల్లా చేసిన పాపం ఏంటి ❓️

అసెంబ్లీ సమావేశాల్లో వరదలపై చర్చను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.

అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆమె మీడియాతో మాట్లాడారు. శుక్రవారం అసెంబ్లీలో వరదలపై చర్చ జరపాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం. మోరంచపల్లి, వరంగల్ వరకు వస్తున్న మంత్రులు ములుగు నియోజకవర్గానికి ఎందుకు రావడం లేదు?, గవర్నర్, ముఖ్యమంత్రి మా ప్రాంతాల్లో పర్యటించాలి. భారీ వర్షాలతో నిలువ నీడ లేకుండా చెట్ల కింద ఉండే పరిస్థితి ఏర్పడింది. లక్షలాది ఎకరాల పంట నష్టం జరిగింది. 50 మందికి పైగా మరణించారు.

ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి భరోసా ఇస్తారనుకున్నాం. ములుగులో వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. 15 మంది కొట్టుకుపోయి చనిపోయారు. వందలాది ఇల్లు కూలిపోయాయి. ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి భరోసా కల్పించలేదు. చనిపోయిన వారికి రూ.15 లక్షలు, ఇల్లు కూలిపోయిన వారికి రూ.5 లక్షలు, సామాన్లకు లక్ష ఇవ్వాలి. ఎకరాకు 30 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. తాత్కాలిక వంతెనలు నిర్మించి రవాణా సౌకర్యం కల్పించాలి.

ప్రభుత్వం రూ.500 కోట్లు అని ప్రకటన విడుదల చేశారు. కానీ దేనికి అని మాత్రం ఏం చెప్పలేదు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందుతుంటే 5 సంవత్సరాల క్రితం ఇచ్చిన రుణమాఫీపై ఇప్పుడు సంబరాలు చేసుకోవాలని చెబుతున్నారు.

బ్యాంకులు రైతులను వేదిస్తున్నాయి. ఋణమాఫీ విధివిధానాలు వెంటనే తెలపాలి. వరద బాధిత కుటుంబాల సమస్య మాకు ఆవేదన కల్పిస్తుంది. అసెంబ్లీలో స్పష్టమైన చర్చ జరగాలి.’’ అని సీతక్క కోరారు..

Political BRO : 'బ్రో' సినిమాపై ఆగని రచ్చ.. ఢిల్లీ వేదికగా మరోసారి మంత్రి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్రో' (BRO) మూవీపై ఏపీ రాజకీయాల్లో (AP Politics) పెద్ద దుమారమే రేగుతోంది..

ఇందులో సీఎం వైఎస్ జగన్ రెడ్డిని (CM YS Jagan Reddy) ఉద్దేశించి కొన్ని డైలాగ్స్, మంత్రి అంబటి రాంబాబు (Minister Rambabu) సంక్రాంతి పండుగకు వేసిన డ్యాన్స్‌ను ఇమిటేట్ చేస్తున్నట్లు ఉన్నాయని ఈ మూవీ టీమ్‌పై వైసీపీ శ్రేణులు (YSR Congress) మండిపడుతున్నాయి.

ఛాన్స్ దొరికితే చాలన్నట్లుగా మునుపటిలాగే పవన్‌పై సోషల్ మీడియా (Social Media) వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇప్పటికే అటు చిత్రబృందం.. ఇటు అంబటి రాంబాబు ఒకరిపై ఒకరు ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించుకున్నారు. సీన్ కట్ చేస్తే ఈ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీకి చేరింది.

బుధవారం నాడు ఢిల్లీకెళ్లిన అంబటి.. 'బ్రో' మూవీపై ఫిర్యాదు చేస్తానన్నారు. ఢిల్లీ వేదికగా మీడియా మీట్ నిర్వహించిన మంత్రి.. బ్రో సినిమా, పోలవరం ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కుటుంబ సభ్యులతో మోడీని కలిసిన బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు.

జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తరువాత తొలిసారి బండి సంజయ్ ప్రధానిని కలిశారు.

తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్ ను మోడీ ఈ సందర్భంగా అభినందించారు.

రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడంతో పాటు వారి యోగ క్షేమాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు........

అసెంబ్లీ సాక్షిగా ఈటెలపై ప్రేమ వర్షం కురిపించిన కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లోపల ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

మంత్రి కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్ళి ఆప్యాయంగా పలుకరించి ఆలింగనం చేసుకున్నారు. ఒకరినొకరు హత్తుకున్నారు. పదినిమిషాల పాటు ఇరువురు మాట్లాడుకున్నారు.

కాగా అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు సభ నివాళి అర్పించింది. సాయన్న మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సాయన్న లేని లోటు తీర్చలేనిదన్నారు. కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలపాలని ఆయన ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. సాయన్న అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన నేత అని అన్నారు.

సాయన్న కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మిగిలిన సభ్యులు కూడా సాయన్న మృతిపట్ల సంతాపం తెలుపుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సభా వేదికగా పంచుకున్నారు. సాయన్న మృతికి శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి శుక్రవారం వాయిదా పడింది.

తిరుపతి లడ్డు కు 308 ఏళ్ల చరిత్ర

ఏడుకొండలు ఎక్కి వెంకన్నను దర్శించుకున్నంత పుణ్యం.. తిరుపతి లడ్డూను తింటే వస్తుందనే నమ్మకం తెలుగు ప్రజల్లో ఎక్కువ. తిరుమల వెంకన్న కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడని, తమ కష్టాలను తొలగించే దివ్య పురుషుడని భక్తుల విశ్వాసం. అందుకే.. నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు.

అలా తిరుమలకు వచ్చిన భక్తులు స్వామి వారి దర్శనం అనంతరం, స్వామి వారి ప్రసాదమైన లడ్డూనూ తమతో పాటూ ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. ఈ లడ్డూను తమ ఇంటిలో భక్తి శ్రద్దలతో పూజించి ఆత్మీయులకు పంచిపెడుతూ ఉంటారు.

అంతటి విశిష్టత ఉన్న తిరుపతి లడ్డూ.. ఇప్పుడు మూడు వందల సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆలయ పోటులో ప్రత్యేకంగా తయారయ్యే ఈ లడ్డూలను స్వామివారి ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రారంభించి ఇప్పటికి 308 ఏళ్లు పూర్తయ్యాయి.

1715 ఆగస్టు 2 న తొలిసారిగా లడ్డూను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.కాలానుగుణంగా పెరుగుతున్న భక్తుల రద్దీ నేపధ్యంలో రోజూ దాదాపు మూడు లక్షల ఇరవై వేల లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది.

ఇంతటి విశిష్టత, ప్రాధాన్యత కలిగిన తిరుపతి లడ్డూకు పేటేంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉన్నాయి. 2014లో తిరుపతి లడ్డూకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపు కూడా లభించింది. ఆ విధంగా తరాలు మారుతున్నా తరగని రుచితో.. హిందువుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది తిరుపతి లడ్డూ. అంతేకాదు తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలకి పెద్ద చరిత్రే ఉంది. సుప్రభాత సమయంలో స్వామి వారికి వెన్నతో మొదలు పెట్టి, లడ్డూ, వడ, పోంగలి, దద్దోజనం, పులిహోరా, వడపప్పు, ఇలా రకరకాల నైవేద్యాలను నివేదిస్తారు. తిరుమల లడ్డూకు ఏకంగా 308 ఏళ్ల చరిత్ర ఉందంటే కాస్త ఆశ్చర్యంగా ఉందనే చెప్పాలి...