/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz కాంగ్రెస్‌లోకి జూపల్లి కృష్ణారావు Yadagiri Goud
కాంగ్రెస్‌లోకి జూపల్లి కృష్ణారావు

ఎట్టకేలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉదయమే జూపల్లితో పాటు పలువురు నేతలు ఖర్గే నివాసానికి చేరుకున్నారు.

కాసేపటి క్రితమే జూపల్లి సహా కూచుకుల్ల రాజేశ్ రెడ్డి, వనపర్తి నేత మెగారెడ్డి, మాజీ శాసనసభ్యులు గుర్నాథ్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలకు ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

కాగా.. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ చేరిక పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అప్పుడూ అంటూ గత రెండు నెలల నుంచి వాయిదా పడుతూనే వస్తోంది. చివరకు గత నెలలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి జూపల్లిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాలని పార్టీ వర్గాలు భావించాయి. ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా వస్తారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రచారం కూడా నిర్వహించారు.

అయితే భారీ వర్షాల కారణంగా ఆ సభ కూడా వాయిదా పడిపోయింది. దీంతో నిన్న బుధవారం జూపల్లి కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో జూపల్లి సహా మిగిలిన నేతలంతా మంగళవారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు.

నిన్న ఉదయం నుంచి జూపల్లి కాంగ్రెస్‌లో చేరికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. చివరకు అనివార్య కారణాల వల్ల జూపల్లి చేరిక వాయిదా పడినట్లు కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి వెల్లడించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది.

అయితే నిన్న రాష్ట్రపతితో ప్రతిపక్ష నేతల అపాయింట్మెంట్ నేపథ్యంలో ఖర్గే బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జూపల్లి చేరిక మరోసారి వాయిదా పడింది. చివరకు ఈరోజు ఉదయం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొల్లాపూర్‌లో త్వరలోనే భారీ బహిరంగ సభ పార్టీ వర్గాలు తెలియజేశాయి.......

రైతు రుణామాఫీ... చారిత్రాతమకమైన నిర్ణయం !

రైతులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ వినిపించారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీపై ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్.. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 3 నుంచి ప్రారంభించి.. సెప్టెంబర్ రెండు వారంలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ కాకుండా మరో రూ.19 వేల కోట్ల రుణమాఫీని రైతులకు అందించాల్సుందని కేసీఆర్ పేర్కొన్నారు.

19 వేల కోట్ల రుణమాఫీ చేయనున్నట్టు కేసీఆర్ స్పష్టం

చేశారు. తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల రుణమాఫీని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించి.. అన్నదాతలకు గుడ్‌న్యూస్ వినిపించింది. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఆగస్టు 3 నుంచి తిరిగి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి నుంచి తిరిగి ప్రారంభించాలని మంత్రి హరీశ్ రావుతో పాటు కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.

రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ.. నెలపదిహేను రోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు.. రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి వుందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర సర్కారు ప్రధాన లక్ష్యమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.

అయితే.. కేంద్ర సర్కారు తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనంతో పాటు కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులు విడుదల చేయకపోవటం, తెలంగాణ పట్ల కేంద్రం చూపిన వివక్ష... లాంటి కారణాల వల్ల ఆర్థికలోటుతో ఇన్నాళ్లు కొంత ఆలస్యమైందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే.. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్న క్రమంలో.. రాష్ట్రంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టు కేసీఆర్ తెలిపారు.

ఈ విషయంపై ప్రగతిభవన్‌లో బుధవారం రోజున సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావు, ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఎ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు.

AP High Court: ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై నేడు హైకోర్టు తీర్పు

అమరావతి: రాజధాని అమరావతి ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు,

జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గురువారం తీర్పు ఇవ్వనుంది..

రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు,

1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు,

ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ ఐకాస హైకోర్టులో వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల :ఆగస్టు 03

గత మూడు రోజులతో పోలిస్తే నేడు గురువారం తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది.

శ్రీవారి దర్శనం కోసం భక్తులు 9 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

నిన్న బుధవారం శ్రీవారిని 69,365 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.05 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 26,006 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ..

•తొలి రోజు దివంగత సభ్యులకు సంతాపం, బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ భేటీ

•నాలుగు రోజుల పాటు కొనసాగనున్న ఉభయసభల సమావేశాలు

శాసనసభ, శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతాయి.

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశంలో ముందుగా కంటోన్మెంట్‌ దివంగత ఎమ్మెల్యే సాయన్నతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం పాటిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత స్పీకర్‌ అధ్యక్షతన జరిగే బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో శాసనసభ సమావేశాల నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు చేస్తారు.

సుమారు నాలుగురోజుల పాటు శాసనసభ సమావేశాలు జరిగే అవకాశముంది. బీఏసీ భేటీలో విపక్షాల నుంచి వచ్చే సూచనలు, ప్రతిపాదనల ఆధారంగా అవసరమైతే సమావేశాల తేదీలను పొడిగించొచ్చు.

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగే మండలి సమావేశాల్లో తొలిరోజు రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో మండలి నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు చేస్తారు.

CM Kcr: రైతులకు శుభవార్త.. ఆగస్టు 3 నుంచి రుణమాఫీ ప్రక్రియ..

హైదరాబాద్‌: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. రుణమాఫీ ప్రక్రియను ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

రైతు రుణమాఫీపై ప్రగతి భవన్‌లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఇతర అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు రుణమాఫీపై చర్చించారు..

రాష్ట్ర రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న కేసీఆర్‌.. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం కారణంగా ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యల వల్లే.. రైతు రుణమాఫీ పూర్తి చేయడానికి సమయం పట్టిందని సీఎం తెలిపారు.

రైతుల ప్రయోజనాల దృష్ట్యా రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్‌, సాగునీటి పథకాలను చిత్తశుద్ధితో కొనసాగిస్తున్నట్టు సీఎం వివరించారు. ఇప్పటికే పూర్తి చేసిన రుణమాఫీ పోగా .. మరో రూ.19వేల కోట్ల రుణమాఫీ సొమ్ము రైతులకు అందించాల్సి ఉందని తెలిపారు. రైతు బంధు తరహాలో విడతలవారీ రుణమాఫీ చేస్తూ .. సెప్టెంబరు రెండో వారం నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు..

స్త్రీ, శిశుసంక్షేమ శాఖపై సమీక్ష.. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ అందజేసిన సీఎం జగన్‌

గుంటూరు: వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ(YSR Sampoorna Poshana), టేక్‌హోం రేషన్‌ కార్యక్రమాన్ని బుధవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు..

లబ్ధిదారులకు స్వయంగా ఆయనే కిట్‌లను అందజేశారు.

ఈ సందర్భంగా పంపిణీ చేసే రేషన్‌ సరుకులను అంతకు ముందు పరిశీలించారాయన.

గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం కోసం జగనన్న ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ పథకం సత్ఫలితాలనిస్తోంది.

ఇక ఈ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం. స్త్రీ, శిశు సంక్షేమ శాఖపైనా సీఎం జగన్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఉషాశ్రీచరణ్‌, సంబంధిత విభాగపు ఉన్నతాధికారులు హాజరయ్యారు..

తెలంగాణ బీజేపీకి టార్గెట్ ఫిక్స్ చేసిన అమిత్ షా.. కిషన్ రెడ్డితో సహా ముఖ్య నేతలంతా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాల్సిందే

తెలంగాణ బీజేపీకి టార్గెట్ ఫిక్స్ చేసిన అమిత్ షా..

•కిషన్ రెడ్డితో సహా ముఖ్య నేతలంతా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాల్సిందే

అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా 75 సీట్లు గెలిచి తీరాల్సిందే అంటూ ఆర్డర్. ఎంత పెద్ద లీడర్ అయినా సరే ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందే..

కిషన్ రెడ్డితో సహా ముఖ్య నేతలంతా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని అమిత్ షా ఆర్డర్.

కిషన్ రెడ్డి ఇంట్లో హైలెవెల్ మీటింగ్ ఏర్పాటు. తెలంగాణ బీజేపీ ఆపరేషన్స్ అన్నీ ఇకపై ఢిల్లీ నుండే.

ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ బీజేపీ వార్ రూమ్ ఏర్పాటు. పార్టీ లైన్ దాటితే ఇకపై ఢిల్లీ నుండి వార్నింగులు..

వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని నేతలకు హెచ్చరిక.

chandrababu: నేను ప్రాజెక్టులపై మాట్లాడుతుంటే.. ఆయన 'బ్రో' గురించి మాట్లాడుతున్నారు: చంద్రబాబు

గండికోట: నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేని సీఎం జగన్.. కొత్త ప్రాజెక్టుల పేరుతో మరో దోపిడీకి తెరలేపారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు..

కొత్తగా 10 ప్రాజెక్టులంటూ రూ.12వేల కోట్ల దోపిడీకి సిద్ధమయ్యారన్నారు. ఇవాళ గండికోట రిజర్వాయర్‌ను చంద్రబాబు సందర్శించారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు వద్ద ఆగిన పనులను కొండలపైకి నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. ''రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తూనే.. మంత్రి పెద్దిరెడ్డికి మాత్రం రూ. 600 కోట్ల బిల్లులను సెటిల్‌ చేశారు.

ఏ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎవరికి పేరు వస్తుందోనని పెండింగ్ ప్రాజెక్టులను వదిలేశారు.

ఉన్న ప్రాజెక్టులు రద్దుచేసి.. 23 ప్రాజెక్టులతో రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం పేరుతో జగన్ డ్రామాలాడుతున్నారు. నాలుగేళ్లలో ఒక్కటీ పూర్తి చేయలేదు. నెలకోసారి దిల్లీ వెళ్లే జగన్.. ఈ ప్రాజెక్టులపై కేఆర్ఎంబీ, ఎన్‌జీటీ, సీడబ్ల్యూసీ నుంచి ఎలాంటి అనుమతులు తేలేకపోయారు.

Manipur: ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్‌ చేయండి.. రాష్ట్రపతిని కోరిన ఇండియా కూటమి

దిల్లీ: గత మూడు నెలలుగా ఆందోళనలతో అట్టుడుకుతున్న మణిపుర్‌(Manipur) నుంచి ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని 'ఇండియా' (INDIA) కూటమి సభ్యులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu)కు విజ్ఞప్తి చేశారు..

ఈ చర్య రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడులను సరిదిద్దేందుకు సహాయపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. మణిపుర్‌ పర్యటనకు వెళ్లి వచ్చిన 21 మంది ఇండియా కూటమి సభ్యులు బుధవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. మణిపుర్‌లో హింసాత్మక ఘటనల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆమెను కోరారు. 

రాష్ట్రపతిని ఇండియా కూటమి ఎంపీలు కలిసినప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌ (TMC) సభ్యురాలు సుస్మితా దేవ్‌ మణిపుర్‌ మహిళలను రాజ్యసభకు నామినేట్‌ చేయాలని అభ్యర్థించారు.

అలాగే, మణిపుర్‌ ఘటనలపై పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని ప్రధాని మోదీని అడగాలని ప్రతిపక్ష నేతలు రాష్ట్రపతిని కోరారు. ''మణిపుర్‌లో వేర్వేరు వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని రాష్ట్రపతికి సూచించాం.

ఈ చర్య రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను సరిదిద్దేందుకు ఉపయోగకరంగా ఉంటుంది'' అని సుస్మితా దేవ్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌, జేడీయూ నాయకుడు రాజీవ్‌ రంజన్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, శివసేన (యూబీటీ) నాయకులు అర్వింద్‌ సావంత్‌, సంజయ్‌ రౌత్‌, టీఎంసీ నాయకులు సుదీప్‌ బంధోపాధ్యాయ, డెరెక్‌ ఒబ్రెయిన్‌లు ఉన్నారు..